పిల్లలు ఇష్టంగా తినే క్రిస్పీ "సోయా చంక్స్" - తక్కువ నూనెతోనే కరకరలాడుతాయి!
సోయాతో సింపుల్‌గా చేసుకునే స్నాక్ రెసిపీ - నోటికి కొత్త రుచినిస్తాయి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 27, 2025 at 3:14 PM IST
Crispy Soya Chunks Making : సాయంత్రం వేళలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకునే ఒక సూపర్ స్నాక్ రెసిపీ ఉంది. అదే సోయా చంక్స్ (మీల్ మేకర్)తో సింపుల్‌గా చేసుకునే స్నాక్. నార్మల్‌గా అందరూ వీటితో కర్రీ లేదా ఫ్రై లేదా ఇతర కూరగాయలతో కలిపి రెసిపీలు ఎక్కువగా చేస్తుంటారు. కానీ ఎప్పుడూ అవేకాకుండా ఈసారి వెరైటీగా ఇలా క్రిస్పీ సోయా చంక్స్ చేసుకోండి. ఇవి తక్కువ పదార్థాలతో, నిమిషాల్లోనే అప్పటికప్పుడు రెడీ అవుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి. అలాగే ఇవి ఆయిల్‌ను కూడా అంతగా పీల్చవు! మరి ఈ రెసిపీని ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఘుమఘుమలాడే చుక్క కూర పప్పు - ఇలా చేస్తే ఎంతసేపైనా గట్టిపడదు!

కావాల్సిన పదార్థాలు :
- సోయా చంక్స్ (మీల్ మేకర్) - 1 కప్పు
- పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
- కారం - 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర - కొద్దిగా
- మైదాపిండి - 2 టేబుల్ స్పూన్లు
- బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నిమ్మరసం - 1 టీ స్పూన్
- ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడా
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం :
- ముందుగా కప్పులో కప్పు సోయా చంక్స్, సరిపడా వేడి నీళ్లు పోసి నానబెట్టాలి.
- ఇంకోవైపు మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.

- ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి, రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కొంచెం ఆయిల్ యాడ్ చేసి కలపాలి. అలాగే నానబెట్టిన సోయా చంక్స్ వేసి మిక్స్ చేయాలి.
- మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సోయా చంక్స్‌ను ఒక్కొక్కటిగా కడాయికి సరిపడా వేసి ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి.

- ఆ తర్వాత సోయా చంక్స్‌ను రెండు వైపులా టర్న్ చేస్తూ దోరగా వేగనివ్వాలి. అనంతరం వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.
- ఇక అంతే సోయాతో వేడివేడి క్రిస్పీ స్నాక్ రెడీ అయినట్లే!

- ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది.
- మీరు ఈ క్రిస్పీ సోయా చంక్స్‌ను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే సోయా చంక్స్‌తో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
నోటికి కొత్త రుచినిచ్చే రాజస్థానీ "మిర్చీ బజ్జీలు" - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!
టేస్టీ "మునగాకు కారం పొడి" - ఇడ్లీ, దోసె, వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది!

