నోరూరించే "ఎగ్ మసాలా కర్రీ" - ఈ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
కోడిగుడ్లతో ఓసారి ఇలా ట్రై చేయండి - కడుపు నిండా కమ్మగా తినేస్తారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 8, 2026 at 10:22 AM IST
Egg Masala Curry in Telugu : కోడిగుడ్లతో కర్రీ, ఎగ్ బుర్జీ, ఆమ్లెట్ వంటివి ఎక్కువగా చేస్తుంటారు. ఇంకాస్త సమయం ఉంటే బాయిల్డ్ ఎగ్‌తో పులుసు పెడుతుంటారు. అయితే ఎప్పుడూ ఇవే కాకుండా ఈసారి కాస్త స్పెషల్‌గా ట్రై చేయండి. అదే నోరూరించే ఎగ్ మసాలా కర్రీ. బ్యాచిలర్స్‌తో పాటు ఎవరైనా దీనిని క్విక్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి అద్భుతంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. అంతేకాదు ఒక్కసారి రుచి చూశారంటే ఎప్పుడూ ఇదే పద్ధతిలో చేసి పెట్టమని అడుగుతారు. మరి నయా స్టైల్లో నోరూరించే ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలి? ఇందుకు అవసరమైన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
అన్నం, కర్రీ చేయాల్సిన అవసరం లేదు - ఇలా చేస్తే లంచ్ బాక్స్ కళకళ!

కావాల్సిన పదార్థాలు :
- కోడిగుడ్లు - 3
- టమోటాలు - 2
- ఉల్లిపాయలు - 2
- కరివేపాకు - కొద్దిగా
- పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
- కారం - 2 టేబుల్ స్పూన్లు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
- పచ్చిమిర్చి - 3
- కొత్తిమీర - కొద్దిగా
- పసుపు - 1 టీ స్పూన్
- గరం మసాలా - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, మూడు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి.
- అలాగే స్టవ్ ఆన్ చేసి గిన్నెలో మూడు కోడిగుడ్లు, సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత పొట్టు తీసి చాకుతో గాట్లు పెట్టి పక్కనుంచాలి.

- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఉడికించిన ఎగ్స్, ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి 5 నిమిషాల పాటు పక్కనుంచాలి.
- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి వేయించాలి.
- ఈ మిశ్రమం వేగాక ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.

- అనంతరం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఎగ్స్ మిశ్రమం యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చివరన ఒక టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
- అంతే నోరూరించే ఎగ్ మసాలా కర్రీ సిద్ధంగా ఉంటుంది!

- వేడివేడి అన్నంలో ఎగ్ మసాలా కర్రీ వేసి తిన్నారంటే ఇంకో రెండు ముద్దలు ఎక్కువగానే లాగిస్తారు!
- ఇలా ఇంట్లో చేసి పెడితే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది!
- ఈ ఎగ్ మసాలా కర్రీని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే కోడిగుడ్లతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
రోజూ అవే దోసెలు, ఇడ్లీలు ఏం తింటారు? - కాస్త వెరైటీగా "ఇడియప్పం" ట్రై చేయండి!
చిక్కటి గ్రేవితో "సోయా కీమా కర్రీ"- ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ చేసుకోవడం పక్కా!

