ETV Bharat / offbeat

గ్యాస్ స్టవ్ నుంచి "మంట" సరిగ్గా రావట్లేదా? - మీరే ఈజీగా 'సమస్య' సాల్వ్ చేసుకోండిలా!

గ్యాస్ స్టవ్ రిపేరింగ్​ టిప్స్ - ఇంటి దగ్గర మీరే ఇలా పరిష్కరించుకోవచ్చంటున్న నిపుణులు!

Gas Stove Maintenance Tips
Gas Stove Maintenance Tips (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 8, 2026 at 5:26 PM IST

3 Min Read
Choose ETV Bharat

Gas Stove Maintenance Tips : ప్రస్తుతం మెజార్టీ జనాలు కుకింగ్ కోసం ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​ను వాడుతున్నారు. ఇది కొత్తగా తీసుకున్నప్పుడు మంట బాగానే వచ్చి వంటలు త్వరగా పూర్తి అవుతాయి. కానీ, కొంతకాలం వాడాక బర్నర్స్ నుంచి మంట సరిగ్గా రాదు. ముఖ్యంగా పాలు, పప్పు వంటివి బాయిల్ చేసేటప్పుడు పొంగడం, ఇతర వంట పదార్థాలు బర్నర్స్​పై అంటుకోవడమే అందుకు ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. అలాంటి టైమ్​లో గ్యాస్ బర్నర్స్ నుంచి తక్కువ మంట వస్తుంటుంది. ​అప్పుడు స్టవ్​ను రిపేరింగ్​ కోసం షాపుకి తీసుకెళ్తుంటాం. కానీ, చిన్నపాటి రిపేరింగ్​కి కూడా షాపుకి వెళ్లకుండా మీరే నిమిషాల్లో ఈ చిన్న ట్రిక్​తో ఇంట్లో ఆ ప్రాబ్లమ్​ను సాల్వ్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, గ్యాస్ స్టవ్ మునుపటిలా ఎక్కువ మంట రావడానికి తోడ్పడే ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • గ్యాస్ స్టవ్ రిపేరింగ్ ప్రారంభించడానికి ముందుగా సిలిండర్ దగ్గర రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలి. అవసరమైతే రెగ్యులేటర్​ను సిలిండర్ నుంచి వేరు చేసుకుంటే ఇంకా మంచిది. అలాగే, రిపేరింగ్ కోసం అవసరమైన సేఫ్టీ పిన్(పిన్నీసు) రెడీగా ఉంచుకోవాలి. అనంతరం రిపేరింగ్ ప్రాసెస్ మొదలుపెట్టాలి.
  • ముందుగా స్టవ్ మీద ఉండే బర్నర్ స్టాండ్స్, బర్నర్స్, ప్లేట్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్​ను ఏదైనా బల్ల లేదా అది ఉన్న చోటనే తలక్రిందులుగా తిప్పుకోవాలి. అంటే బ్యాక్ పోర్షన్ అనేది పైకి కనిపించేలా చూసుకోవాలి.
  • అనంతరం మీరు ఏ బర్నర్ నుంచి అయితే తక్కువగా మంట వస్తుందో దాని కనెక్టింగ్ పాయింట్​ను(గ్యాస్ వచ్చే పైపు, బర్నర్ సెట్ కలిసే ప్లేస్) ఒకసారి పరిశీలించాలి.
  • అక్కడ మీరు గమనించినట్లయితే బర్నర్ సెట్ కింద ఒక చిన్న రంధ్రం కనిపిస్తుంది. దాని నుంచే గ్యాస్ సరఫరా అవుతుంది. కాబట్టి, దానిలో ఏదైనా దుమ్ము, ధూళి జామ్ అయినా కూడా మంట తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే ముందుగా మీరు దాన్ని క్లీన్ చేసుకుంటే లో ఫ్లేమ్​ సమస్యను చాలా వరకు సాల్వ్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
  • ఇందుకోసం ముందుగా మీరు ఒక సేఫ్టీ పిన్(పిన్నీసు) తీసుకుని దాన్ని 'U' ఆకారంలో బెండ్ చేసుకోవాలి.
  • నెక్ట్స్ ఆ పిన్​ను బర్నర్ కింద హోల్​లో పెట్టి పైకి, కిందికి, అటు ఇటు మూడ్నాలుగు సార్లు అనాలి. అంటే, అక్కడ పేరుకుపోయిన మలినాలను నిదానంగా తొలగించుకోవాలన్నమాట.

"కుక్కలు" బైక్స్, కార్ల వెంట ఎందుకు పడతాయో తెలుసా? - వాటి క్యారెక్టరే అందుకు కారణమట!

  • అలా క్లీన్ చేసుకున్నాక గ్యాస్ స్టవ్​ను ఎప్పుడున్నట్లు సెట్ చేసుకొని ఆన్ చేసుకుంటే చాలు. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయి నార్మల్​గా మంట వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
  • ఒకవేళ ఇలా చేసిన కూడా తక్కువ మంట వస్తున్నట్లయితే అప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేసి స్టవ్ మీద ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత మళ్లీ స్టవ్​ను తలక్రిందులుగా చేసి, కటింగ్ ప్లయర్​తో బర్నర్ సెట్​ను పూర్తిగా తొలగించుకోవాలి.
  • గ్యాస్ పైపునకు ఉన్న చిన్న హోల్ నట్టు తీసి అందులో ఏమైనా దుమ్ము, ధూళి ఉంటే బయట, లోపల నుంచి సేఫ్టీ పిన్​తో క్లీన్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఒకసారి నోటితో గాలి ఊది చూసుకుంటే దాని నుంచి ఎయిర్ మంచిగా వస్తుందో లేదో అర్థమవుతుంది.
  • అలా శుభ్రం చేసుకున్నాక, మళ్లీ యథావిథిగా అన్ని ఫిట్ చేసి గ్యాస్ ఆన్ చేసుకుంటే సరి. మీ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అవుతుందంటున్నారు నిపుణులు.
  • ఈ ట్రిక్స్ ఫాలో అవ్వడంతో పాటు బర్నర్స్ మీద ఏమైనా మరకలు పేరుకుపోయి ఆ రంధ్రాలు పూడిపోయినా తక్కువ మంట వచ్చే అవకాశం ఉంటుంది.
  • అందుకే, బర్నర్స్ హోల్స్​ని ఒకసారి సేఫ్టీ పిన్​తో శుభ్రం చేసుకొని, నీట్​గా కడిగి ఆరబెట్టుకోవాలి.
  • అనంతరం వాటిని స్టవ్​కి సెట్​ చేసుకుని వాడితే మంచి రిజల్ట్ ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, వీలైనంత వరకు ఎప్పటికప్పుడు మరకలు పడిన రోజే స్టవ్​ను క్లీన్ చేసుకుని, శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు.

"ల్యాప్​టాప్" వాడుతున్నారా? - ఇలా క్లీన్ చేస్తే ల్యాపీ దెబ్బతినే ఛాన్స్!

మీ పిల్లలు ఫోన్​కు అలవాటు పడ్డారా? - ఈ యాప్స్ ఇన్​స్టాల్ చేస్తే మార్పు రావొచ్చు!