ETV Bharat / offbeat

ఓల్డ్ ఈజ్ గోల్డ్​గా 'వైర్డ్ ఇయర్ ఫోన్స్' - వైర్ ఉంటేనే వాల్యూ అంటున్న సెలబ్రిటీలు, యూత్!

ఇయర్ బడ్స్ అవుట్, వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఇన్! - ఈ పాత యాక్సెసరీకి మళ్లీ ఎందుకంత క్రేజీ!

Wired Earphones
వైర్డ్ ఇయర్ ఫోన్స్ (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 10, 2026 at 2:51 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tips for Buying Wired Earphones : నేటి టెక్నాలజీ యుగంలో ఎక్కడ చూసినా వైర్​లెస్ బ్లూటూత్​లు, ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్​ల హవానే నడుస్తోంది. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నట్టు ఎప్పుడో వినియోగించడం మానేసిన ఓ పాత యాక్సెవరీ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్​లోకి వచ్చింది. అదే, 'వైర్డ్ ఇయర్ ఫోన్స్'. ప్రముఖ సెలబ్రెటీల నుంచి ఇన్​ఫ్లుయెన్సర్లు, యూత్ వరకు వీటిని ఒక కూల్, రెట్రో స్టైల్ యాక్సెసరీగా వినియోగించడానికి మొగ్గు చూపుతున్నారు. అసలు వైర్​లెస్ హవా నడుస్తున్న ఈ కాలంలో ఈ పాత ఇయర్ ఫోన్స్ మళ్లీ ఎందుకు అంత క్రేజీగా మారాయి? ఇవి తీసుకునేటప్పుడు ఎలాంటి విషయాలు గమనించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ యాక్సెసరీగా మారిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు టెక్ నిపుణులు. ముఖ్యంగా వీటి వల్ల పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు కాల్​లో ఉన్నారని లేదా మ్యూజిక్ వింటున్నారని ఆ వైర్ చూడగానే ఎదుటివారికి ఈజీగా అర్థమవుతుంది. యువతను, ట్రెండ్ ఫాలో అయ్యే ఫ్యాషన్ ప్రియులను ఈ లుక్ తెగ ఆకట్టుకుంటోంది. దీనికి తోడు డైలీ ఛార్జింగ్ పెట్టుకోవాలనే తిప్పలు, బ్లూటూత్ సిగ్నల్ కట్ అవుతుందనే టెన్షన్లు అస్సలు ఉండవు. ఈ సౌలభ్యం వల్ల సెలబ్రెటీల నుంచే కాకుండా సామాన్యుల్లో వీటికి ఆదరణ పెరుగుతోందని చెబుతున్నారు నిపుణులు.

స్పష్టమైన ఆడియో క్వాలిటీ :

  • బ్లూటూత్ ద్వారా పాటలు వినేటప్పుడు ఆడియో క్వాలిటీ కొంతమేర తగ్గుతుంది. వైర్​లెస్​లో ఆడియో డేటా కంప్రెస్ అయి గాలిలో ప్రయాణిస్తుంది. దీనివల్ల స్పష్టత కాస్త తగ్గుతుంది. కానీ వైర్డ్ కనెక్షన్ ద్వారా ఎటువంటి నాణ్యత తగ్గకుండా పూర్తి క్లారిటీతో కూడిన ఆడియో వస్తుందంటున్నారు నిపుణులు.
  • అతి తక్కువ ధరలోనే అత్యుత్తమ స్టూడియో ఆడియో క్వాలిటీని ఇచ్చే ఇన్-ఇయర్ మానిటర్లు(ఐఈఎం) లభిస్తున్నాయి. ఇవి కొన్ని ఖరీదైన బ్లూటూత్ బడ్స్ కంటే మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తున్నాయి.
  • ఇయర్​బడ్స్​లోని బ్యాటరీల గరిష్ఠ పనితీరు సామర్థ్యం 2 నుంచి 3 ఏళ్లు. కానీ వైర్డ్ ఇయర్ ఫోన్లు ఏళ్ల తరబడి పని చేస్తాయి. కేబుల్ మార్చుకునే వెసులుబాటు ఉన్న ఐఈఎంలు అయితే కేబుల్ పాడైనా తక్కువ ధరలోనే ఛేంజ్ చేసుకోవచ్చు.
  • గేమింగ్​కు, ఫోన్​లో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇవి బాగా పనికొస్తాయి. బ్లూటూత్ వాడితే ఆడియోలో జాప్యం(లేటెన్సీ) ఉంటుంది. వైర్డ్ ఇయర్ ఫోన్లలో తక్షణమే ఆడియో వినిపిస్తుంది.
  • లోపల ఏముందో క్లియర్​గా చూపే ట్రాన్స్​పరెంట్ డిజైన్ ఇయర్ ఫోన్స్​ ప్రస్తుతం యూత్​ను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఈ డిజైన్ ఇయర్ ఫోన్స్ వాడటమే ఒక ట్రెండ్​గా మారిందంటున్నారు నిపుణులు.

