ETV Bharat / offbeat

బ్రెడ్​తో నోరూరించే కస్టర్డ్ స్వీట్ - తియ్య తియ్యగా అద్దిరిపోద్ది!

- పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా లాగిస్తారు - ఒక్కసారి తిన్నారంటే ఫ్యాన్ అయిపోతారు!

Custard Bread Sweet
Custard Bread Sweet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 4:20 PM IST

2 Min Read
Choose ETV Bharat

Custard Bread Sweet : స్వీట్​ పేరు చెప్పగానే చాలా మంది మౌత్ వాటరింగ్ అయిపోతుంది. దాని టేస్టే అలా ఉంటుంది మరి. ఈ స్వీట్లలోనూ ఎన్నెన్నో రకాలున్నాయి. ఇందులో కొన్ని చాలా చీప్​గా లభిస్తాయి. మరికొన్ని అత్యంత ఖరీదుగా కూడా ఉంటాయి. అయితే, ఇంట్లో ఉపయోగించే బ్రెడ్​తోనే సూపర్ టేస్టీ స్వీట్​ను తయారు చేయొచ్చు. అదే నోరూరించే "బ్రెడ్​ కస్టర్డ్" మరి, దీన్ని ఎలా తయారు చేయాలి? ఇందుకోసం కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

బ్రెడ్‌స్లైసులు - 4

నూనె - 2 చెంచాలు

నెయ్యి - 3 చెంచాలు

కస్టర్డ్‌ చేయడంకోసం:

పాలు - 2 కప్పులు

కస్టర్డ్‌పొడి - 5 చెంచాలు

చక్కెర - 6 చెంచాలు

డ్రై ఫ్రూట్స్‌ పలుకులు - 2 చెంచాలు

యాలకులు: 2

షుగర్‌ సిరప్‌ కోసం:

అరకప్పు వాటర్

పావు కప్పు చక్కెర

2 యాలకులు

చిటికెడు కుంకుమపువ్వు

చిలగడదుంపలతో "ఫ్రూట్​ కస్టర్డ్​" - కస్టర్డ్​ పౌడర్​ అవసరం లేదు - చాలా టేస్టీ!

తయారీ విధానం:

ముందుగా షుగర్​ సిరప్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్‌పైన ఓ కడాయిపెట్టి, అందులో నీళ్లు పోయాలి.

అందులోనే పావు కప్పు షుగర్, కుంకుమపువ్వు, యాలకులు వేసి మెల్లగా కాస్త చిక్కబడేదాకా కలుపుకుంటూ ఉండాలి. కాస్త చిక్కగా అయిన తర్వాత ఆ షుగర్‌ సిరప్‌ని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు బ్రెడ్‌ ను సిద్ధం చేసుకోవాలి. బ్రెడ్ అంచులకు ఉండే బ్రౌన్​ కలర్​ పార్ట్​ను తొలగించాలి. ఆ తర్వాత ఒక్కో బ్రెడ్‌ స్లైస్​ను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి.

తర్వాత స్టవ్‌ వెలిగించి, పాన్‌ పెట్టి నెయ్యి వేసుకోవాలి. ఈ పాన్ కాస్త లోతుగా ఉంటే బాగుంటుంది. నెయ్యితోపాటు నూనె కూడా వేసుకుని అందులో బ్రెడ్‌ ముక్కలను వేసి లైట్​ గోల్డెన్ కలర్​లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు వేరొక బౌల్​ తీసుకుని అందులో కప్పున్నర పాలు పోసుకోవాలి. స్టౌ మీద పెట్టి సన్నటి మంటపైన 5 నిమిషాలపాటు హీట్ చేసుకోవాలి.

ఇందులో 6 స్పూన్ల చక్కెర వేసి పూర్తిగా మెల్ట్ చేసుకోవాలి.

ఈ లోగా.. మిగిలిన 1/2 కప్పు పాలల్లో కస్టర్డ్‌ పౌడర్ వేసి గరిటతో ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మరుగుతున్న పాలల్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కాసేపట్లో ఈ మిశ్రమం దగ్గరికి వచ్చేస్తుంది.

అప్పుడు అందులో డ్రై ఫ్రూట్స్‌ వేసుకోవాలి. ఇంకా యాలకులను పొడి చేసుకొని వేసుకోవాలి. అనంతరం స్టవ్‌ ఆఫ్ చేసి 10 నిమిషాల సేపు చల్లారనివ్వాలి.

అనంతరం ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోవాలి. అందులో బ్రెడ్‌ స్లైసులను చక్కగా పేర్చి, వాటి పైనుంచి షుగర్‌ సిరప్‌ పోయాలి. ఆ తర్వాత కస్టర్డ్‌ వేయాలి. మరికొన్ని డ్రైఫ్రూట్స్‌ పలుకులతో గార్నిష్ చేసుకోవాలి.

అంతే, అద్దిరిపోయే బ్రెడ్‌ కస్టర్డ్‌ సిద్ధమైపోతుంది. నచ్చితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు ఎంతో ఇష్టంగా లాగిస్తారు.

వారెవ్వా అనిపించే గోదారోళ్ల స్వీట్ "పాకుండలు" - ఇలా ఈజీగా చేసుకోవచ్చు!

అద్భుతమైన రుచితో "ఫ్రూట్​ పాయసం" - ఫ్రూట్​ కస్టర్డ్​ను మించిన టేస్ట్!