ETV Bharat / offbeat

"సేమియా ఉప్మా" పిల్లలు నచ్చట్లేదా? - ఓ సారిలా మార్చి చేశారంటే ఇష్టంగా తింటారు!

పిల్లలు ఎంతో ఇష్టపడే "ఎగ్ సేమియా ఉప్మా" - ఫ్యామిలీ అంతా మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు!

Egg_Semiya_Upma_recipe
Egg_Semiya_Upma_recipe (Getty images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 11:52 AM IST

2 Min Read
Choose ETV Bharat

Egg Semiya Upma recipe : ఇంట్లో చేసే సేమియా ఉప్మా పిల్లలు నచ్చకపోతే ఓ సారి ఇలా ట్రై చేసి చూడండి. రెండు, మూడు ఎగ్స్ కట్ చేసుకుని కాస్త పోపు తగిలించి చేశారంటే మంచి ఫ్లేవర్​ వస్తుంది. దీంతో పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. అందులో కాస్త వెజ్ ముక్కలు వేసి ఫ్రై చేశారంటే రుచి ఇంకా బాగుంటుంది. బీన్స్, క్యారెట్ ముక్కలు మధ్యమధ్యలో తగులుతుంటే అద్భుతంగా పెరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన పద్ధతిలో ఓ సారి సేమియా ఎగ్ ట్రై చేసి చూడండి. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు.

బీరకాయతో కరకరలాడే "గారెలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

Egg_Semiya_Upma_recipe
Egg_Semiya_Upma_recipe (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • నూనె - 1 టీ స్పూన్
  • గుడ్లు - 3
  • కారం - 1 స్పూన్
  • మిరియాల పొడి - అర స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి తరుగు - 2
  • క్యారెట్ - 1
  • బీన్స్ - 3
  • క్యాప్సికం - 1
  • క్యాలీ ఫ్లవర్ - కొద్దిగా
  • క్యాబేజీ తరుగు - ఉల్లిపాయ సైజు
  • కొత్తిమీర - కొద్దిగా
  • నిమ్మరసం - అర చెక్క
Egg_Semiya_Upma_recipe
Egg_Semiya_Upma_recipe (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. అందులో సేమియా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్​లో పెట్టి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 కప్పుల నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. 4 నిమిషాలు ఉంచితే సేమియా 70శాతం ఉడికిపోతుంది. ఆ తర్వాత నీళ్లు వడగట్టుకుని పక్కకు తీసుకోవాలి. జల్లెడ పెట్టుకుని ఫిల్టర్ చేసుకుని సేమియాలోకి చల్లని నీళ్లు పోస్తే సేమియా గట్టిగా ఉంటుంది.
Egg_Semiya_Upma_recipe
Egg_Semiya_Upma_recipe (Getty images)
  • ఇపుడు స్టవ్​పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసి గుడ్లు కొట్టి పోయాలి. వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా గరిటెతో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సన్నటి మంటపై చక్కగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టాలి.
Egg_Semiya_Upma_recipe
Egg_Semiya_Upma_recipe (Getty images)
  • మళ్లీ అదే కడాయిలో నూనె వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులోనే క్యారెట్, బీన్స్, క్యాప్సికం, లేదా క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ తరుగు కూడా వేసుకోవచ్చు. వెజ్జీస్ బాగా వేగిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియా, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసుకుని కలపాలి. ఆ తర్వాత ఫ్రై చేసిన ఎగ్ పీసెస్ వేసుకుని ఇపుడు మంట పెంచుకుని బాగా ఫ్రై చేసుకోవాలి .
Egg_Semiya_Upma_recipe
Egg_Semiya_Upma_recipe (Getty images)
  • ఈ టైంలో కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. చివరగా కొద్దిగా నిమ్మరసం పిండుకొని, సన్నటి ఉల్లిపాయ తరుగుతో కలిపి తింటుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "అరిసెలు" - ఈ సంక్రాంతికి ఇంట్లోనే తియ్యని వేడుక చేసుకోండి! !

రాయలసీమ స్పెషల్ "వెల్లుల్లి కారం పచ్చడి" - అన్నం, టిఫిన్స్​లోకి పర్ఫెక్ట్!