'పెద్ద రెక్కల ఫ్యాన్లు' - తక్కువ తిరిగినా ఎక్కువ గాలి!

కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే!

  • సంప్రదాయ 3.5 ఎంఎం జాక్ ఇయర్ ఫోన్లు ల్యాప్​టాప్​లు, మీ ఫోన్​లో హెడ్​ఫోన్ జాక్ ఉన్నట్లయితేనే పనిచేస్తాయి. టైప్ సి లేదా లైట్​నింగ్ కనెక్టర్స్ ఇయర్ ఫోన్లను 3.5 ఎంఎం జాక్ లేని స్మార్ట్​ఫోన్లకు నేరుగా ప్లగ్ చేయవచ్చు.
  • మంచి ఆడియో కోసం క్వాలిటీ డ్యాక్ ఉండేలా చూసుకోవాలి. ఇది ఆడియో సిగ్నల్స్​ను డిజిటల్ నుంచి అనలాగ్​కు ప్రాసెస్ చేస్తుంది.
  • మార్చుకోగలిగే కేబుల్స్ ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడం బెటర్. ఈ వెసులుబాటు ఇన్-ఇయర్ మానిటర్లలో ఉంటుంది. వైర్ పాడైతే కొత్తవి తీసుకోవాల్సిన పని లేదు. కేవలం వైర్ మార్చుకుంటే సరిపోతుంది.
  • బిల్డ్ క్వాలిటీ, డిజైన్​పై దృష్టి పెట్టాలి. అల్లిన వైర్లు(బ్రెయిడెడ్ కేబుల్స్) లేదా చిక్కుపడని(ట్యాంగిల్ ఫ్రీ) ఫ్లాట్ కేబుల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి త్వరగా తెగిపోవు.
  • చెవిలో సరిపోయే, బయటి శబ్దాలు రాకుండా ఉండేందుకు సిలికాన్ లేదా మెమరీ ఫోమ్ టిప్స్ ఉన్నవి తీసుకోవడం మేలు.
  • కాల్స్ ఈజీగా మాట్లాడటానికి, వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవడానికి వీలుగా మైక్ ఉన్న వైర్డ్ ఇయర్ ఫోన్లను తీసుకోవడం మంచిది.
  • ఇక మీరు రన్నింగ్ లేదా వర్సవుట్స్ చేసేవారైతే చెమట వల్ల త్వరగా పాడవకుండా ఉండేందుకు కనీసం ఐపీఎక్స్ రేటింగ్ ఉన్న ఇయర్ ఫోన్లను ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు టెక్ నిపుణులు.

పాత ఇంటికి కొత్త 'లగ్జరీ' లుక్! - ఈ చిన్న మార్పులు ట్రై చేయండి!

'నో స్కాన్, నో పిన్' - జస్ట్ స్మార్ట్ వాచ్ ట్యాప్ చేస్తే చాలు పేమెంట్ కంప్లీట్!