ETV Bharat / offbeat

వంటగదిలో 'వెనిగర్' ఉంటే చాలు - గిన్నెల క్లీనింగ్ నుంచి స్టిక్కర్ల తొలగింపు వరకు అన్నీ చిటికెలోనే!

వెనిగర్ వంటలకు రుచినే కాదు - మరెన్నో పనులకు వాడొచ్చంటన్న నిపుణులు!

Apple Cider Vinegar
యాపిల్ సైడర్ వెనిగర్ (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 28, 2026 at 2:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

Apple Cider Vinegar Benefits : 'యాపిల్ సైడర్ వెనిగర్'​ను ఎక్కువ మంది వంటలలో మంచి రుచి కోసం వాడుతుంటారు. మరికొందరు ఇంటిని శుభ్రం చేయడానికి, పండ్లు, కూరగాయలను కడిగేందుకు, మౌత్ వాష్​గానూ ఉపయోగిస్తుంటారు. అయితే, వీటితో పాటు యాపిల్​ సైడర్ వెనిగర్​ను ఇంట్లో మరెన్నో పనులకూ వాడొచ్చంటున్నారు నిపుణులు. మాడిపోయిన పాత్రల క్లీనింగ్ నుంచి కొత్త పాత్రలకు అతికించిన స్టిక్కర్లు, బార్‌కోడ్‌లను తొలగించడం వరకు అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆహారపదార్థాలు మాడిపోయినప్పుడు 'గిన్నెలు' నల్లగా తయారవుతాయి. అప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఇలా వాడితే ఆ మరకలు ఈజీగా వదులుతాయంటున్నారు నిపుణులు. మాడిపోయిన పాత్రలో కప్పు నీరు, కప్పు యాపిల్ సైడర్ వెనిగర్‌ పోసి స్టవ్ మీద ఉంచి బాగా వేడి చేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక రెండు స్పూన్ల బేకింగ్ సోడాను కలిపితే నురగ మాదిరిగా వస్తుంది. అది రావడం ఆగిపోయాక గిన్నెలోని మిశ్రమాన్ని ఒంపి నీటితో శుభ్రం చేయాలి. ఆపై పేపర్ టవల్‌తో తుడిస్తే సరిపోతుందంటున్నారు.

పాలడబ్బాలు, పాలపీకలు క్లీన్ :

చిన్నారుల పాలడబ్బాలు, పాలపీకలను ఎప్పటికప్పుడు క్లీన్​ చేయకపోతే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలుంటాయి. వీటిని వెనిగర్‌తో శుభ్రం​ చేయడం ద్వారా బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం వేడివాటర్​లో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ని కలిపి ఆ మిశ్రమంతో రోజుకోసారి పాలడబ్బాలు, పాలపీకలను శుభ్రం చేయాలి. ఆపై మరోసారి వేడివాటర్​తో వీటిని క్లీన్ చేస్తే సరి.

కొవ్వొత్తుల మరకలు ఈజీగా మాయం :

కొన్ని సందర్భాల్లో కొవ్వొత్తుల కారణంగా ఫ్లోర్, చెక్క వస్తువులపై మరకలు పడుతుంటాయి. వాటిని యాపిల్ సైడర్ వెనిగర్‌తో ఈజీగా పోగొట్టవచ్చంటున్నారు. ఇందుకోసం ఒక గిన్నెలో సమాన పరిమాణంలో యాపిల్ సైడర్ వినెగర్, వాటర్​ను తీసుకొని బాగా కలపాలి. అనంతరం ఆ మిశ్రమంలో వస్త్రాన్ని ముంచి మరక ఏర్పడిన చోట రుద్దితే సరి! ఆ మరకలు సింపుల్​గా మాయమవుతాయంటున్నారు.

చేపలు, మాంసం, ఉల్లి, వెల్లుల్లి వాసన చేతుల నుంచి అంత త్వరగా పోదు. సబ్బుతో చేతులు వాష్ చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. సబ్బుతో చేతులు కడిగాక కాస్త ఈ వెనిగర్‌ కలిపిన నీటితో చేతులు కడుక్కోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చేతుల నుంచి ఎలాంటి స్మెల్ రాదట.

కళ్లద్దాలపై మరకలు :

రోజూ కళ్లద్దాలు వాడే క్రమంలో మరకలు ఏర్పడడం కామన్. అలా ఏర్పడిన మరకలను తొలగించాలంటే కష్టమే. ఎందుకంటే కాస్త గట్టిగా తుడిస్తే అద్దంపై గీతలు పడే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కళ్లద్దాలపై కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను స్ప్రే చేసి మెత్తటి వస్త్రంతో తుడిస్తే మరకలు సింపుల్​గా తొలగిపోతాయంటున్నారు.

కొత్త బియ్యం కంటే పాత బియ్యం ఎందుకు మంచివి? - రుచి, వాసనలో ఏవి బెస్ట్?

కుండీల్లోని కలుపు :

యాపిల్ సైడర్ వెనిగర్ సాయంతో పెరటి తోట, కుండీల్లో వచ్చే కలుపును నాశనం చేయచ్చు. ఇందుకోసం ముప్పావు కప్పు యాపిల్ సైడర్ వెనిగర్‌లో పావు కప్పు నీటి​ని కలిపి స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఈ మిశ్రమాన్ని కలుపు మొక్కలపై స్ప్రే చేయడం ద్వారా వాటిని నాశనం చేయవచ్చంటున్నారు నిపుణులు.

కొత్త పాత్రలపై స్టిక్కర్లు :

కొత్తగా కొన్న గిన్నెలపై అతికించిన స్టిక్కర్లు, బార్‌కోడ్‌లను తొలగించడం కాస్త కష్టమే. అలాంటి టైమ్​లో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ఉపయోగించి వాటిని ఈజీగా తొలగించవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్‌లో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ పోసి దాన్ని స్టిక్కర్లపై స్ప్రే చేయాలి. ఆ తర్వాత చేత్తో రుద్దితే అవి సులువుగా పోతాయంటున్నారు.

వనస్పతి, హైడ్రోజనేటెడ్ కొవ్వులతో 'కల్తీ నెయ్యి' తయారీ - ఇంట్లోనే ఈజీగా కనిపెట్టేయండి!

'డీప్ ఫ్రిజ్' గడ్డకడితే మీరేం చేస్తారు? - టెక్నీషియన్లు సూచిస్తున్న సింపుల్ టిప్స్!