ETV Bharat / offbeat

టేస్టీ "మునగాకు కారం పొడి" - ఇడ్లీ, దోసె, వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది!

ఈజీ మునగాకు రెసిపీ - ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలు!

moringa_powder_recipes
moringa_powder_recipes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2025 at 10:03 AM IST

2 Min Read
Choose ETV Bharat

MORINGA POWDER RECIPES : మునక్కాడలే కాదు! మునగ ఆకు వాడకం కూడా పెరిగిపోయింది. మునగాకు పచ్చడి, పప్పు, ఇగురు చేస్తున్న నేపథ్యంలో మునగాకు కారం పొడి కూడా విశేషంగా వాడుకలోకి వచ్చింది. అయితే, ఈ మునగాకు కారం పొడి ఇడ్లీ, దోసెల్లాంటి టిఫిన్లలోకి మాత్రమే కాకుండా వేడి వేడిగా అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది.

"పండు మిర్చి, టమోటా నిల్వ పచ్చడి" - అప్పటికప్పుడు సింపుల్​గా ఇలా చేసుకోవచ్చు!

moringa_powder_recipes
moringa_powder_recipes (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • మునగాకు - 3 కప్పులు
  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • పల్లీలు - 2 టేబుల్ స్పూన్
  • పచ్చి శనగ పప్పు - 1 టేబుల్ స్పూన్
  • మినప్పప్పు - అర టేబుల్ స్పూన్
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - అర స్పూన్
  • నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  • ఎండు మిర్చి - 20
  • చింతపండు - నిమ్మకాయ సైజు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వెలుల్లి రెబ్బలు - 10
moringa_powder_recipes
moringa_powder_recipes (Getty images)

తయారీ విధానం :

  • మునగాకు ముదురు రంగులో ఉన్నది తెచ్చుకుని ఆకులు కట్ చేసి పెట్టుకోవాలి. నీళ్లలో వేసి శుభ్రం చేసుకుని ఆ తర్వాత నీళ్లు లేకుండా తీసుకోవాలి. ఫ్యాన్ కింద క్లాత్ పై ఆరబెట్టుకుంటే బాగా ఆరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్న మునగాకుతో పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
moringa_powder_recipes
moringa_powder_recipes (Getty images)
  • ముందుగా ప్యాన్​లో నూనె పోసుకోవాలి. వేడెక్కగానే పల్లీలు వేసుకుని వేయించి పక్కకు తీసుకోవాలి. మళ్లీ అదే కడాయిలో మిగిలిన నూనెలో పచ్చి పప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించాక చివర్లో నువ్వులు వేయించాలి. ఇపుడు అవన్నీ పక్కకు తీసుకుని పెట్టుకోవాలి.
moringa_powder_recipes
moringa_powder_recipes (Getty images)
  • మళ్లీ అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని 20 ఎండు మిర్చి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా చింతపండు వేసుకుని లో ఫ్లేమ్​లో వేయించాలి. ఆ తర్వాత వేయించిన పదార్థాలు కలపాలి. ఇపుడు అదే కడాయిలో మునగాకు, కరివేపాకు వేసుకుని పొడి పొడిగా వేయించాలి. మునగాకు క్రిస్పీగా వేయించుకుని తీసుకోవాలి.
moringa_powder_recipes
moringa_powder_recipes (Getty images)
  • ఇపుడు మిక్సీ జార్​లోకి ఎండు మిర్చి, ధనియాలు, నువ్వులు వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆతర్వాత పల్లీలు, మునగాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరో సారి గ్రైండ్ చేసుకోవాలి. ఇపుడు చివరగా వెలుల్లి రెబ్బలు కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకుని వెడల్పాటి ప్లేట్​లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కాస్త వెయ్యి వేసుకుని తింటుంటే ఎంతో కమ్మగా ఉంటుంది.

హోటల్ స్టైల్ అల్లం చట్నీ - ఒక్క సారి చేసి పెట్టుకుంటే నెల రోజులు తినేయొచ్చు!

బెండకాయలు పెంకపై కాల్చి ఇలా చట్నీ చేయండి - ఈ రోటి పచ్చడి ట్రై చేశారా?