ETV Bharat / offbeat

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "కొత్తిమీర పొంగలి" - కుక్కర్​లో చాలా ఈజీగా చేసుకోవచ్చు!

-ఈ స్టైల్​లో పొంగలి ప్రిపేర్ చేసుకోండి - ఇష్టం లేని వాళ్లూ ఒక ప్లేట్ ఎక్స్​ట్రానే తింటారు!

Coriander Pongal Recipe
Coriander Pongal Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 9, 2026 at 3:56 PM IST

2 Min Read
Choose ETV Bharat

Coriander Pongal Recipe: పొంగలి అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. స్వీట్ కాకుండా ​స్పైసీగా ఉండే పొంగలిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ రెసిపీని చాలా మంది ఒకటే తీరుగా చేస్తుంటారు. కానీ ఓసారి కొత్తిమీర కాంబినేషన్​లో ట్రై చేయండి. సూపర్​ టేస్టీగా ఉంటుంది. రుచి అమృతంలా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు చేసుకున్నా ఇదే పద్ధతిని ఫాలో అవుతారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా ఇష్టంగా తింటుంటారు. పైగా దీన్ని కుక్కర్​లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఈ కమ్మనైన కొత్తిమీర పొంగలి ఎలా చేసుకోవాలో చూసేయండి.

Coriander Pongal Recipe
బియ్యం (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యం - అర కప్పు
  • పెసరపప్పు - అర కప్పు
  • కొత్తిమీర - గుప్పెడు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పచ్చిమిర్చి - 3
  • పసుపు - పావు టీస్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్​
Coriander Pongal Recipe
పెసరపప్పు (Getty Images)

తాలింపు కోసం:

  • నెయ్యి - పావు కప్పు
  • జీడిపప్పు పలుకులు - గుప్పెడు
  • మిరియాలు - 1 టీస్పూన్​
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • అల్లం ముక్క - చిన్నది
  • ఇంగువ - పావు టీస్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
Coriander Pongal Recipe
కొత్తిమీర - పచ్చిమిర్చి - కరివేపాకు (Getty Images)

తయారీ విధానం:

  • ఓ గిన్నెలోకి బియ్యం, పెసరపప్పు తీసుకుని రెండుమూడు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా వాటర్​ పోసి కొద్దిసేపు పక్కన పెట్టాలి.
  • ఈలోపు ఓ పేస్ట్​ ప్రిపేర్​ చేసుకోవాలి. మిక్సీజార్​లోకి కాడలతో సహా కొత్తిమీర వేసుకోవాలి. అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, కొన్ని నీళ్లు పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
Coriander Pongal Recipe
నెయ్యి (Getty Images)
  • ప్రెషర్​ కుక్కర్​లోకి కడిగిన బియ్యం, పెసరపప్పును నీళ్లు లేకుండా తీసుకోవాలి. అందులోకి మూడు కప్పుల నీరు పోసుకోవాలి. ఆపై రుచికి సరిపడా ఉప్పు, పసుపు, గ్రైండ్​ చేసిన కొత్తిమీర పేస్ట్​, నెయ్యి వేసి నిధానంగా కలిపి మూత పెట్టి విజిల్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కుక్కర్​ పెట్టి మీడియం ఫ్లేమ్​లో నాలుగు విజిల్స్​ వచ్చేవరకు ఉడికించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
Coriander Pongal Recipe
జీడిపప్పు (Getty Images)
  • కుక్కర్​ నుంచి ఆవిరి పూర్తిగా పోయినాక మూత తీసి ఓసారి అంతా కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
  • తాలింపు కోసం స్టవ్​ ఆన్​ చేసి చిన్న కడాయి పెట్టి పావు కప్పు నెయ్యి పోసి వేడి చేసుకోవాలి.
  • కరిగిన నెయ్యిలో జీడిపప్పు పలుకులు, మిరియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి.
Coriander Pongal Recipe
మిరియాలు - జీలకర్ర (Getty Images)
  • ఇవి సగం మేర వేగినాక అల్లం తరుగు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  • జీడిపప్పు పలుకులు గోల్డెన్​ బ్రౌన్​ కలర్​లోకి మారినాక స్టవ్​ ఆఫ్​ చేసి ముందే ఉడికించుకున్న రైస్​లో వేసి అంతా కలిసేలా మిక్స్​ చేసుకున్నాక వేడివేడిగా సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పొంగలి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Coriander Pongal Recipe
కొత్తిమీర పొంగలి (ETV Bharat)

చిట్కాలు:

  • బియ్యం ఎంత తీసుకుంటే పెసరపప్పును కూడా అదే కొలత ప్రకారం తీసుకోవాలి. అప్పుడే సూపర్​ టేస్టీగా ఉంటుంది.
  • పప్పు, బియ్యం ఉడికించడానికి ఈ రెండింటిని కలిపి ఒక కప్పు తీసుకుంటే నీళ్లను మూడు కప్పులు తీసుకోవాలి.
  • అన్నం ఉడికినాక గట్టిగా అనిపిస్తే మరో కప్పు నీటిని బాగా మరిగించి ఈ రైస్​లో వేసి కలుపుకుంటే మృదువుగా ఉంటుంది.
  • కొత్తిమీరను కాడలతో సహా తీసుకుని గ్రైండ్​ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ అలా వద్దనుకుంటే నార్మల్​గా అయినా కొత్తిమీరను తీసుకుని రుబ్బుకుంటే సరి.

సంక్రాంతి స్పెషల్​: సజ్జపిండితో రుచికరమైన "మురుకులు" - పైన క్రిస్పీగా, లోపల గుల్లగా!

ఘుమఘుమలాడే "టమాటా రసం" - ఈ పొడితో ఒక్కసారి చేసుకుంటే టేస్ట్​ అస్సలు మర్చిపోలేరు!