ETV Bharat / offbeat

గోధుమపిండి, మెంతి కాంబోలో "చిప్స్​" - కరకరలాడుతూ నెల రోజుల నిల్వ ఉంటాయి!

-గోధుమపిండితో పూరీలు, చపాతీలు మాత్రమే కాదు - ఇలా మెంతి కాంబోలో చిప్స్​ చేసుకోండి, కిర్రాక్​ ఉంటాయి!

Crispy Snacks with Menthikura
Crispy Snacks with Menthikura (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 11:06 AM IST

3 Min Read
Choose ETV Bharat

Crispy Snacks with Menthikura: ఇంట్లో గోధుమపిండి ఉంటే చాలా మంది అమ్మలు చపాతీలు, పూరీలు చేస్తుంటారు. లేదంటే అప్పటికప్పుడు పిండి కలిపి దోశలు పోస్తుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా గోధుమపిండితో కరకరలాడే చిప్స్​ చేసుకోవచ్చు. అది కూడా మెంతి కూర కాంబోలో. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ప్రిపేర్​ చేసుకుంటే సుమారు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఎలాగూ సంక్రాంతి వస్తుంది కాబట్టి వీటిని చేసుకుంటే పండగకు బెస్ట్​ ఆప్షన్​. తయారు చేసుకోవడం కూడా చాలా సులువే. మరి లేట్​ చేయకుండా కమ్మని గోధుమపిండి మెంతికూరతో చిప్స్​ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • మెంతికూర తరుగు - 1 కప్పు
  • గోధుమపిండి - 2 కప్పులు
  • బొంబాయి రవ్వ - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - రెండు టీస్పూన్లు
  • పసుపు - అర టీస్పూన్​
  • మిరియాల పొడి - అర టీస్పూన్​
  • ఇంగువ - పావు టీస్పూన్​
  • వాము - 1 టీస్పూన్​
  • నువ్వులు - 4 టీస్పూన్లు
  • జీలకర్ర - 2 టీస్పూన్లు
Crispy Snacks with Menthikura
గోధుమపిండి (Getty Images)

తయారీ విధానం:

  • మీడియం సైజ్​లో ఉన్న మెంతికూర కట్టను సన్నగా తరిగి కప్పు కొలత ప్రకారం తీసుకోవాలి.
  • మెంతికూర తరుగును శుభ్రంగా కడిగి జల్లి గిన్నెలోకి వేసుకుని నీళ్లు పోయేవరకు పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి 1 టేబుల్​స్పూన్​ నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో కడిగి పెట్టుకున్న మెంతికూరను వేసి లో ఫ్లేమ్​లోనే కలుపుతూ మగ్గించుకోవాలి.
  • మెంతి ఆకులోని పచ్చివాసన పోయి పర్ఫెక్ట్​గా వేగి అంటే నూనె పైకి తేలినాక స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
Crispy Snacks with Menthikura
మెంతికూర (Getty Images)
  • వెడల్పాటి మిక్సింగ్​ బౌల్​లోకి గోధుమపిండిని జల్లించి తీసుకోవాలి. పిండిలో బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, ఇంగువ, నువ్వులు, వాము, జీలకర్ర వేసుకోవాలి. వామును నలిపి తీసుకోవాలి.
  • ఈ పిండిలో పావు కప్పు నూనెను బాగా వేడి చేసుకుని పిండిలో పోసి నిధానంగా అంతా కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
  • ఇలా పిండిని పర్ఫెక్ట్​గా కలిపినాక ముందే ఫ్రై చేసిన మెంతికూరను వేసి మరోసారి అంతా కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా చపాతీ ముద్ద మాదిరి సాఫ్ట్​గా కలుపుకోవాలి.
Crispy Snacks with Menthikura
బొంబాయి రవ్వ (Getty Images)
  • ఇలా కలుపుకున్న పిండిపై ఒక టీస్పూన్​ నూనె వేసి కలిపి మూత పెట్టి సుమారు పావుగంట సేపు నానబెట్టుకోవాలి.
  • పిండిని నానినాక మరోసారి కలిపి కాస్త పెద్ద సైజ్​లో ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు ఓ ఉండను తీసుకుని చపాతీ పీట మీద ఉంచి నూనె అప్లై చేసుకుంటూ మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండేలా చపాతీలాగా రోల్​ చేసుకోవాలి.
  • ఈ విధంగా రోల్​ చేసినాక రౌండ్​, షార్ప్​లాగా ఉన్న ఏదైనా ప్లేట్​ లేదా మూత తీసుకుని రౌండ్​గా కట్​ చేసుకోవాలి. అనంతరం చాకు సాయంతో ట్రైయాంగిల్​ షేప్​లో కట్​ చేసుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా అన్నింటిని చపాతీలా చేసుకుని ట్రై యాంగిల్​ షేప్​లో కట్​ చేసుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
Crispy Snacks with Menthikura
నువ్వులు - వాము - జీలకర్ర - మిరియాల పొడి (Getty Images)
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె మీడియంగా హీట్​ అయినాక ప్రిపేర్​ చేసుకున్న చిప్స్​ వేసుకోవాలి.
  • కడాయికి సరిపడా వేసుకున్నాక వెంటనే కదపకుండా అవి కాస్త పైకి తేలినాక మీడియం ఫ్లేమ్​లో రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి.
  • ఇవి పర్ఫెక్ట్​గా కాలాక తీసి ప్లేట్​లోకి వేసుకోవాలి. ఇలానే మిగిలిన అన్నింటిని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఇవి కాస్త చల్లారిన తర్వాత తడిలేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే గోధుమపిండి, మెంతికూర కాంబోలో చిప్స్​ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Crispy Snacks with Menthikura
గోధుమపిండి మెంతికూర చిప్స్​ (ETV Bharat)

చిట్కాలు:

  • మెంతికూరను నూనెలో బాగా మగ్గించాలి. కూరలోని పచ్చివాసన పోయేవరకు మగ్గించాలి. లేదంటే చిప్స్​ కాస్త చేదుగా వచ్చే అవకాశం ఉంటుంది.
  • గోధుమపిండిలో వేడి నూనె వేసి కలిపినాక కొద్దిగా తీసుకుని గట్టిగా ప్రెస్​ చేస్తే ముద్దలాగా అవ్వాలి. ఇలా పిండి వచ్చిందంటే పర్ఫెక్ట్​గా కలిసినట్టు. అలా కాలేదంటే మరికాస్త నూనె వేడి చేసి తీసుకుంటే సరి.
  • ప్రిపేర్​ చేసుకున్న చిప్స్​ను నూనెలో వేసిన వెంటనే కదపకుండా కాస్త పైకి తేలినాక గరిటెతో కదుపుతూ వేయించుకోవాలి.

శనగపిండి లేకుండానే కరకరలాడే "జంతికలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

రెండు ఉల్లిపాయలతో క్రిస్పీ "కట్​ లెట్స్​" - 5 నిమిషాల్లో ఈవెనింగ్​ స్నాక్​ రెడీ​!