ఉల్లి, వెల్లుల్లి లేకుండానే "దహీ కిచిడీ" - ఒక్కసారి తింటే టేస్ట్‌కు ఫిదా!
కిచిడీని ఓసారి ఇలా ట్రై చేయండి - టేస్ట్ అద్భుతంగా వస్తుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 28, 2026 at 2:32 PM IST
Dahi Khichdi Making in Telugu : లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం గృహిణులకు ఒక సవాల్. ఉదయాన్నే టిఫిన్ ప్రిపేర్ చేసి ఆ వెంట భోజనం తయారు చేయాలంటే కొన్నిసార్లు టైమ్ సరిపోదు. దీంతో ఇక వారు చాలా కంగారు పడుతుంటారు. ఇలాంటి సమయంలో త్వరగా పూర్తయ్యే ఓ రెసిపీని మీకోసం ఇవాళ తీసుకొచ్చాం. అదే దహీ కిచిడీ. ఉల్లి, వెల్లుల్లి లేకుండానే దీనిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా చేసే వారు కూడా ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని ఫాలో అవుతూ చేశారంటే తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఈరెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
పుల్లగా, కమ్మగా "మెంతి ఆకు, టమోటా పచ్చడి" - వారం రోజులు నిల్వ ఉంటుంది!

కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - 2 కప్పులు
- పచ్చిమిర్చి - 6
- పెసరపప్పు - 4 స్పూన్లు
- పెరుగు - ఒకటిన్నర కప్పు
- నెయ్యి - 4 స్పూన్లు
- మిరియాలు - 1 స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- జీలకర్ర - 1 స్పూన్
- ఇంగువ - 2 చిటికెడ్లు
- అల్లం తరుగు - 3 స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - అర స్పూన్

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా గిన్నెలో రెండు కప్పుల బియ్యం, నాలుగు స్పూన్ల పెసరపప్పు వేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి గంట పాటు నానబెట్టాలి. అదేవిధంగా ఆరు పచ్చిమిర్చిని మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి.
- గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో బియ్యంపెసరపప్పు మిశ్రమం, ఆరు కప్పుల నీళ్లు పోయాలి. ఇందులోనే అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. 5 విజిల్స్ వచ్చిన వచ్చిన తర్వాత అన్నాన్ని కాస్త మాష్ చేసుకోవాలి.

- ఇప్పుడు మరో గిన్నెలో ఒకటిన్నర కప్పుల పెరుగు, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలపాలి. ఇందులోనే ఆరు కప్పుల నీళ్లు, ఉడికించిన అన్నం వేసి మిక్స్ చేయాలి.
- ఇంకోవైపు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్‌లో నాలుగు స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, రెండు చిటికెడ్ల ఇంగువ, మూడు స్పూన్ల అల్లం తరుగు యాడ్ చేసి వేగనివ్వాలి.

- ఆ తర్వాత ఈ తాలింపును అన్నంపెరుగు మిశ్రమంలో వేసి కలపాలి. ఆపైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేయాలి.
- అంతే నోరూరించే దహీ కిచిడీ సిద్ధంగా ఉంటుంది!

- ఇలా ఓసారి ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ ఫుడ్‌గా మారడం ఖాయం!
- మీరు ఈ దహీ కిచిడీని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే బియ్యం, పెరుగుతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
కరకరలాడే "నువ్వల చెగోడీలు" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!
బ్రేక్‌ఫాస్ట్‌లోకి, సాయంత్రం స్నాక్ కోసం - మీల్మేకర్తో కరకరలాడించండి!

