ETV Bharat / offbeat

పిండి ఇలా కలిపి "కారప్పూస" చేయండి - స్వీట్ షాప్ స్టైల్ రుచితో కరకరలాడుతుంది!

ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినే "కారప్పూస" - ఇలా చేస్తే గుల్లగా, టేస్టీగా అద్దిరిపోతుంది!

Karapusa Recipe
Karapusa Recipe (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 5:23 PM IST

3 Min Read
Choose ETV Bharat

Karapusa Recipe in Sweet Shop Style : సంక్రాంతి వేళ మెజార్టీ పీపుల్ చేసుకునే పిండి వంటల్లో "సన్న కారప్పూస" ఒకటి. కరకరలాడుతూ మంచి రుచికరంగా ఉండే దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే, చాలా మంది కారప్పూసను ప్రిపేర్ చేసినప్పుడు గుల్లగా, క్రిస్పీగా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. మరికొందరికేమో గట్టిగా లేదా మెత్తగా వస్తుంటుంది. అలాంటి వారు పండక్కి ఓసారి ఇలా పిండి కలిపి "కారప్పూసను" ట్రై చేయండి. గుల్లగా, క్రంచీగా రావడమే కాకుండా స్వీట్ షాపు రుచిలో భలే కమ్మగా ఉంటుంది. అలాగే, దీని తయారీకి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. బిగినర్స్ కూడా కేవలం 20 నుంచి 30 నిమిషాల్లోనే చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Karapusa Recipe
శనగపిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • నాలుగు కప్పులు - శనగపిండి
  • ఆరు టీస్పూన్లు - బియ్యప్పిండి
  • ఒక టీస్పూన్ - వాము పొడి
  • రుచికి తగినంత - ఉప్పు
  • రెండు టీస్పూన్లు - కారం
  • అర టీస్పూన్ - పసుపు
  • నాలుగు టీస్పూన్లు - బటర్
  • వేయించేందుకు సరిపడా - ఆయిల్

శనగపిండి లేకుండానే కరకరలాడే "జంతికలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

Karapusa Recipe
బియ్యప్పిండి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా ఒక చెంచా పరిమాణంలో వామును పొడిలా చేసుకుని పక్కనుంచాలి.
  • ఇప్పుడు పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జల్లించుకున్న శనగపిండి, బియ్యప్పిండి, ముందుగా రెడీ చేసుకున్న వాముపొడి వేసుకోవాలి.
  • అలాగే, రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఒకసారి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో బటర్ కూడా వేసుకుని అది పిండిలో కలిసేలా మరోసారి బాగా కలుపుకోవాలి.
Karapusa Recipe
బటర్ (Getty Images)
  • పిండిని కలిపేటప్పుడు "బటర్ యాడ్ చేసుకునే" ఈ సీక్రెట్ టిప్ ఫాలో అవ్వడం ద్వారా కారప్పూస స్వీట్​షాప్ స్టైల్​లో భలే రుచికరంగా వస్తుంది.
  • అనంతరం పిండి మిశ్రమంలో తగినన్ని నీళ్లను ​కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్​గా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని అందులో సన్నని హోల్స్ ఉన్న కారపూస బిళ్లను సెట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత జంతికల గొట్టం(గిద్దెలు) లోపల కాస్త నూనె రాసుకోవాలి. ఆయిల్ అప్లై చేయడం ద్వారా పిండి మురుకుల గొట్టానికి అంటుకోకుండా ఈజీగా బయటకు వస్తుంది.
Karapusa Recipe
వాము (Getty Images)
  • ఆపై చేతికి కొద్దిగా నూనె రాసుకుని ముందుగా కలిపిపెట్టుకున్న పిండిముద్దలో నుంచి కొద్దిగా పిండిని జంతికల గొట్టంలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
  • ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్​ను లో ఫ్లేమ్​లో ఉంచి జంతికల గొట్టంతో కాగుతున్న నూనెలో చుట్టూ తిప్పుతూ కారపూసలా వత్తుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో ఉంచి వన్ సైడ్ కాలిన తర్వాత మరో వైపునకు టర్న్ చేసి అటు వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. రెండు వైపులా ఎర్రగా వేగాక ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఒకవేళ మీకు ఆయిల్​లో నేరుగా కారప్పూసను వత్తుకోవడం ఇబ్బందిగా ఉంటే ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్​ లేదా గరిటె మీద కొద్దిగా నూనె రాసి పిండిని కారప్పూసలా వత్తుకుని దాన్ని కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవచ్చు.
Karapusa Recipe
కారం (Getty Images)
  • ఇలా పిండి మొత్తాన్ని కారప్పూసలా ప్రిపేర్ చేసుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • అది పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా స్టీల్ డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే చాలు.
  • అంతే, స్వీట్ షాప్ స్టైల్​లో కరకరలాడుతూ మంచి రుచికరంగా ఉండే "సన్నని కారప్పూస" మీ ముందు ఉంటుంది!
  • మరి, నచ్చితే మీరూ సంక్రాంతికి ఇలా "కారప్పూస" చేసుకోండి. కరకరలాడుతూ కమ్మగా ఉండే దీన్ని 20 నుంచి 30 రోజుల పాటు హ్యాపీగా తినేయొచ్చు!
  • ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో ఈ రెసిపీని చేసుకోవాలనుకుంటే పదార్థాలను తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.

తెలంగాణ స్పెషల్ "సకినాలు" - పిండి ఇలా కలిపి చేస్తే కరకరలాడుతూ అద్దిరిపోతాయి!

తియ్య తియ్యగా నోరూరించే "కొబ్బరి గులాబీలు" - గరిటెకు పిండి అంటుకోకుండా ఈజీగా వస్తాయి!