ETV Bharat / offbeat

పుల్లగా, కమ్మగా "మెంతి ఆకు, టమోటా పచ్చడి" - వారం రోజులు నిల్వ ఉంటుంది!

టమోటా, మెంతి ఆకు నిల్వ పచ్చడి - ఎప్పుడుకావాలంటే అప్పుడు తినేయొచ్చు!

methi_tomato_chutney
methi_tomato_chutney (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 25, 2026 at 2:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

Methi Tomato Chutney : మెంతి కూర, టమోటా కర్రీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పుల్లగా, కమ్మగా వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచిగా అనిపిస్తుంది. మెంతి కూర నూనెలో వేయించకపోతే చేదుగా అనిపిస్తుంది. అయితే, మెంతి ఆకు, టమోటాలతో ఇలా చట్నీ కూడా చేసుకోవచ్చు. ఈ చట్నీ వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీరు మెంతాకు ఫ్యాన్స్ అయితే ఒక్క సారి ఇలా చేసిపెట్టుకుంటే చాలు కమ్మగా తినేయొచ్చు.

"క్యాబేజీ, కోడిగుడ్డు ఫ్రై" - అప్పటికప్పుడు చేసుకునే అద్భుతమైన రెసిపీ!

methi_tomato_chutney
methi_tomato_chutney (Getty images)

కావాల్సిన పదార్థాలు :

  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • పల్లీలు - 35
  • లేదా నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్
  • మినపగుండ్లు - 1 టేబుల్ స్పూన్
  • కరివేపాకు - 1 రెమ్మ
  • పచ్చిమిర్చి - 10
  • మెంతి ఆకు - 3 కప్పులు
  • టమోటాలు - 2
  • చింతపండు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు స్పూన్
  • వెల్లుల్లి - 6
methi_tomato_chutney
methi_tomato_chutney (Getty images)

పోపు కోసం :

  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • పచ్చి శనగపప్పు - 1 స్పూన్
  • మినపప్పు - అర స్పూన్
  • ఆవాలు - అర స్పూన్
  • జీలకర్ర - అర స్పూన్
  • ఇంగువ - కొద్దిగా
  • కరివేపాకు - 1 రెమ్మ
  • ఎండు మిర్చి - 3
methi_tomato_chutney
methi_tomato_chutney (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కగానే పల్లీలు లేదా నువ్వులు వేయించాలి. ఆ తర్వాత ధనియాలు, మినపగుండ్లు వేసుకుని వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి.
  • ఇపుడు 3 కప్పుల మెంతి ఆకు శుభ్రం చేసుకుని ప్యాన్లో మిగిలిన నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించడం వల్ల మెంతి ఆకు చేదు తగ్గుతుంది. బాగా వేయించిన తర్వాత పక్కన పెట్టుకుని అదే కడాయిలో టమోటా ముక్కలు, చింతపండు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమోటాలు మెత్తబడిన తర్వాత పక్కకు తీసుకుని చల్లార్చుకోవాలి.
methi_tomato_chutney
methi_tomato_chutney (Getty images)
  • ఇపుడు ముందుగా వేయించిన పచ్చిమిర్చి, పప్పు దినుసులని మిక్సీలోకి తీసుకోవాలి. అందులో వెల్లుల్లి పాయలు వేసుకుని గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఫ్రై చేసిన మెంతి ఆకు, టమోటా ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి పోపు కలుపుకోవాలి.
  • పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కగానే పచ్చి పప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయించాలి. అందులోనే ఇంగువ, కరివేపాకు, ఎండు మిర్చి వేసుకుని వేసుకుని చిటపటలాడగానే గ్రైండ్ చేసుకున్న చట్నీలో కలుపుకోవాలి.

ఆంధ్రా, తమిళనాడు మిక్స్​డ్ రెసిపీ - నోరూరించే "చంద్రముఖి చికెన్"

నోరూరించే "చిల్లీ పనీర్ 65" - ఇలా చేస్తే ఒక్క ముక్క మిగల్చరు!