ETV Bharat / offbeat

పోస్టాఫీస్ పథకాల్లో "డబ్బులు" కడుతున్నారా? - మారిన "కొత్త రూల్స్" గురించి తెలుసా?

పోస్టాఫీసుల్లో "నగదు డిపాజిట్‌, విత్‌డ్రా" కొత్త నిబంధనలు! - పేపర్‌ వర్క్​ లేకుండా సేవలు సులభతరం!

Post office New Rules 2026
Post office New Rules 2026 (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 6, 2026 at 5:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

Post office New Rules 2026 : నేటి రోజుల్లో ప్రజల అవసరాలు మారుతున్న కొద్దీ ప్రభుత్వ శాఖలు తమ సేవల్లోనూ మార్పులు తీసుకొస్తున్నాయి. అందులో భాగంగానే పోస్టల్ సేవలను మరింత విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తపాలా శాఖ. ముఖ్యంగా ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా పోస్టాఫీసుల్లో నగదు డిపాజిట్, విత్​డ్రా రూల్స్​ సులభతరం చేసింది. పేపర్‌ వర్క్ లేకుండానే ఆధార్‌ బయోమెట్రిక్‌ ద్వారానే లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. మరి, తపాలాశాఖ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలాశాఖ కూడా తమ సేవల్లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులను తీసుకొస్తుంది. అందులో భాగంగానే ఇటీవల పోస్టాఫీసుల్లో నగదు డిపాజిట్‌, విత్‌డ్రా నిబంధనల్లోనూ మార్పులు చేసింది. ఆధార్ ఇ-కేవైసీ ద్వారా ఇకపై చిన్నమొత్తాల్లో లావాదేవీలకు పేపర్‌ వర్క్‌తో పని లేకుండా చేసింది. ఆధార్‌ బయోమెట్రిక్‌ ద్వారానే లావాదేవీలు నిర్వహించుకునే సదుపాయాన్ని ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ లిమిట్ వరకే వర్తింపు :

తపాలాశాఖ తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన రూ.50 వేల వరకు డిపాజిట్లు, రూ.20 వేల లోపు విత్‌డ్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విధానం జూన్ 22 నుంచే అమల్లోకి వచ్చింది. కేవలం సింగిల్ ఖాతాలకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుందని పేర్కొంది. అంటే, మైనర్ లేదా జాయింట్ ఖాతాలకు ఈ రూల్ వర్తించదని గుర్తుంచుకోవాలి.

EPFO కొత్త రూల్ - 20 రోజుల్లో క్లెయిమ్‌ సెటిల్‌ చేయకుంటే 12శాతం జరిమానా!

పథకాల్లో పొదుపు సులభతరం!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది భవిష్యత్తు అవసరాల కోసం వివిధ సేవింగ్ స్కీమ్స్​లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే, నార్మల్​గా డిపాజిట్ చేయాలంటే "డిపాజిట్ స్లిప్​"పై ఖాతాదారుడి అకౌంట్ నంబర్, నేమ్, అమౌంట్ వివరాలు రాస్తూ ఉంటాం. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. పోస్టాఫీస్ బ్రాంచుల్లో సుకన్య సమృద్ధి యోజ, రికరింగ్ డిపాజిట్, ఇతర పథకాల్లో సేవింగ్స్ చేసే ఖాతాదారులు ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఎటువంటి 'పే-ఇన్​ స్లిప్' లేకుండా రూ.50 వేల వరకు డిపాజిట్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది తపాలాశాఖ. అలాగే, ఎటువంటి విత్‌డ్రాయల్ స్లిప్ లేకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా రూ.20 వేల వరకు మనీ విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. అయితే, అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిపే కస్టమర్లు తప్పనిసరిగా పేపర్‌ ఆధారిత ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే.

ఈ సేవలకు e-KYC తప్పనిసరి!

ఆధార్ అథెంటికేటెడ్ e-KYC పూర్తి చేసుకున్న ఖాతాదారులు త్వరలో ఏ పోస్టాఫీసు బ్రాంచ్‌లోనైనా పేపర్ లెస్ నగదు డిపాజిట్, విత్​డ్రాయల్ సేవలు వినియోగించుకోవచ్చు. అయితే, ఆధార్ అనుసంధానం లేని ఖాతాల లావాదేవీలు కేవలం వారు అకౌంట్ ఓపెన్ చేసిన హోమ్ బ్రాంచ్‌లోనే సాగుతాయని గుర్తుంచుకోవాలి. కస్టమర్లు పోస్టాఫీస్ తీసుకొచ్చిన ఈ సేవలు వినియోగించుకోవాలంటే ఇ-కేవైసీ, బయోమెట్రిక్‌ ఆర్థిక లావాదేవీలకు మొబైల్‌ నంబర్‌ తప్పనిసరి. అలాగే, 2026 సెప్టెంబర్ 1 నుంచి DREAM యాప్ ద్వారా జరిగే లావాదేవీలకు మొబైల్ నంబర్ లింక్ ఉండాల్సిందే. మొబైల్ నంబర్ లింక్ చేయని అకౌంట్​లలో ఈ యాప్ ద్వారా ఎలాంటి లావాదేవీలను అనుమతించరు.

పోగొట్టుకున్న డబ్బుకూ "ఇన్సూరెన్స్" - కొత్తగా పాలసీలు ప్రకటించిన సంస్థలు!

ఈ "అటామిక్" అలవాట్లు - అణు బాంబు అంత పవర్​ఫుల్!