ETV Bharat / offbeat

పిల్లల కోసం అప్పటికప్పుడు చేసే క్రిస్పీ "స్నాక్" - నెల రోజులు కరకరలాడుతూ కమ్మగా తినేయొచ్చు!

అటుకులతో క్రిస్పీ అండ్ టేస్టీ "మురుకులు" - తక్కువ నూనెతో పావుగంటలోనే రెడీ!

Crispy Snack Recipe for Kids
Crispy Snack Recipe for Kids (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 17, 2026 at 5:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Crispy Snack Recipe for Kids : పిల్లలకు ఈవెనింగ్ స్నాక్స్​గా చాలా మంది మురుకులను ప్రిపేర్ చేస్తుంటారు. అయితే, నార్మల్​గా అందరూ జంతికల తయారీకి శనగపిండి వాడుతుంటారు. కానీ, ఓసారి ఇలా అటుకులతో ట్రై చేయండి. ఇవి ఎక్స్​ట్రా క్రిస్పీగా రావడమే కాకుండా మంచి టేస్టీగానూ ఉంటాయి. అలాగే, వీటిని చాలా తక్కువ పదార్థాలతో పావుగంటలోనే రెడీ చేసుకోవచ్చు. పైగా ఈ అటుకుల జంతికలు నూనెనూ అంతగా పీల్చుకోవు! కరకరలాడుతూ కమ్మగా ఉండే వీటిని పిల్లలతో పాటు పెద్దలూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి, అందుకు అవసరమైన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Crispy Snack Recipe for Kids
Crispy Snack Recipe for Kids (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • అటుకులు - ఒక కప్పు
  • పుట్నాలపప్పు - అర కప్పు
  • బియ్యప్పిండి - రెండు కప్పులు
  • తెల్ల నువ్వులు - ఒక టీస్పూన్
  • జీలకర్ర - ఒక చెంచా
  • కలోంజి సీడ్స్ - ఒక టీస్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • మిరియాల పొడి - అర టీస్పూన్
  • బటర్ - నాలుగైదు టీ​స్పూన్లు
  • నూనె - వేయించేందుకు సరిపడా

క్రిస్పీ "సగ్గుబియ్యం వడలు" - టేస్ట్​ అద్దిరిపోతాయి! - ప్రిపరేషన్​ వెరీ సింపుల్​!

Crispy Snack Recipe for Kids
Crispy Snack Recipe for Kids (Getty Images)

తయారీ విధానం :

  • కరకరలాడే ఈ స్నాక్ రెసిపీ కోసం ముందుగా పిండిని సిద్ధం చేసుకోవాలి.
  • ఇందుకోసం మొదటగా స్టవ్ ఆన్​ చేసి పాన్​లో అటుకులు, పుట్నాలపప్పును వేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్​లో కలుపుతూ వేయించాలి.
  • అటుకులు కాస్త క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. అవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్​లోకి తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
  • అనంతరం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని బియ్యప్పిండి వేసుకోవాలి. ఆపై అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని జల్లించుకోవాలి.
Crispy Snack Recipe for Kids
Crispy Snack Recipe for Kids (Getty Images)
  • తర్వాత అందులోనే జీలకర్ర, తెల్లనువ్వులు, కలోంజి సీడ్స్, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి, బటర్ వేసుకుని అవన్నీ పిండిలో కలిసేలా చేతితో రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై పిండి మిశ్రమంలో అవసరం మేరకు తగినన్ని గోరువెచ్చని నీళ్లను యాడ్ చేసుకుంటూ పిండిని మరీ మెత్తని ముద్దలా కాకుండా సెమీ సాఫ్ట్​గా కలుపుకోవాలి.
  • ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది పూరీ పిండిలా సెమీ సాఫ్ట్​గా ఉండాలి. అప్పుడే జంతికలు గుల్లగా, క్రిస్పీగా వస్తాయి.
  • అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించేందుకు తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
Crispy Snack Recipe for Kids
Crispy Snack Recipe for Kids (Getty Images)
  • ఆయిల్ కాగేలోపు జంతికల గొట్టం తీసుకుని అందులో స్టార్ షేప్(నక్షత్రాకారం) ఉన్న బిళ్లను సెట్ చేసి లోపలి భాగాన కొద్దిగా నూనెను రాయాలి.
  • ఆపై ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల పిండి మిశ్రమాన్ని తగినంత తీసుకుని మురుకుల గొట్టంలో పెట్టి క్లోజ్​ చేసుకోవాలి.
  • నూనె మీడియంగా​ హీట్​ అయ్యాక మంటను తగ్గించి పిండి నింపిన మురుకుల గొట్టంతో నేరుగా కాగుతున్న ఆయిల్​లో నెమ్మదిగా చిన్న చిన్న జంతికల్లా వత్తుకోవాలి.
  • ఆయిల్​లో నేరుగా వత్తుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే చిల్లుల గరిటె లేదా చిన్న ప్లేట్​కు కాస్త నూనె రాసి దానిపై మురుకుల్లా వత్తుకుని కాగుతున్న నూనెలో వేసుకోవచ్చు.
Crispy Snack Recipe for Kids
Crispy Snack Recipe for Kids (Getty Images)
  • పాన్​లో వేయించడానికి అనుగుణంగా వత్తుకున్నాక వెంటనే కదపకుండా రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్​లో అలాగే వేగనివ్వాలి.
  • మురుకులు కొంచెం ఫ్రై అయ్యాక చిల్లుల గరిటెతో అటు ఇటు తిప్పేస్తూ క్రిస్పీగా మారేంత వరకు వేయించుకోవాలి.
  • నూనెలో నురగలు తగ్గి చక్కగా వేగాయనుకున్నాక ప్లేట్​లోకి తీసుకుంటే చాలు.
  • అంతే, అటుకులతో భలే రుచిగా ఉండే కరకరలాడే మురుకులు నిమిషాల్లోనే రెడీ అవుతాయి!
  • ఇక వీటిని చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు హ్యాపీగా తినేయొచ్చు!
  • మరి, నచ్చితే మీరూ ఎప్పుడూ రొటీన్ జంతికలు కాకుండా ఇలా అటుకులతో ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ కమ్మగా తింటారు.

కరకరలాడే "మరమరాల మిక్చర్​" - 10 నిమిషాల్లో రెడీ - పిల్లలకు స్నాక్స్​గా బెస్ట్​!

టేస్టీ అండ్​ స్పైసీ "బ్రెడ్​ పిజ్జా బైట్స్​" - గుంత పొంగనాల పెనంలో ఈజీగా చేసుకోవచ్చు!