ETV Bharat / offbeat

మీరు వాడే "వంటనూనె" కల్తీది కావొచ్చు - ఇలా ఈజీగా తెలుసుకోవచ్చంటున్న FSSAI

- కల్తీ వంటనూనెతో ఆరోగ్య సమస్యల ముప్పు - ఈ టిప్స్​తో ఈజీగా కనిపెట్టొచ్చంటున్న నిపుణులు!

How to Identify Adulterated Oil at Home
How to Identify Adulterated Oil at Home (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : March 23, 2026 at 11:47 AM IST

3 Min Read
Choose ETV Bharat

How to Identify Adulterated Oil at Home : మనం వంటకాల్లో నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాల్లో "నూనె" ఒకటి. ఇక నాన్​వెజ్ రెసిపీలు, పిండి వంటకాలు, స్నాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడైతే ఎక్కువ మొత్తంలోనే ఆయిల్ అవసరం పడుతుంది. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా వంటనూనెల ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీన్ని అసరాగా తీసుకుని కొందరు మోసగాళ్లు కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు వంటనూనెను కల్తీ చేసి అమ్ముతూ డబ్బులు దండుకుంటున్నారు.

కల్తీ నూనెతో చేసిన వంటలు, ఆహార పదార్థాలు తినడం ద్వారా వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే మీరు డైలీ వాడే వంటనూనె మంచిదా? కాదా? అనే సందేహం వస్తుంది. అయితే, డోంట్​వర్రీ. మీరు వాడే వంటనూనెలో ఏది స్వచ్ఛమైనది, ఏది కల్తీదో తెలుసుకునేందుకు 'ఫుడ్​ సేఫ్టీ అండ్​ స్టాండర్డ్స్​ ఆథారిటీ ఆఫ్​ ఇండియా (FSSAI)' ఒక సింపుల్​ టెస్ట్ సూచిస్తుంది. దీని ద్వారా ఎవరైనా ఈజీగా కల్తీ నూనె కనిపెట్టొచ్చు. ఇంతకీ, ఆ చిన్న టెస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మార్కెట్లో లభించే వంటనూనెల్లో ప్రధానంగా 'ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్పేట్' అనే కెమికల్​ను ఉపయోగించి ఆయిల్​ను కల్తీ చేస్తున్నారు. ఇది ప్రధానంగా ఫాస్పరస్‌ను కలిగిన పెస్టిసైడ్‌. ఆ కెమికల్ కలిసిన నూనె వాడటం నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా పక్షవాతంతో పాటు ఇతర రోగాల ముప్పు పొంచి ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే కల్తీ నూనెను కనిపెట్టేందుకు FSSAI ఒక చిన్న టెస్ట్​ను సూచిస్తోంది. ఎలా తెలుసుకోవాలనే దానిపై ఒక వీడియోను విడుదల చేసింది.

  • ఇందుకోసం ముందుగా రెండు గ్లాసులు తీసుకుని వాటిల్లో రెండు మిల్లిలీటర్ల వంటనూనెను పోయాలి.
  • తర్వాత ఒక్కో గ్లాసులో పసుపు రంగులో ఉన్న వెన్నను కొద్దిగా వేయాలి. కాసేపు ఉలాగే ఉంచాలి.
  • కొద్దిసేపటి తర్వాత గ్లాసులోని నూనె రంగుమారకుండా ఉంటే అది స్వచ్ఛమైనదిగా తెలుసుకోవాలంటున్నారు FSSAI అధికారులు. అంటే ఆ నూనెలో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ లేదని గమనించాలి.
  • అలాకాకుండా గ్లాసులోని నూనె రంగు మారి ఎర్రగా అయితే ఆ ఆయిల్​లో ట్రై-ఆర్థో-క్రెసిల్-ఫాస్ఫేట్‌ కలిసిందని అర్థం చేసుకోవాలంటున్నారు. ఇలా సింపుల్​గా మీరు వాడే ఆయిల్ మంచిదో, కాదో ఈజీగా కనిపెట్టవచ్చంటున్నారు.

హోటళ్లలో ఫుడ్​ సూపర్​ టేస్టీ అని వెళ్తున్నారా? - ఇవి గుర్తించకపోతే ఆరోగ్యం గుల్లే!

కల్తీ నూనెను కనిపెట్టే మరికొన్ని టిప్స్!

  • మార్కెట్లోకి వస్తున్న కల్తీ నూనెను కనిపెట్టేందుకు మరికొన్ని టిప్స్ సూచిస్తున్నారు నిపుణులు. వీటి ద్వారా నూనె స్వచ్ఛతను ఈజీగా గుర్తించవచ్చంటున్నారు. అలాంటి వాటిల్లో కొన్నింటిని చూస్తే..
  • ఒక వైట్ పేపర్ మీద చుక్క నూనె పోసి ఉంచండి. నూనె మంచిదైతే గుండ్రంగా మచ్చలా మారుతుంది. అదే, కల్తీ అయితే ఆ చుక్క చుట్టూ గ్రీజ్‌లా ఏర్పడడాన్ని గమనించవచ్చంటున్నారు నిపుణులు.
  • ఒక చిన్న బౌల్​లో కొద్దిగా నూనెను తీసుకుని దాన్ని కాసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచండి. అప్పుడు అది స్వచ్ఛమైనదైతే ఒకే రూపులో గడ్డకడుతుంది. అలాకాకుండా కల్తీ జరిగేతే లిక్విడ్‌లా ఉండిపోతుంది. లేదంటే లేయర్లు మాదిరిగా ఫ్రీజ్‌ అవుతుందని సూచిస్తున్నారు.
  • మీరు వంట చేసేటప్పుడు నూనెను పెనం మీద వేసిన కాసేపటికే కాగి పొగ ఎక్కువగా వచ్చేస్తుంటే అందులో కల్తీ ఉందని భావించవచ్చని చెబుతున్నారు.
  • అలాగే, ఆయిల్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఆయిల్ ప్యాకెట్ లేబుల్‌ మీద 100శాతం మనం కొనే నూనె రకమే ఉన్నది తీసుకోవాలి. వేరే వేరే పదార్థాలు కలిసినవి స్వచ్ఛత కోల్పోయేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుందని తెలుసుకోవాలి.
  • అదేవిధంగా, నూనె రంగు సహజంగా కంటే భిన్నంగా ఉన్నా, గాఢమైన వాసనలు వస్తున్నా అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు.

మార్కెట్లోకి "కల్తీ పుచ్చకాయలు" - ఈ చిన్న టెస్ట్ చేసి తీసుకోవాలంటున్న FSSAI

మీరు తాగే "పాలు" కల్తీవి కావొచ్చు! - FSSAI టిప్స్​తో క్షణాల్లో గుర్తించండిలా!