కరకరలాడే "అటుకుల సమోసాలు" - మైదా లేకుండా సింపుల్‌గా ఇలా చేయండి!
అటుకులతో దోసెలు, ఉప్మా రోటీన్ - ఇలా ఓసారి సమోసాలు ట్రై చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 24, 2026 at 11:31 AM IST
Crispy Poha Samosa : సమోసాలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి పైకి క్రిస్పీగా, లోపల స్టఫ్ఫింగ్తో సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా వీటిని మైదాపిండితో ఉల్లి, ఆలూ స్టఫ్ఫింగ్తో చేస్తుంటారు. అలా కాకుండా ఓసారి గోధుమపిండితో ఉల్లి, అటుకులను ఉపయోగించి ఇవి చేశారంటే కరకరలాడుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. మరి అటుకుల సమోసాకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాం.
పల్లెటూరు "కాకా హోటల్ చట్నీ రెసిపీ" సీక్రెట్ ఇదే! - ఇడ్లీ, దోసెల్లోకి ఇది కమ్మగా ఉంటుంది!

కావాల్సిన పదార్థాలు :
- అటుకులు - ముప్పావు కప్పు
- గోధుమపిండి - 2 కప్పులు
- బొంబాయి రవ్వ - 2 టీ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయలు - 3
- క్యారెట్ - 1
- కొత్తిమీర - కొద్దిగా
- కారం -1 టీ స్పూన్
- చాట్ మసాలా - 1 టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- గరం మసాలా - అర టీ స్పూన్
- నిమ్మరసం - 1 టీ స్పూన్
- ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల గోధుమపిండి, రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వ వేసి కలపాలి. ఇందులో అర టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేయాలి. అనంతరం కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని సెమీ సాఫ్ట్‌గా కలపాలి. అనంతరం మూతపెట్టి 20 నిమిషాల పాటు పక్కనుంచాలి.
- అలాగే మూడు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక క్యారెట్‌ను పొట్టు తీసి సన్నగా తురుముకోవాలి.

- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ముప్పావు కప్పు అటుకులు వేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము యాడ్ చేయాలి.
- ఇందులోనే ఒక టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి. అదేవిధంగా ఒక టీ స్పూన్ చాట్ మసాలా, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి.

- అదేవిధంగా ఓ చిన్న గిన్నెలో కొద్దిగా గోధుమపిండి, కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కాస్త జారుడుగా కలిపి పక్కనుంచాలి. ఈ మిశ్రమం షీట్స్‌ను క్లోజ్ చేయడానికి పనికొస్తుంది.
- ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమపిండిని మరోసారి బాగా మిక్స్ చేయాలి. ఆపై ఆ పిండి ముద్దను నాలుగు సమాన ఉండలుగా చేయాలి.
- అనంతరం ఒక్కొ పిండి ఉండను పొడి పిండిలో అద్ది చపాతీ పీటపై వీలైనంత పల్చని చపాతీలా చేసుకోవాలి.
- ఇలా ప్రిపేర్ చేసిన చపాతీ నాలుగు ఎడ్జ్‌లను ముందుగా చాకుతో కట్ చేయాలి. ఆపై స్క్వేర్ షేప్‌లో మీకు కావాల్సిన పరిమాణంలో సమోసా షీట్స్లా కట్ చేసుకోవాలి.

- అనంతరం ఒక్కో షీట్‌ని తీసుకుని సమోసా షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసి అందులో ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్‌ను సరిపడా నింపాలి.
- ఆ తర్వాత అంచులు ఊడిపోకుండా ముందుగా కలిపి పెట్టుకున్న తడి పిండిని అప్లై చేసి అంచులను చక్కగా కవర్ చేయాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయికి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత సమోసాలను ఒక్కొక్కటిగా వేయాలి. అనంతరం మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వీటిని రెండు వైపులా టర్న్ చేస్తూ క్రిస్పీగా, గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి.
- సమోసాలు పర్ఫెక్ట్గా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
- అంతే కరకరలాడే అటుకుల సమోసాలు మీ ముందుంటాయి!
జిగురు లేకుండా "బెండకాయ పచ్చడి" - రోటి పచ్చడిలా అద్భుతంగా ఉంటంది!
"కారం పొడులు" మీకు ఇష్టమా? - ఇలాంటి "పుదీనా కారం పొడి" సింపుల్‌గా చేసేయండి!

