ETV Bharat / offbeat

అటుకులతో "పునుగులు" - పైన క్రిస్పీ, లోపల సాఫ్ట్​ - టమాటా చట్నీతో కిర్రాక్​!

-అటుకులతో టిఫెన్​ మాత్రమే కాదు - ఇలా ఈవెనింగ్​ స్నాక్స్​గా పునుగులు ప్రిపేర్ చేసేయచ్చు!

Crispy Punugulu with Poha
Crispy Punugulu with Poha (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 23, 2025 at 1:00 PM IST

2 Min Read
Choose ETV Bharat

Crispy Punugulu with Poha: పునుగులు అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. చల్లని సాయంత్రం వేళ క్రిస్పీక్రిస్పీగా ఉండే వీటిని టమాటా చట్నీతో తింటుంటే కిర్రాక్​గా ఉంటాయి. అందుకే మెజార్టీ పీపుల్​ ఈవెనింగ్​ స్నాక్స్​గా వీటికే ప్రిఫరెన్స్​ ఇస్తారు. అయితే పునుగులను ఎప్పుడూ చేసేలా కాకుండా ఓసారి అటుకులతో ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తాయి. తయారు చేసుకోవడం కూడా ఈజీనే. ఇక పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటుంటారు. మరి లేట్​ చేయకుండా కరకరలాడే పునుగులను అటుకులతో ఎలా చేయాలో చూసేయండి.

Poha
అటుకులు (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • అటుకులు - 1 కప్పు
  • మైదా పిండి - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పెరుగు - 2 కప్పులు
  • అల్లం ముక్క - చిన్నది
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • ఇంగువ - చిటికెడు
  • మిరియాల పొడి - అర టీస్పూన్​
  • బేకింగ్​ సోడా - అర టీస్పూన్​
Maida
మైదా పిండి (Getty Images)

తయారీ విధానం:

  • టేస్టీ అండ్​ క్రిస్పీ పునుగుల కోసం మిక్సీజార్​లోకి అటుకులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్​ చేసుకోవాలి.
  • గ్రైండ్​ చేసిన అటుకుల పొడిని వెడల్పాటి మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి. ఆపై అందులోకి మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు, పెరుగు వేసి ముందుగా పదార్థాలు అన్నీ కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
  • పెరుగు మొత్తం కలిసిన అనంతరం కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ పునుగులకు సరిపడే కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్​ చేసుకోవాలి.
  • ఒక్కసారి వాటర్​ సరిపోయాయి అనుకున్న తర్వాత ఒకే డైరెక్షన్​లో పిండిని చేతితో సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు మిక్స్​ చేసుకోవాలి.
Curd
పెరుగు (Getty Images)
  • పిండిని పర్ఫెక్ట్​గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టాలి.
  • ఈలోపు మిగతా పదార్థాలను రెడీ చేసుకోవాలి. అందుకోసం ముందుగా అల్లంపై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవడం లేదంటే సన్నగా తురమడం చేయాలి.
  • అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి.
  • పిండి నానిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, మిరియాల పొడి, బేకింగ్​ సోడా వేసి మరోసారి అన్నీ కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
Ginger
అల్లం (Getty Images)
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్​ కాగిన తర్వాత కలుపుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పునుగుల మాదిరి కొద్దికొద్దిగా వేసుకోవాలి.
  • ఈ విధంగా కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి చిల్లుల గరిటెతో కలుపుతూ రెండు వైపులా క్రిస్పీగా వేయించుకోవాలి.
  • పునుగులు రెండు వైపులా వేగి గోల్డెన్​ కలర్​లోకి మారినప్పుడు గరిటెతో తీసి టిష్యూ ఉన్న పేపర్​లోకి తీసుకోవాలి.
  • ఇలానే పిండి మొత్తాన్ని పునుగులుగా వేసుకుని ఆయిల్​లో వేయించుకుంటే సరి. ఎంతో టేస్టీ అండ్​ క్రిస్పీగా ఉండే అటుకుల పునుగులు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Crispy Punugulu with Poha
అటుకులతో పునుగులు (ETV Bharat)

చిట్కాలు:

  • ఈ పునుగుల కోసం మందంగా ఉండే అటుకులు కాకుండా పల్చగా ఉండే వాటిని తీసుకోవాలి. అలాగే పుల్లటి పెరుగు అయితే రుచి మరింత బాగుంటాయి.
  • పునుగుల్లోకి ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి అయినా వేసుకోవచ్చు. ఇక పునుగులను కేవలం మీడియం ఫ్లేమ్​లో మాత్రమే వేయించుకోవాలి.

కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి లేకుండా - అద్దిరిపోయే "ఆలూ ఫ్రై"!

చింతపండు రసంతో "ఉల్లిపాయ కర్రీ" - వేడివేడి అన్నంలోకి అదుర్స్!