ETV Bharat / offbeat

'స్టార్‌లింక్' ఊహిస్తున్నంత గొప్పదా? - ఇతర ఇంటర్నెట్ సేవలతో పోల్చితే తేడాలివీ!

దేశంలో అన్ని ప్రాంతాలకూ విస్తరించిన 4జీ సేవలు - 'స్టార్ లింక్'​తో ఎవరికి ప్రయోజనం?

స్టార్ లింక్
స్టార్ లింక్ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 12, 2026 at 11:06 AM IST

5 Min Read
Choose ETV Bharat

Starlink Internet - Comparison : ఇండియాలోకి అడుగుపెట్టకుండా తమను అడ్డుకుంటున్నారంటూ స్పేస్​ ఎక్స్ అధినేత ఎలాన్​మస్క్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్​లింక్, BSNL సహా ఇతర ప్రైవేటు టెలికాం సంస్థలకు మధ్య తేడాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఇంటర్నెట్ వేగం, ధరల మధ్య వ్యత్యాసాన్నీ పరిశీలిద్దాం.

స్టార్‌లింక్ అంటే?

మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించడానికి ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX) అభివృద్ధి చేసిన ఉపగ్రహ నెట్‌వర్క్ పేరే స్టార్‌లింక్. స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, వీడియో కాల్స్ కోసం బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను అందించడానికి తక్కువ భూ కక్ష్య (LEO)ను ఉపయోగించుకుంటుంది. భూమి నుంచి ప్రయోగించిన ఇతర ఉపగ్రహాలు 30వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో పరిభ్రమిస్తుంటాయి. కానీ, స్పేస్​ఎక్స్ ఉపగ్రహాలు చాలా తక్కువ ఎత్తులో 200 నుంచి 2 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నాయి.

స్టార్‌లింక్ Vs సంప్రదాయ శాటిలైట్ ఇంటర్నెట్

భారతదేశంలో ఇప్పటికే హ్యూస్ కమ్యూనికేషన్స్, బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలున్నాయి. కానీ, అవి భూమికి 35వేల కి.మీ. కంటే ఎక్కువ ఎత్తులో పరిభ్రమించే జియోస్టేషనరీ శాటిలైట్ల (GEO)పై ఆధారపడి ఉంటాయి. ప్రైవేటు సంస్థలైన జియో, ఎయిర్​టెల్ సైతం మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO దాదాపు 10వేల కి.మీ.ఎత్తు) శాటిలైట్ల మిశ్రమాన్ని ఉపయోగించుకోవడం ద్వారా సేవలు అందిస్తున్నాయి.

దేశంలోని బీఎస్ఎన్​ఎల్(BSNL) సహా ఇతర నెట్‌వర్క్‌లకు, స్టార్‌లింక్‌ మధ్య ఉన్న ఏకైక తేడా లాటెన్సీ, కేబుల్ రహిత వ్యవస్థ మాత్రమే. లాటెన్సీ అంటే డేటా వినియోగదారుడి నుంచి శాటిలైట్‌కు వెళ్లి తిరిగి చేరుకోవడానికి పట్టే సమయం (వేగం) సంప్రదాయ GEO శాటిలైట్లు, MEO శాటిలైట్ల ఇంటర్నెట్ ద్వారా వీడియో కాల్స్, గేమింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు మందకొడిగా సాగుతాయి. కానీ, LEO ద్వారా పని చేసే స్టార్‌లింక్ ఈ వేగాన్ని అందుకుంటుంది. ఈ నేపథ్యంలో రియల్-టైమ్ అప్లికేషన్లకు ఈ తక్కువ లేటెన్సీ కీలకంగా మారుతుంది. మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు స్టార్​లింక్ ఇంటర్నెట్ సౌకర్యంగా ఉంటుంది.

తక్కువ కక్ష్య ఎందుకు మేలు

తక్కువ జాప్యం : భూస్థిర ఉపగ్రహాల నుంచి వచ్చే సంకేతాలు చాలా దూరం ప్రయాణించాలి. దీంతో వేగం తగ్గిపోతుంది. కానీ, భూమికి దగ్గరగా ఉండే LEO ఉపగ్రహాలు, సంకేత ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఇంటర్నెట్ స్పీడ్ అధికంగా ఉంటుంది.

స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది

దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఫైబర్ ఆప్టిక్స్ వంటి సంప్రదాయ కేబుల్ ఆధారిత పద్ధతులకు భిన్నంగా శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా డేటాను ప్రసారం చేస్తుంది. ఇంటర్నెట్ డేటా గ్రౌండ్ స్టేషన్ల ద్వారా రేడియో సిగ్నల్స్ ద్వారా ప్రసారం అవుతాయి. స్టార్‌లింక్ ఉపగ్రహాలు సుమారు 350 మైళ్ల ఎత్తులో తిరుగుతాయి.

కనెక్ట్ అయ్యే విధానం

స్టార్​లింక్ ఇంటర్నెట్ కోసం ఫేజ్డ్ యాంటెన్నాతో పాటు వై-ఫై రౌటర్‌ ఉంటుంది. ఇది గతంలో దూరదర్శన్ ప్రసారాల కోసం ఇంటిపై ఏర్పాటు చేసుకున్న యాంటెన్నాను పోలి ఉంటుంది. ఆకాశం కనిపించేలా పైకప్పులపై అమర్చుకోవాలి.

స్టార్‌లింక్ చరిత్ర

స్పేస్‌ఎక్స్ ఉపగ్రహ ఇంటర్నెట్ (స్టార్‌లింక్) ప్రతిపాదనను 2015 జనవరిలో ప్రకటించారు. తొలి దశలో 12 వేల శాటిలైట్లను పంపాలన్నది సంస్థ ప్రణాళిక కాగా, ప్రస్తుతం 11,129 క్రియాశీల ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. మొత్తం 42 వేల ఉపగ్రహాలను పంపించాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఉపగ్రహాల జీవితకాలం ఎంత?

