నోరూరించే "దొండకాయ ఉల్లి కారం" - ఇలా చేస్తే అన్నం ఒక్క ముద్ద కూడా మిగల్చరు!
పిల్లలూ ఇష్టంగా తినే దొండకాయ రెసిపీ - ఈ పద్ధతిలో నిమిషాల్లోనే రెడీ!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 5:20 PM IST
Dondakaya Ulli Karam Recipe : దొండకాయతో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఓకే విధంగా కాకుండా ఓసారి ఈ స్టెప్స్ పాటిస్తూ దొండకాయ ఉల్లి కారం ట్రై చేశారంటే సూపర్‌గా వస్తుంది. ఈ కర్రీ కాస్త కారంగా, కాస్త ఘాటుగా ఉండి నోటికి కొత్త రుచినిస్తుంది. ఇది చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. బిగినర్స్ అయితే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ టేస్ట్ చేసినవారు వన్స్‌మోర్ అంటారంతే! మరి ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "షీర్ కుర్మా" - రంజాన్ మాసంలో ఇలాగే చేస్తుంటారు!

కావాల్సిన పదార్థాలు :
- దొండకాయలు - అర కిలో (500 గ్రామలు)
- ఉల్లిపాయలు - 4
- ఎండుమిర్చి - 20
- జీలకర్ర - 2 టీ స్పూన్లు
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- చింతపండు - 30 గ్రాములు
- వెల్లుల్లి రెబ్బలు - 20
- కొత్తిమీర - కొద్దిగా
- ఆయిల్ - 8 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా అర కిలో దొండకాయలు, నాలుగు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఓ చిన్న గిన్నెలో 30 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్లాలి. పది నిమిషాల తర్వాత రసం తీసి పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన అనంతరం రెండు టీ స్పూన్ల జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, 20 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి.
- ఈ మిశ్రమం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి.

- ఆ తర్వాత ఉల్లిఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీజార్‌లో వేయాలి. ఇందులోనే 20 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇదే పాన్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. నూనె కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి కలపాలి. అనంతరం మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు దొండకాయ ముక్కలను మగ్గించాలి.

- పది నిమిషాల అనంతరం కొద్దిగా కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం, తీసి పెట్టుకున్న చింతపండు రసం వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఆయిల్ పైకి తేలెంత వరకు కలుపుతూ వేయించాలి.
- ఆయిల్ సేపరెట్ అయిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- ఇక అంతే నోరూరించే దొండకాయ ఉల్లి కారం మీ ముందుంటుంది!
- వేడి వేడి అన్నంలో దొండకాయ ఉల్లి కారం, కాస్త నెయ్యి వేసి తింటే ఆ టేస్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది!
- ఈ పద్ధతిలో చేసి పెడితే ఇంటిల్లిపాదీ మళ్లీమళ్లీ చేయమని అడుగుతారు!
టమోటాలు ఎండబెట్టకుండానే - అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చడి!
బెండకాయలతో ఇంటిల్లిపాదీకి నచ్చే "పచ్చడి"- ఇలా మిక్సీ పట్టి చేస్తే సూపర్ టేస్ట్!

