ETV Bharat / offbeat

'గంజి' కదా అని వదిలేస్తున్నారా? - ఉపవాసం టైంలో ఇలా చేశారంటే ఆరోగ్య ప్రయోజనాలు!

టేస్టీ, హెల్తీ గంజి - రంజాన్ టైంలో ఎంతో బాగుంటుంది!

ganji_recipe
ganji_recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 5:18 PM IST

2 Min Read
Choose ETV Bharat

Ganji recipe : అన్నం ఉడికించినపుడు వచ్చే గంజి చాలా మంది వదిలేస్తుంటారు. మరికొంత మంది చక్కగా గిన్నెలోకి తీసుకుని కాస్త ఫ్లేవర్స్ యాడ్ చేసి తీసుకుంటారు. ఈ గంజిలో ఎన్నో పోషకాలు ఉన్నాయని డైటీషియన్లు కూడా చెప్తుంటారు. అయితే, రంజాన్ మాసం కొనసాగుతున్న తరుణంలో ఇక్కడ ఇచ్చిన పెసరపప్పు, రైస్ గంజి రెసిపీ ఓ సారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది.

'జీడిపప్పు, కాకరకాయ కారం ఫ్రై' - ఇలా చేశారంటే పిల్లలూ ఇష్టంగా తింటారు!

ganji_recipe
ganji_recipe (ETV Bharat)

కావల్సిన పదార్థాలు :

  • బియ్యం - అర కప్పు
  • పెసరపప్పు - అర కప్పు
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర - 1 స్పూన్
  • లవంగాలు - 2
  • దాల్చిన చెక్క - 1
  • బిర్యానీ ఆకు - 1
  • పచ్చిమిర్చి - 3
  • ఉల్లిపాయ - 1
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
  • పుదీనా - కొద్దిగా
  • టమోటా - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
ganji_recipe
ganji_recipe (ETV Bharat)

తయారీ విధానం :

  • ముందుగా అర కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పు శుభ్రం చేసుకుని ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత మిక్సీలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని 1 కప్పు తీసుకుంటే 2 కప్పుల నీళ్లు(డబుల్) పోసుకుని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇపుడు స్టవ్ పై గిన్నె పెట్టుకోవాలి. నూనె వేసుకుని జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకుని బాగా వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. ఉల్లిపాయ రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
ganji_recipe
ganji_recipe (ETV Bharat)
  • అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని పుదీనా తరుగు వేసుకుని కలపాలి. ఇపుడు టమోటా ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా ముక్కలు బాగా మగ్గిపోయే వరకు మీడియం ఫ్లేమ్​లో వేయించుకున్నాక 8 కప్పుల నీళ్లు పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కలపాలి. మూతపెట్టి మరిగించుకుని ఓ పొంగు రాగానే మూత తీసుకోవాలి.
ganji_recipe
ganji_recipe (ETV Bharat)
  • ఇపుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరో సారి కలిపి లో టు మీడియం ప్లేమ్​లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు సన్నటి మంటపై ఉడికించుకుని రెడీ చేసుకోవాలి.
  • గంజి మీకు చాలా చిక్కగా అనిపిస్తే మరో గ్లాసు నీళ్లు పక్కన స్టవ్ పై వేడి చేసుకుని కలుపుకోవాలి. మరిగే గంజిలో చన్నీళ్లు కలపడం వల్ల రుచి మారిపోయే అవకాశం ఉంటుంది. చివరగా మీకు కావల్సినట్టుగా నీళ్లు కలిపి కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకుంటే గంజి రెడీ అయినట్లే! ఈ గంజి ఇలాగే వేడి వేడిగా తాగేయొచ్చు.

కరకరలాడుతూ నోరూరించే "బీరకాయ గారెలు" - అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేస్తారు!

టేస్టీ "పొటాటో కర్రీ"! - కొత్త వాళ్లు కూడా అద్భుతంగా చేసుకునే సింపుల్ రెసిపీ!