ETV Bharat / offbeat

ఆలూ, చేపల కాంబోలో నోరూరించే "స్నాక్" - కరకరలాడుతూ భలే రుచికరంగా ఉంటాయి!

క్రిస్పీ అండ్ టేస్టీ "ఫిష్ పొటాటో బాల్స్" - పిల్లలైతే కమ్మగా తినేస్తారు!

Fish Potato Snack Recipe
Fish Potato Snack Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : November 17, 2025 at 5:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Fish Potato Snack Recipe in Telugu : ఈవెనింగ్ టైమ్​లో పిల్లలతో పాటు పెద్దలూ స్నాక్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. అందులోనూ నాన్​వెజ్ స్నాక్స్ అంటే లొట్టలేసుకుంటూ ఆరగిస్తారు. ఇప్పుడు మీ అందరి కోసం అలాంటిదే ఒక అద్దిరిపోయే నాన్​వెజ్ స్నాక్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, క్రిస్పీ అండ్ టేస్టీ "ఫిష్ పొటాటో బాల్స్". ఆలూ, గుడ్డు, ఉల్లిపాయతో కలిపి చేసుకునే ఈ స్నాక్ అద్భుతమైన రుచినిస్తుంది. చేపలు తినడానికి ఇష్టపడని పిల్లలూ ఇలా చేసి పెట్టారంటే కమ్మగా, కడుపునిండా తింటారు. అలాగే, వీటి తయారీ కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. మరి, నోరూరించే ఈ ఫిష్ స్నాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Fish Potato Balls
చేప ముక్కలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • చేప ముక్కలు - అరకేజీ
  • వెన్న - ఒక టేబుల్‌స్పూను
  • ఉల్లిపాయ - ఒకటి
  • బంగాళదుంప - ఒకటి(పెద్ద సైజ్​ది)
  • గుడ్డు - ఒకటి
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
  • పచ్చిమిర్చి - రెండు
  • సన్నని కొత్తిమీర తరుగు - నాలుగు టేబుల్​స్పూన్లు
  • బ్రెడ్​పొడి - అర కప్పు
  • ధనియాలపొడి - ఒక చెంచా
  • జీలకర్రపొడి - ఒక చెంచా
  • ఉప్పు - రుచికి తగినంత
  • పసుపు - పావుచెంచా
  • కారం - ఒక చెంచా
  • నిమ్మరసం - రెండు చెంచాలు
  • నూనె - వేయించడానికి సరిపడా

బియ్యం, మజ్జిగతో కరకరలాడే "వడలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

Fish Potato Balls
ఆలుగడ్డలు (Getty Images)

తయారీ విధానం :

  • నోరూరించే ఈ వెరైటీ నాన్​వెజ్ స్నాక్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి బంగాళదుంపను ఉడికించుకోవాలి.
  • అది ఉడికేలోపు ఒక గిన్నెలోకి ముళ్లలేని ఏదయినా ఒక రకం చేప ముక్కలను అరకేజీ పరిమాణంలో తీసుకుని శుభ్రంగా కడిగి పక్కనుంచాలి.
  • తర్వాత రెసిపీలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరలను వీలైనంత సన్నగా తరుక్కుని రెడీగా పెట్టుకోవాలి. ఆపై ఉడికిన ఆలూను పొట్టు తీసి మెత్త మాష్ చేసుకుని పక్కనుంచాలి.
  • అనంతరం స్టవ్ మీద కడాయిని పెట్టి రెండు కప్పుల నీళ్లు పోసి అందులో పసుపు, కొద్దిగా ఉప్పు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపముక్కలు వేసి కలిపి ఉడికించుకోవాలి.
  • ఆ ముక్కలు ఉడికి మెత్తగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, పాన్​ను దింపి నీటిని పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.
Fish Potato Balls
కొత్తిమీర (Getty Images)
  • ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయిని పెట్టి వెన్న వేసి వేడి చేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి ఆనియన్స్ కాస్త రంగు మారేంత వరకు వేయించాలి.
  • ఆ తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, ధనియాలపొడి, జీలకర్రపొడి, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒక నిమిషం లో ఫ్లేమ్​లో కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్న చేపల ముక్కలలో వేసుకోవాలి.

సరికొత్త పద్ధతిలో "పెరుగు వడలు" - ఒక్కసారి తింటే రుచి మరచిపోరంతే!

Fish Potato Balls
గుడ్డు (Getty Images)
  • అలాగే, మెత్తగా మాష్ చేసుకున్న ఆలూ, బ్రెడ్ పొడి, సన్నని కొత్తిమీర తరుగు వేసుకుని గుడ్డును పగులగొట్టి పోసుకోవాలి.
  • ఆపై అందులో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని పదార్థాలన్నీ బాగా కలిసేలా ముద్దలా అయ్యే వరకూ కలిపి అరగంట పాటు ఫ్రిడ్జ్​లో ఉంచాలి.
  • అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి హీట్ చేసుకోవాలి.
  • ఆయిల్ కాగిన తర్వాత మంటను తగ్గించి అరగంట పాటు ఫ్రిడ్జ్​లో ఉంచిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండల్లా చేసుకుని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి.
Fish Potato Balls
నిమ్మరసం (Getty Images)
  • పాన్​లో వేయించడానికి సరిపడా వేసుకున్నాక వెంటనే కదపకుండా కాసేపు కాలనిచ్చి ఆపై అటు ఇటు తిప్పేసుకుంటూ అన్ని వైపులా ఎర్రగా వేగే వరకు మీడియం ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక వాటిని సర్వింగ్ ప్లేట్​లలోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఆలూ, షిప్ కాంబోలో నోరూరించే క్రిస్పీ అండ్ టేస్టీ "నాన్​వెజ్ స్నాక్ రెసిపీ" అప్పటికప్పుడు సింపుల్​గా రెడీ అవుతుంది!
Fish Potato Balls
ఫిష్ పొటాటో బాల్స్ (Eenadu)

చలికాలంలో అద్దిరిపోయే "చికెన్ సూప్" -సీజనల్ సమస్యలకూ చెక్ పెట్టేస్తుంది!