పచ్చికారంతో ఇలా "దొండకాయ కూర" వండండి - అన్నం, చపాతీ, రోటీల్లోకి అద్భుతమే!
పెరుగు, పచ్చిమిర్చితో అద్దిరిపోయే 'దొండకాయ కర్రీ' - పిల్లలకూ చాలా బాగా నచ్చుతుంది!

Published : January 8, 2026 at 6:00 PM IST
New Style Dondakaya Curry Recipe : కొన్ని కూరలు ఎండుకారంతో కంటే పచ్చికారం వేసి చేసినప్పుడే భలే రుచికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది పచ్చికారంతో సొరకాయ, వంకాయ, కోడిగుడ్డు వంటివి ఎక్కువగా చేసుకుంటుంటారు. అవి మాత్రమే కాదు మీరు టేస్ట్ చేయాల్సిన మరో సూపర్ రెసిపీ ఉంది. అదే, నోరూరించే "దొండకాయ పచ్చికారం". ఇది రెగ్యులర్‌గా చేసుకునే వాటికంటే సూపర్ టేస్టీగా ఉండి వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది.
పచ్చిమిర్చితో ఈ స్టైల్లో దొండకాయ కర్రీ చేశారంటే పిల్లల నుంచి పెద్దల వరకు వావ్ భలే రుచిగా ఉందంటూ లొట్టలేసుకుంటూ తింటారు. ఈ కర్రీ రైస్‌లోకి మాత్రమే కాకుండా చపాతీ, రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే, దీని తయారీకి ఎక్కువగా శ్రమించాల్సిన అక్కర్లేదు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా పచ్చిమిర్చితో ఈ సూపర్ టేస్టీ దొండకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- అర కిలో - దొండకాయలు
- ఆరేడు టేబుల్‌స్పూన్లు - నూనె
- ఒక టీస్పూన్ - జీలకర్ర
- కొద్దిగా - కరివేపాకు
- అర టీస్పూన్ - పసుపు
- రుచికి తగినంత - ఉప్పు
- ఆరు టేబుల్‌స్పూన్లు - పెరుగు
- ఒకట్రెండు టేబుల్‌స్పూన్లు - ధనియాల పొడి
- ఒక టీస్పూన్ - కారం
- రెండు టీస్పూన్లు - కసూరి మేతి
- ఒక టీస్పూన్ - గరంమసాలా
- కొంచెం - సన్నని కొత్తిమీర తరుగు

పచ్చికారం కోసం :
- రెండు - మీడియం సైజ్ ఉల్లిపాయలు
- పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
- వెల్లుల్లి రెబ్బలు - 15 నుంచి 20
- అల్లం - రెండించుల ముక్క
- కొత్తిమీర - రెండు పిడికెళ్లు
కొత్త పద్ధతిలో నోరూరించే "టమాటా గుడ్డు పులుసు" - బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఫ్రెష్ దొండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి చివర్లు కట్ చేయాలి.
- తర్వాత ఒక్కొ దొండకాయను సన్నగా, పొడుగ్గా నాలుగు ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు కర్రీలోకి అవసరమైన పచ్చిమిర్చి పేస్ట్‌ను ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇందుకోసం మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్క, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తుంపలు, కొత్తిమీర వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా, పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి.

- అనంతరం కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. నూనె హీట్ అయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
- అవి లైట్‌గా వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్‌లో కాసేపు కలుపుతూ వేయించుకోవాలి.
- పచ్చిమిర్చి పేస్ట్‌లోని పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని పచ్చిమిర్చి మిశ్రమం ముక్కలకు పట్టేలా ఒకసారి మంచిగా కలపాలి.

- ఆపై కర్రీ అడుగంటకుండా ఒకట్రెండు స్పూన్ల వాటర్ వేసుకుని కలిపి మూతపెట్టి సన్నని సెగ మీద నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి.
- ఇలా ఉడికించేటప్పుడు మధ్యమధ్యలో మూత తీసి కలుపుతుండాలి. లేదంటే కర్రీ అడుగంటే అవకాశం ఉంటుంది.
- దొండకాయ ముక్కలు సగం వరకు ఉడికాయనుకున్నాక అందులో పెరుగును ఉండలు లేకుండా కలిపి వేసుకోవాలి.
- అలాగే, ధనియాల పొడి, కారం, గరంమసాలా వేసుకుని మిశ్రమం మొత్తం చక్కగా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేయాలి.

- ఆ తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుని కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌లో మరో నాలుగైదు నిమిషాలు కుక్ చేసుకోవాలి.
- దొండకాయ ముక్కలు మంచిగా ఉడికి, ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు చివరగా కసూరి మేతి, సన్నని కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి దింపేసుకుంటే చాలు.
- అంతే, పచ్చికారంతో నోరూరించే "దొండకాయ కర్రీ" మీ ముందు ఉంటుంది!
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఇలా దొండకాయ కూర చేసి చూడండి. ఇంటిల్లిపాదీ తృప్తిగా తినేస్తారు.
- ఒకవేళ మీరు ఈ కర్రీని తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే దొండకాయలతో పాటు ఇతర పదార్థాలను తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.
అన్నం, టిఫెన్స్లోకి "టమాటా పచ్చడి" - పుదీనాతో కలిపి ఇలా చేస్తే ఆ టేస్ట్ నెక్ట్స్ లెవల్!
ఎన్నడూ ట్రై చేయని కొత్తరకం "బెండకాయ పచ్చడి" - పెనంపై కాల్చి చేయడంలోనే టేస్ట్ సీక్రెట్!

