ETV Bharat / offbeat

నోరూరించే "దోసకాయ కుర్మా" - అన్నం, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది!

దోసకాయతో సింపుల్​గా చేసుకునే రెసిపీ - ఇంటిల్లిపాదీ సూపర్ అనాల్సిందే!

Dosakaya Kurma
Dosakaya Kurma (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 20, 2026 at 3:32 PM IST

2 Min Read
Choose ETV Bharat

Dosakaya Kurma Making : వివిధ రకాల వంటల్లో దోసకాయను ఉపయోగిస్తారు. వీటితో ఎక్కువగా ఫ్రై, పప్పు వంటివి చేస్తుంటారు. అలాకాకుండా ఎప్పుడైనా దోసకాయ కుర్మా కర్రీని ప్రిపేర్ చేశారా? లేదంటే మాత్రం ఓసారి ఇలా ప్రయత్నించి చూడండి. మీరు ఇప్పటి వరకు ట్రై చేయని అద్భుతమైన రుచితో నోరూరిస్తుంది. వేడివేడి అన్నంతో పాటు చపాతీల్లోకి పర్ఫెక్ట్! పైగా ఈ రెసిపీని చాలా తక్కువ టైమ్​లో సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ రుచికరమైన దోసకాయ కుర్మాను ఎలా తయారు చేయాలి? ఇందుకు అవసరైన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

"సొరకాయ పచ్చికారం చట్నీ" - ఇంకా ఇంకా తినాలనిపించే రుచి కోసం ఇలా ట్రై చేయండి!

Dosakaya Kurma
దోసకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • దోసకాయ ముక్కలు - ఒకటిన్నర కప్పు
  • ఆయిల్ - 5 టేబుల్ స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 12
  • ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
  • పచ్చిమిర్చి - 5
  • గసగసాలు - 1 టీ స్పూన్
  • దాల్చినచెక్క - కొద్దిగా
  • లవంగాలు - 3
  • యాలకులు - 2
  • ధనియాలు - ఒకటింపావు టేబుల్ స్పూన్
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • అల్లం ముక్కలు - కొన్ని
  • వెల్లుల్లి రెబ్బలు - 12
  • పసుపు - అర టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 1 టేబుల్ స్పూన్
  • కరివేపాకు - కొంచెం
  • గరం మసాలా - పావు టీ స్పూన్
  • కొత్తిమీర - కొద్దిగా
  • పచ్చికొబ్బరి ముక్కలు - అర కప్పు
Dosakaya Kurma
టమోటాలు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా కావాల్సిన పరిమాణంలో దోసకాయలను పొట్టు తీసి గింజలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, టమోటలు, పచ్చికొబ్బరిని తరిగి ఉంచాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక దాల్చినచెక్క, మూడు లవంగాలు, రెండు యాలకులు, ఒకంటిపావు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు, ఐదు పచ్చిమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి వేగనివ్వాలి.
Dosakaya Kurma
వెల్లుల్లి (Getty Images)
  • ఆనియన్స్ వేగిన తర్వాత కొన్ని అల్లం ముక్కలు, 12 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి ఫ్రై చేయాలి. అనంతరం అర కప్పు పచ్చికొబ్బరి ముక్కలు, కప్పు టమోటా ముక్కలు వేసి వేయించి మూతపెట్టాలి.
  • టమోటాలు మెత్తబడిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మగ్గించాలి. ఇందులో అర కప్పు నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఈ మిశ్రమం మగ్గిన అనంతరం మిక్సీజార్​లో వేయాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.
Dosakaya Kurma
మసాలా దినుసులు (Getty Images)
  • ఇదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన అనంతరం ఒకటిన్నర కప్పుల దోసకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం కప్పు నీళ్లు పోసి దోసకాయలను ఉడికించాలి. దోసకాయలు ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న గ్రేవీ పేస్ట్, కప్పు వేడి నీళ్లు పోసి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మూతపెట్టి చిక్కబరచాలి.
Dosakaya Kurma
కరివేపాకు (Getty Images)
  • ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే ఘుమఘుమలాడే దోసకాయ కుర్మా తయారైనట్లే!

టిఫిన్స్​లోకి నోరూరించే "ఇడ్లీ పొడి" - ఇక చట్నీతో పనిలేదు!

అద్దిరిపోయే "వంకాయ కారం పులుసు" - కమ్మగా, కారంగా టేస్ట్ ఎంతో బాగుంటుంది!