ETV Bharat / offbeat

మీల్ మేకర్స్​తో చిట్టి చిట్టి "ఊతప్పాలు" - ప్రొటీన్స్ పుష్కలంగా ఉండి టేస్ట్ అద్దిరిపోతాయి!

-రెగ్యులర్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీలను మించిన టేస్ట్ - పిల్లలైతే ఒకటికి రెండు భలే ఇష్టంగా తింటారు!

Easy Breakfast Recipe
Easy Breakfast Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 5:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

Easy Breakfast Recipe : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లోకి మనందరం రెగ్యులర్​గా ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, బోండా వంటివి చేసుకుంటుంటాం. అలాగని ఎప్పుడూ అవే తినాలన్నా బోరింగ్ ఫీల్ కలుగుతుంది. అందుకే, మీకోసం అప్పటికప్పుడు చేసుకునే ఒక సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్​ఫాస్ట్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, మీల్ ​మేకర్స్​తో సూపర్ టేస్టీ "ఊతప్పాలు". ఇవి ప్రోటీన్స్ పుష్కలంగా కలిగి ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే, వీటి తయారీకి పెద్దగా టైమ్ కూడా పట్టదు. అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పిల్లలైతే ఈ చిట్టి చిట్టి ఊతప్పాలను ఒకటికి రెండు చాలా ఇష్టంగా తింటారు. ఇవి బ్రేక్​ఫాస్ట్​లోకి మాత్రమే కాకుండా ఈవెనింగ్ స్నాక్​గానూ అద్దిరిపోతాయి. మరి, లేట్ చేయకుండా మీల్​ మేకర్స్​తో ఈ టేస్టీ అండ్ హెల్దీ టిఫెన్ ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Easy Breakfast Recipe
మీల్ మేకర్స్ (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • మీల్ మేకర్స్ - రెండు కప్పులు
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • అల్లం - రెండించుల ముక్క
  • పచ్చిమిర్చి - నాలుగు
  • టమాటాలు - రెండు
  • ధనియాల పొడి - రెండు టీస్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - ఒక టీస్పూన్
  • గరంమసాలా - ఒక టీస్పూన్
  • నిమ్మకాయ - ఒకటి
  • సన్నని ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
  • సన్నని క్యారెట్ తురుము - అర కప్పు
  • బియ్యప్పిండి - ఒక కప్పు
  • గోధుమపిండి - ఒక కప్పు
  • పసుపు - అరటీస్పూన్
  • జీలకర్ర - ఒకటీస్పూన్
  • వంటసోడా - అరటీస్పూన్
  • నూనె - కొద్దిగా(ఊతప్పాలు కాల్చుకోవడానికి)

నువ్వులతో నోరూరించే "వంకాయ కూర" - ఇంటిల్లిపాదీ ఆహా ఏమి రుచి అంటారు!

Easy Breakfast Recipe
ఉల్లిపాయ తరుగు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో మీల్​మేకర్స్​ను తీసుకుని వేడి నీళ్లు పోసి ఐదు నుంచి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
  • అవి నానేలోపు ఒక కప్పు పరిమాణంలో సన్నని ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుమును రెడీ చేసుకుని పక్కనుంచాలి.
  • మీల్ మేకర్స్ చక్కగా నానిన తర్వాత వేడి నీళ్లు వంపేసి నార్మల్​ వాటర్ పోసుకోవాలి. ఆపై వాటిని కొన్ని కొన్ని తీసుకుంటూ చేతితో అదనపు వాటర్ పిండి ఒక ప్లేట్​లో వేసుకోవాలి.
Easy Breakfast Recipe
క్యారెట్ తురుము (Getty Images)
  • అనంతరం మిక్సీ జార్ తీసుకుని అందులో వాటర్ పిండిన మీల్ మేకర్స్, పొట్టు తీసిన వెల్లుల్లిరెబ్బలు, అల్లంముక్క, పచ్చిమిర్చి, కట్ చేసిన మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్ చేసే టైమ్​లో అవసరమైతే ఒకట్రెండు స్పూన్ల వాటర్ వేసుకుని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి.
  • అనంతరం గ్రైండ్ చేసుకున్న మీల్ మేకర్స్ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఆపై అందులో రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, టేస్ట్​కి సరిపడా ఉప్పు, కారం, గరంమసాలా వేసుకుని, నిమ్మరసం పిండుకోవాలి.
Easy Breakfast Recipe
గోధుమపిండి (Getty Images)
  • ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తురుము, బియ్యప్పిండి, గోధుమపిండి వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • నెక్ట్స్ ఆ మిశ్రమంలో అవసరం మేరకు తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి.
  • అలా కలిపిన తర్వాత పసుపు, జీలకర్ర, కొద్దిగా వంటసోడా వేసుకుని మరోసారి పిండి మొత్తం మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా ఉండకుండా ఊతప్పంకు కావాల్సిన విధంగా కాస్త గట్టిగానే ఉండేలా చూసుకోవాలి.
Easy Breakfast Recipe
బియ్యప్పిండి (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద ఊతప్పం పాన్ పెట్టి ఒకట్రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని నువ్వులు వేసి, ఆపై కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఒకట్రెండు గరిటెలు వేసి మందపాటి ఊతప్పంలా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత పైన కొన్ని నువ్వులను చల్లి, మరో టీస్పూన్ నూనె వేసుకుని మూతపెట్టి సన్నని సెగ మీద రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి.
  • అలా కాల్చుకున్నాక మూత తీసి అట్ల కాడతో మరో వైపునకు టర్న్ చేసుకుని అటు వైపు కూడా లో ఫ్లేమ్​లో మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి.
Easy Breakfast Recipe
పోపు దినుసులు (Getty Images)
  • అది రెండు వైపులా మంచిగా కాలిందనుకున్నాక సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఊతప్పాల్లా చేసుకుని తీసుకుంటే చాలు.
  • అంతే, మీల్ మేకర్స్​తో సూపర్ టేస్టీ ప్రోటీన్ రిచ్ చిట్టి చిట్టి "ఊతప్పాలు" అప్పటికప్పుడు రెడీ అవుతాయి!
  • మరి, నచ్చితే మీరూ రెగ్యులర్ టిఫెన్స్​కు బదులుగా ఓసారి ఈ మీల్ మేకర్ ఊతప్పాలు ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ వావ్ సూపర్ అంటూ భలే ఇష్టంగా తింటారు!

బండి మీద అమ్మే రుచితో కరకరలాడే "పకోడీ" - పిండి కలపడంలోనే అసలు సీక్రెట్!

బియ్యంతో మెత్తటి దూదిలాంటి "దోశలు" - తక్కువ టైమ్​లో ఎక్కువ రుచికరంగా!