ETV Bharat / offbeat

చేపలతో నోరూరించే "కట్లెట్స్‌" - లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా అద్దిరిపోతాయి!

చల్లని వేళ అద్దిరిపోయే 'ఫిష్ స్నాక్' - ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!

Fish Cutlets Recipe
Fish Cutlets Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 11, 2026 at 12:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

Fish Cutlets Recipe Hotel Style : "చేపలు" తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, పిల్లలతో పాటు కొంతమంది పెద్దలూ వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. ముళ్లు ఉంటాయనో, నీచు వాసన వస్తుందనో పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వారూ లొట్టేలేసుకుంటూ తినేలా ఒక అద్దిరిపోయే స్నాక్ రెసిపీ ఉంది. అదే, క్రిస్పీ అండ్ టేస్టీ "ఫిష్‌ కట్లెట్స్‌". హోటల్ స్టైల్​లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు. ముళ్లు లేకుండా మంచి రుచికరంగా ఉండే ఈ కట్లెట్లను చిన్నారులైతే ఒకటికి రెండు భలే ఇష్టంగా తింటారు. నూనె కూడా తక్కువగానే పీల్చుకుంటాయి! మరి, లేట్ చేయకుండా లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా నోరూరించే ఈ ఫిష్ కట్లెట్స్​ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Fish Cutlets Recipe
చేప ముక్కలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ముల్లు లేని చేప ముక్కలు - పావు కిలో
  • బంగాళాదుంపలు - రెండు
  • సన్నని ఉల్లిపాయ తరుగు - అర కప్పు
  • ఉప్పు - టేస్ట్​కి సరిపడా
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
  • పచ్చిమిర్చి - రెండు
  • కొత్తిమీర తరుగు - రెండు టేబుల్​స్పూన్లు
  • కరివేపాకు - రెండు రెబ్బలు
  • కారం - ఒక చెంచా
  • గరంమసాలా - ఒక స్పూన్
  • ధనియాల పొడి - ఒక స్పూన్
  • నిమ్మరసం - ఒక టేబుల్​స్పూన్
  • జీలకర్ర పొడి - ఒక స్పూన్
  • నూనె - వేయించేందుకు సరిపడా
  • మైదా - రెండు టేబుల్​స్పూన్లు
  • బ్రెడ్ పొడి - ఒక కప్పు

తెలంగాణ స్పెషల్ "సకినాలు" - పిండి ఇలా కలిపి చేస్తే కరకరలాడుతూ అద్దిరిపోతాయి!

Fish Cutlets Recipe
బంగాళాదుంపలు (Getty Images)

తయారీ విధానం :

  • నోరూరించే ఈ నాన్​వెజ్ స్నాక్ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో బంగాళాదుంపలను తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
  • అవి ఉడికేలోపు వంజరం, రోహు, బంగడ రకాల్లో ఏదైనా ముల్లు లేని చేప ముక్కలను పావు కిలో పరిమాణంలో తీసుకుని శుభ్రంగా కడగాలి.
  • తర్వాత కడిగిన చేప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఆరేడు నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆలోపు ఉడికిన బంగాళాదుంపలను పొట్టు తీసి, ఒక గిన్నెలో వేసుకుని మెత్తగా మాష్ చేసుకుని పక్కనుంచాలి.
Fish Cutlets Recipe
ఉల్లిపాయ తరుగు (Getty Images)
  • ఇప్పుడు ఆరేడు నిమిషాలు ఉడికించుకున్న చేపల ముక్కలను చల్లారిన తర్వాత కైమాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే, సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగును రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్​ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి.
  • అవి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ జత చేసి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించాలి.
Fish Cutlets Recipe
అల్లం (Getty Images)
  • ఆ తర్వాత అందులో కైమాలా తరిగి పెట్టుకున్న చేప ముక్కలు, ముందుగా రెడీ చేసుకున్న బంగాళాదుంపల గుజ్జు, కారం, ధనియాలు, జీలకర్ర పొడులు, గరం మసాలా వేసుకోవాలి.
  • అలాగే, రుచికి తగినంత ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు కూడా వేసుకుని పదార్థాలన్నీ కలిసేలా ఒక నిమిషం మిశ్రమం మొత్తాన్ని కలుపుతూ వేయించుకోవాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి.
  • ఇది చల్లారేలోపు ఒక చిన్న గిన్నెలో మైదా తీసుకుని కొన్ని నీళ్లు పోసి మరీ గట్టిగా లేదా పల్చగా కాకుండా కలిపి పక్కనుంచాలి. అలాగే, ఒక ప్లేట్​లో బ్రెడ్ పొడిని తీసుకుని రెడీగా ఉంచుకోవాలి.
Fish Cutlets Recipe
కొత్తిమీర (Getty Images)
  • ఇప్పుడు చల్లారిన చేప మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న కట్లెట్స్​లా చేసుకుని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించేందుకు సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్ హీట్ అయ్యాక మంటను తగ్గించి ముందుగా రెడీ చేసుకున్న కట్లెట్లను కలిపి పెట్టుకున్న మైదాపిండిలో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించి కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి.
Fish Cutlets Recipe
మసాలాలు (Getty Images)
  • పాన్​లో వేయించడానికి సరిపడా వేసుకున్నాక వెంటనే కదపకుండా కాసేపు వేగనిచ్చి ఆపై అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • అలా వేయించుకున్నాక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్​లోకి తీసుకుని కాసేపు ఉంచి ఆపై వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.
  • అంతే, హోటల్ స్టైల్​లో ఎంతో రుచికరంగా కరకరలాడే ఫిష్ కట్లెట్స్ రెడీ అవుతాయి!
  • ఇక వీటిని టమాటా సాస్​తో సర్వ్ చేసుకుని తిన్నారంటే ఆ టేస్ట్ నెక్ట్స్ లెవల్​లో ఉంటుంది.
  • మరి, నచ్చితే మీరూ రెగ్యులర్ స్నాక్ రెసిపీలు కాకుండా ఓసారి చేపలతో ఇలా ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఫిదా అవుతారు.
Fish Cutlets Recipe
Fish Cutlets Recipe (Eenadu)

పిండి ఇలా కలిపి "కారప్పూస" చేయండి - స్వీట్ షాప్ స్టైల్ రుచితో కరకరలాడుతుంది!

పాకం లేకుండా "అరిసెలు" - పావుగంటలో రెడీ - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!