ETV Bharat / offbeat

నోరూరించే "వెల్లుల్లి మిరియాల రసం" - కమ్మగా గొంతులోకి దింగుతుంటే ఆహా అనాల్సిందే!

మిరియాలు, వెల్లుల్లి కాంబినేషన్​లో సూపర్ రెసిపీ - ఈ స్టెప్స్ పాటిస్తే నిమిషాల్లోనే రెడీ!

Vellulli Miriyala Rasam
Vellulli Miriyala Rasam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 14, 2026 at 11:48 AM IST

2 Min Read
Choose ETV Bharat

Vellulli Miriyala Rasam : చాలా మంది వేడివేడి అన్నంలోకి సాంబార్​ లేదా రసం వంటివి తినడానికి​ ఇష్టపడతారు. ఈ నేపథ్యంలోనే ఇండ్లలో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. ఇవి ఘాటుగా, పుల్లగా ఉండి గొంతులోకి జారుతుంటే ఆ ఫీలింగ్​ వేరే లెవల్​. అందుకే ఇవాళ మీకోసం ఓ సరికొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే వెల్లుల్లి మిరియాల రసం. చాలా తక్కువ పదార్థాలతో ఇన్​స్టంట్​గా చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ ఈజీగా చేయొచ్చు. మరి ఇక లేట్​ చేయకుండా వెల్లుల్లి మిరియాల రసం చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

నోటికి కమ్మగా ఉండే "కలగూర పులుసు" - ఇలాంటి రెసిపీ ఎపుడైనా ట్రై చేశారా?

Vellulli Miriyala Rasam
మిరియాలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • మిరియాలు - 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - 2 టీ స్పూన్లు
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 23
  • కరివేపాకు - కొద్దిగా
  • చింతపండు - 30 గ్రాములు
  • ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 2
  • టమోటాలు - 1
  • ఆవాలు - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అర టీ స్పూన్
  • ఎండుమిర్చి - 2
  • కొత్తిమీర - అర కట్ట
  • ఇంగువ - పావు టీ స్పూన్
Vellulli Miriyala Rasam
టమోటాలు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా మిక్సీజార్​లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేయాలి. ఇందులోనే 15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి కాస్త బరకగా మిక్సీ పట్టాలి.
  • అలాగే చిన్న గిన్నెలో 30 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. పది నిమిషాల తర్వాత రసం తీసి పక్కనుంచాలి.
Vellulli Miriyala Rasam
చింతపండు (Getty Images)
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి.
  • ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుతూ టమోటాలను మగ్గించాలి. ఈ మిశ్రమం మగ్గాక తీసి పెట్టుకున్న చింతపండు రసం, రెండున్నర గ్లాసుల నీళ్లు, అర టీ స్పూన్ పసుపు వేసి కలపాలి.ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 10 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Vellulli Miriyala Rasam
వెల్లుల్లి (Getty Images)
  • మరోవైపు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఇంగువ వేసి వేయించాలి.
  • ఆ తర్వాత రెండు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు మరిగించిన రసం మిశ్రమం, అర కట్ట కొత్తిమీర తరుగు వేయాలి. అనంతరం రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
Vellulli Miriyala Rasam
కరివేపాకు (Getty Images)
  • అంతే ఘుమఘుమలాడే వెల్లుల్లి మిరియాల రసం రెడీ అయినట్లే!
  • వేడివేడి అన్నంలో ఈ రసం వేసి తిన్నారంటే ఇంకో రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు.

నోరూరించే "గోంగూర చికెన్ నిల్వ పచ్చడి" - ముద్దకో ముక్క తినొచ్చు!

జిగురు లేకుండా "బెండకాయ పచ్చడి" - రోటి పచ్చడిలా అద్భుతంగా ఉంటంది!