ETV Bharat / offbeat

ప్లాస్టిక్ డబ్బాలపై "మరకలు", గిన్నెల నుంచి చేపల వాసనకు - "వెన్నతో" ఇలా చేస్తే సూపర్ రిజల్ట్!

వెన్నతో వంటలు మాత్రమే కాదు - ఈ వస్తువులను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చంటున్న నిపుణులు!

Butter Uses
Butter Uses (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2026 at 5:27 PM IST

2 Min Read
Choose ETV Bharat

Butter Uses in Telugu : పాలకు సంబంధించిన ఆహారపదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిల్లో "వెన్న(బటర్)" కూడా ఒకటి. వివిధ రకాల ఆహార పదార్థాలకు రుచిని అందించడానికి దీన్ని ఎక్కువగా వాడుతుంటాం. కానీ, మీకు తెలుసా? కేవలం వంటల్లో ఉపయోగించడమే కాదు మన నిత్య జీవితంలో వెన్న వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ప్లాస్టిక్​ డబ్బాలపై మరకల నుంచి గిన్నెల నీచు వాసన పోగొట్టడం వరకు బటర్​తో బోలెడు ఉపయోగాలున్నాయంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • ప్లాస్టిక్ వస్తువులు లేదా డబ్బాలపై ఏర్పడిన మరకలు క్లీన్ చేయాలంటే ఎవరికైనా కాస్త కష్టంగానే అనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో వెన్నను ఉపయోగిస్తే వాటిపై ఉన్న మరకలను చాలా ఈజీగా తొలగించవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే, మరకలు ఏర్పడిన చోట కొద్దిగా బటర్ రాసి కొద్దిసేపు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడిచేస్తే చాలు మరకలు సులభంగా వదిలిపోయి నీట్​గా కనిపిస్తాయంటున్నారు.
  • మన ఇళ్లలో చాలా సందర్భాల్లో డోర్ క్లోజ్ చేస్తున్నప్పుడు, ఓపెన్ చేస్తున్నప్పుడు కిర్​ర్ మనే సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని పోగొట్టడానికి వెన్న చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ఇందుకోసం కొద్దిగా వెన్న తీసుకుని మడత బందులకు రాస్తే శబ్దం రాకుండా ఉంటుందని, తలుపు కూడా చక్కగా సెట్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు.
  • చేతులకు అంటుకున్న జిగురు(గ్లూ)ని వదలగొట్టడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో హ్యాండ్స్ క్లీన్ చేసుకునే ముందు బటర్ రాసుకోవడం ద్వారా గ్లూని సులభంగా వదిలించుకోవచ్చని చెబుతున్నారు.
  • కొన్నిసార్లు వేలికి ఉన్న ఉంగరాలు బిగుతుగా మారుతుంటాయి. ఎంత తీసినా రావు. అప్పుడు వేళ్లకు కాస్త బటర్ రాసి తీస్తే ఉంగరాలు ఈజీగా వచ్చేస్తాయని చెబుతున్నారు.

మార్కెట్లో "కల్తీ సోంపు గింజలు" - ఈ టిప్స్​ పాటిస్తే ఈజీగా కనిపెట్టొచ్చట!

  • మనం కొన్నిసార్లు కర్రీ వండడానికి ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కట్ చేస్తుంటాం. అలాంటప్పుడు సగం కోసిన ఉల్లిపాయలు మిగిలిపోతుంటాయి. అలా కోసి ఆనియన్స్ పాడవకుండా ఉండాలంటే వాటిపై కొద్దిగా వెన్న రాయాలని.. ఇలా చేస్తే ఉల్లిపాయ వాడిపోదని, ఘాటు కోల్పోదంటున్నారు.
  • చెక్క వస్తువులపై ఏర్పడిన నీటి మరకలు అందవిహీనంగా కనిపిస్తుంటాయి. అవి తొలగించడానికి రాత్రి టైమ్​లో కాస్త బటర్ రాసి నెక్ట్స్ డే మార్నింగ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. వుడ్​ ఫర్నిచర్‌ను మెరిసేలా చేయడానికి కూడా వెన్నను ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి బటర్ సహాయపడుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో స్కిన్ పొడిబారి ఎండిపోయినట్లు కనిపిస్తుంది. ఆ టైమ్​లో కొద్దిగా వెన్నను చర్మం మీద రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు. స్కిన్ మృదువుగా మారుతుందని చెబుతున్నారు.
  • చేపలు క్లీన్ చేసిన తర్వాత వాటిని ఉంచిన గిన్నెల నుంచి వచ్చే నీచు వాసన ఓ పట్టాన పోదు. అలాంటప్పుడు వాసన వచ్చే పాత్రలనుకాస్త వెన్నతో తోమాలి. ఆపై సబ్బు ఉపయోగించి గోరువెచ్చని వాటర్​తో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే పాత్రల నుంచి నీచు వాసన రాకుండా ఉండడమే కాకుండా, కొత్త వాటిలా కనిపిస్తాయంటున్నారు నిపుణులు.

డైట్​లో ఉన్నప్పుడు రెస్టారెంట్స్​లో తింటున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే ఇబ్బంది ఉండదు!

వర్క్ బిజీలో ఇంటి శుభ్రత తగ్గిపోయిందా? - ఈ సింపుల్ టిప్ పాటిస్తే మీరే ఆశ్చర్యపోతారు!