ETV Bharat / offbeat

నోరూరించే "గోంగూర చికెన్ నిల్వ పచ్చడి" - ముద్దకో ముక్క తినొచ్చు!

చికెన్, గోంగూరతో సింపుల్​గా చేసుకునే రెసిపీ - నోటికి సరికొత్త రుచిని ఇస్తుంది!

Gongura Chicken Pachadi
Gongura Chicken Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 13, 2026 at 2:18 PM IST

3 Min Read
Choose ETV Bharat

Gongura Chicken Pachadi Prepare : నాన్​వెజ్ ప్రియులకు చికెన్ ఫేవరెట్ రెసిపీ! వీటితో ఎన్ని రకాల వెరైటీలు చేసినా ఇష్టంగా తింటారు. అందుకే ఇవాళ మీకోసం ఓ సరికొత్త రెసిపీని తీసుకొచ్చాం. అందే గోంగూర చికెన్ నిల్వ పచ్చడి. ఇలా చేశారంటే ఇళ్లంతా ఘుమఘుమలాడాల్సిందే. అంతేకాక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇక ఇంటిల్లిపాదీ ముద్దకో ముక్క చొప్పున ఇష్టంగా తింటారు.

హరియాణా స్టైల్ గరం గరం "బేసన్ మసాలా రోటీలు" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

Gongura Chicken Pachadi
గోంగూర (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఎర్ర గోంగూర - 250 గ్రాములు (పావు కేజీ)
  • చికెన్ - 500 గ్రాములు (అర కిలో)
  • చింతపండు - 30 గ్రాములు
  • ఆయిల్ - 2 కప్పులు
  • ధనియాలు - అర టేబుల్ స్పూన్
  • జీలకర్ర - అర టేబుల్ స్పూన్
  • మెంతులు - అర టీ స్పూన్
  • లవంగాలు - 5
  • దాల్చినచెక్క - 1
  • పసుపు - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు
  • కారం - 5 టేబుల్ స్పూన్లు
Gongura Chicken Pachadi
మసాలా దినుసులు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా పావు కేజీ ఎర్ర గోంగూరను గిన్నెలో వేసి మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత గోంగూర ఆకులను క్లాత్​పై వేసి ఆరబెట్టాలి. అనంతరం వీటిని ముక్కలుగా కట్ చేసి పక్కనుంచాలి.
  • అలాగే చిన్న గిన్నెలో 30 గ్రాముల చింతపండు, సరిపడా వేడి నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. పది నిమిషాల అనంతరం చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
Gongura Chicken Pachadi
చికెన్ (Getty Images)
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో కప్పు ఆయిల్ పోయాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులు వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇందులో తీసి పెట్టుకున్న చింతపండు రసం పోసి ఆయిల్ సేపరెట్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఆయిల్ సేపరెట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో అర టేబుల్ స్పూన్ ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టీ స్పన్ మెంతులు, ఐదు లవంగాలు, ఒక దాల్చినచెక్క వేసి దోరగా వేయించాలి. మసాలా దినుసులు చక్కగా వేగాక మిక్సీజార్​లో వేసి గ్రైండ్ చేయాలి.
Gongura Chicken Pachadi
అల్లంవెల్లుల్లి పేస్ట్ (Getty Images)
  • ఇదే కడాయిలో మరో కప్పు ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత అర కిలో చికెన్, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మంటను హై ఫ్లేమ్​లో ఉంచి వేయించాలి.
  • చికెన్ మిశ్రమం వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్​లో ఉంచి అల్లంవెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిచల్లారనివ్వాలి.
Gongura Chicken Pachadi
కారం (Getty Images)
  • చికెన్ మిశ్రమం కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, ఐదు టేబుల్ స్పూన్ల కారం, రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత వేయించిన గోంగూర యాడ్ చేసి మిక్స్ చేయాలి.
  • అంతే గోంగూర చికెన్ నిల్వ పచ్చడి రెడీ అయినట్లే!
  • అనంతరం ఈ పచ్చడిని గ్లాస్ జార్​లో వేసి స్టోర్ చేసుకుంటే నెల రోజుల నిల్వ పాటు ఉంటుంది!
  • మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఓసారి ఈ విధంగా ట్రై చేయండి.

పసందైన "అటుకుల కొబ్బరి పూర్ణాలు" - పర్ఫెక్ట్​గా పొంగాలంటే ఇలా ట్రై చేయండి!

టేస్టీ "రంభా చికెన్" రెసిపీ మీకోసం - అద్దిరిపోయే ఈ కర్రీ దాబాల్లో మాత్రమే దొరుకుతుంది!