స్టార్‌లింక్‌ ఉపగ్రహాల జీవితకాలం ఐదేళ్లు. గడువు పూర్తికాక ముందే వాటిని డీఆర్బిట్‌ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం 11వేలకు పైగా ఉపగ్రహాలుండగా అందులో రోజూ ఒకటీ, రెండు పడిపోతుంటాయట. వాటి శిథిలాలు భూమిని చేరకుండానే భూ దిగువ కక్ష్యలో తిరుగుతుంటాయి. స్పేస్‌ఎక్స్ మొదటి 60 స్టార్‌లింక్ ఉపగ్రహాలను 2019 మే 23న ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఆ ఉపగ్రహాలు 340 మైళ్ల (550 కిలోమీటర్ల) ఎత్తుకు విజయవంతంగా చేరుకున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాలోని అధిక భాగం, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. స్టార్‌లింక్ కార్యకలాపాలు ప్రారంభించిన మొట్టమొదటి దక్షిణాసియా దేశంగా భూటాన్ (ఫిబ్రవరి 2025) నిలిచింది.

చందాదారులు, ఆదాయం : 2026 జూన్ 30 నాటికి స్టార్‌లింక్‌ 167 దేశాల్లో 12 మిలియన్ల చందాదారులను (డైరెక్ట్ టు సెల్ కనెక్షన్లు) కలిగి ఉంది. నెలకు ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున 66డాలర్ల చొప్పున ఆదాయం లభిస్తోంది. ఇక మొబైల్ వినియోగదారుల సంఖ్య 22 మిలియన్లు.

భారతదేశంలో కనెక్టివిటీ అంతరం?

దేశంలో 6,44,131 గ్రామాలు ఉండగా, 6,32,875 గ్రామాలకు 4G కనెక్టివిటీ ఉందని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ చెప్తోంది. అందులోనూ 3,96,012 గ్రామాలకు 5G కనెక్టివిటీ ఉంది. కేవలం 11,256 గ్రామాలకు 4G కనెక్టివిటీ లేదని చెప్తున్నా, ఆయా గ్రామాల్లో అసలు మొబైల్ నెట్‌వర్క్ ఉందా లేదా అనే విషయాన్నీ స్పష్టం చేయలేదు.

కనెక్ట్ అయ్యే విధానం

స్టార్​లింక్ ఇంటర్నెట్ కోసం ఫేజ్డ్ యాంటెన్నాతో పాటు వై-ఫై రౌటర్‌ ఉంటుంది. ఇది గతంలో దూరదర్శన్ ప్రసారాల కోసం ఇంటిపై ఏర్పాటు చేసుకున్న యాంటెన్నాను పోలి ఉంటుంది. ఆకాశం కనిపించేలా పైకప్పులపై అమర్చుకోవాలి.

స్పీడ్, ప్లాన్లు

స్టార్‌లింక్ వెబ్‌సైట్ ప్రకారం కనిష్ఠంగా 25Mbps నుంచి గరిష్ఠంగా 220 Mbps మధ్య డౌన్‌లోడ్ వేగం ఉంటుంది. సగటున 100 Mbps కంటే ఎక్కువ వేగం లభిస్తుంది.

ధరలు : స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్‌లోని తాజా వివరాల ప్రకారం గృహ వినియోగ ప్లాన్ నెలకు రూ.8,600 కాగా, హార్డ్‌వేర్ కిట్ (శాటిలైట్ డిష్, రూటర్ ఇతరత్రా పరికరాలు) ధర రూ.34,000గా ఉంది. వేగం ఎక్కువ కాబట్టి ఇది వ్యాపార, వాణిజ్య సంస్థలు కంపెనీలకు ఎంతో ప్రయోజనాన్ని అందిస్తుంది. గృహ వినియోగదారులకు భారమే అని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఎయిర్‌టెల్ రూ.1,599కి 300 Mbps బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుండగా, జియో రూ.1,499కి అందిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ BSNL రూ.899కి 200 Mbps ఇస్తోంది.

మన దేశంలో నెలవారీ ప్లాన్ల ధరలు

  1. స్టార్‌లింక్ 200Mbps - రూ.3305
  2. ఎయిర్‌టెల్ 300Mbps - రూ.1599
  3. జియో 300Mbps - రూ.1499
  4. బిఎస్‌ఎన్‌ఎల్ 200Mbps - రూ.899

ఇతర దేశాల్లో స్టార్ లింక్ ఇంటర్నెట్ ధరలు

  • ఫిలిప్పీన్స్ రూ.6308
  • హైతీ రూ.5797
  • కిరిబాటి రూ.5041
  • కోట్ డి ఐవరీ రూ.4741
  • సోలమన్ దీవులు రూ.4427
  • ఘనా రూ.4090
  • పాపువా న్యూ గినియా రూ.3691
  • సెనెగల్ రూ.3629
  • బంగ్లాదేశ్ రూ.3295
  • శ్రీలంక రూ.2685
  • ఇండోనేషియా రూ.2753
  • కెన్యా రూ.2980
  • జింబాబ్వే రూ.2899

మీ కళ్లెదుటే రోడ్డు ప్రమాదం జరిగిందా? - ఈ 8 అడుగులు వేసి చూడండి!

'పాలసీ' మధ్యలో ఆపేస్తే డబ్బులు వెనక్కి వస్తాయా? - రూల్స్ తెలియకపోతే నష్టపోతారు!

తిరుమలలో స్వామి వారి పాదాల నుంచి 'విరజానది' - ఇక్కడ నిత్య హారతి ఇస్తారని తెలుసా?