చికెన్ షాప్ దగ్గర ఇవి గమనించారా? - మీ కళ్లెదుటే కనిపించే వీటిని గుర్తించండి!
చికెన్ ముక్కలు బరువు పెరిగేందుకు మెడిసిన్ - దుకాణాల్లో జాగ్రత్త!

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 13, 2026 at 11:32 AM IST
How to Find Fresh Chicken : నీళ్లు, పాలు, పన్నీర్ మాత్రమే కాదు! ఆహార పదార్థాలు కల్తీ మయం అవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇక చాలామంది ఎంతో ఇష్టంగా తినే చికెన్ కూడా కల్తీ చేస్తున్నారని, తద్వారా అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇంతకీ చికెన్ ఎలా కల్తీ చేస్తారు? ఎలాంటి నష్టాలు ఉంటున్నాయంటే!
కల్తీ చేసే అవకాశాలు
- కోడి బరువు పెరగడానికి, రంగు బాగా కనిపించేందుకు నీళ్లు, కృత్రిమ రంగులు, ఇతర రసాయనాలను వాడుతుంటారు.
- చికెన్ బరువు పెంచేందుకు సోయా లేదా బఠానీ వంటి మొక్కల ఆధారిత ప్రొటీన్ కలుపుతున్నారు.
- చికెన్ ముక్కలు పెద్దవిగా కనిపించేలా ట్రాన్స్‌గ్లుటమినేస్ అనే ఎంజైమ్‌ను వాడుతున్నారు.
- బ్రాయిలర్ కోళ్లు త్వరగా బరువు పెరగడానికి యాంటీ బయాటిక్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు.
ప్రాణం పోయాక 'బ్రేక్' వేస్తే ఏం లాభం! - డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే!
వాడితే రోగమే
- కల్తీ చికెన్ తినడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి, కడుపులో తిప్పడం వాంతులు, విరేచనాలు, జ్వరం, నీరసం లాంటివి వస్తాయి.
- చికెన్ శుభ్రం చేసే క్రమంలో ఉపయోగించే కలుషిత నీటితో కాంబైలోబాక్టర్, సాల్మొనెల్లా, ఈ-కొలి వంటి బ్యాక్టీరియా చేరుతుంది.
- కోళ్లు కోసే బల్లలు, చికెన్ కట్ చేసే చెక్క మొద్దులు, కత్తులు, వాడే నీరు శుభ్రంగా లేకపోతే పారాసిటిక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.
- కోళ్లలో సీసం, కాడ్మియంలాంటి రసాయనాల కారణంగా తినేవారిలో కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థకు నష్టం జరుగుతుంది.
- అనారోగ్యంతో ఉన్న కోళ్లకు వాడిన మందుల ప్రభావం కారణంగా అవి తిన్నవారికి భవిష్యత్తులో యాంటీబయాటిక్ మందులు సరిగా పనిచేయవు.
- చికెన్ కడగడానికి లేదా ప్రాసెస్ చేయడానికి కలుషితమైన నీటిని ఉపయోగిస్తే టైఫాయిడ్, కలరా వంటి తీవ్ర వ్యాధులు వస్తాయి.
అలా ఉంటే బ్యాక్టీరియా చేరినట్లే
చికెన్ తాజాగా ఉందో లేదో కనిపెట్టడానికి రంగు, వాసన, తాకి చూడడం ద్వారా తెలుసుకోవచ్చు. కొంత మంది వ్యాపారులు చికెన్ చెడిపోకుండా, తాజాగా కనిపించేలా ఫార్మాలిన్ లేదా అమ్మోనియాలాంటి హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తుంటారు. చికెన్ పాడైపోయినట్లయితే జిగట పొర ఏర్పడుతుంది. వేలితో నొక్కితే లోపలికి దిగిపోవడంతో పాటు కుళ్లిన గుడ్లలా తీవ్రమైన దుర్వాసన వస్తుంది. - డాక్టర్ జి.విజయభాస్కర్ రెడ్డి, పశు ఉత్పత్తులు, సాంకేతిక విభాగం అధిపతి, పశువైద్య కళాశాల, తిరుపతి
చికెన్ దుకాణం ఎలా ఉండాలంటే!
- చికెన్ ఎక్కువసేపు బయట వాతావరణంలో ఉంచకుండా ఫ్రీజర్/రిఫ్రిజిరేటర్‌లో సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలి.
- చికెన్ షాపుల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఎల్రక్టిక్ ఫ్యాన్‌తో సహా సరైన వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి.
- ధూళి, దుమ్ము రాకుండా కిటికీలు, తలుపులను వైర్ మెష్‌తో కప్పి ఉంచాలి.
- రక్తం, వ్యర్థ నీరు నిల్వ ఉండకుండా వెంటనే బయటకు పోయేలా మెరుగైన డ్రైనేజీ మార్గం ఏర్పాటు చేసుకోవాలి.
- చికెన్ కటింగ్ టేబుల్స్ స్టెయిన్‌లెస్ స్టీల్/సులభంగా కడగగలిగే టైల్స్‌తో నిర్మించి ఉండాలి.
- స్టెరాయిడ్లు/యాంటీబయోటిక్స్ మితిమీరి వాడిన కోళ్లను విక్రయించకూడదు.
- కోళ్లను శుభ్రం చేయడానికి, చేతులు శుభ్రం చేసుకోవడానికి సురక్షితమైన నీటిని ఉపయోగించాలి.
వ్యర్థాల నిర్వహణ
- బయో-హాజర్డ్ కంటైనర్లు ఉపయోగించాలి.
- ఈకలు, ఎముకలు, మిగిలిన వ్యర్థాలను మూత ఉన్న డస్ట్‌బిన్లలో వేయాలి.
- షాప్‌లోని వ్యర్థాలను నీటి/చేపల చెరువుల్లో కాకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన వ్యర్థ సేకరణ వాహనాలకు మాత్రమే అందించాలి.
- దుకాణంలో వర్కర్లు శుభ్రమైన ఆప్రాన్, గ్లౌజులు, క్యాప్ ధరించాలి. చేతులకు లేదా శరీర భాగాలకు గాయాలు, చర్మ వ్యాధులు ఉన్న వారిని దూరం పెట్టాలి.
'బాలాత్రిపుర సుందరీ' మన్నించమ్మా! - 'యునిసెఫ్' నివేదికలో ఏముందంటే!
పండగ వేళ 'సేల్స్ ఆఫర్ల' మాయలో పడకండి - కొనేముందు AIతో ఇలా చెక్ చేసి తీసుకోండి!

