కుక్కర్లో ఈజీగా చేసుకునే "కొబ్బరన్నం" - లంచ్బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ!
నోరూరించే రైస్ రెసిపీ - తక్కువ పదార్ధాలతో అప్పటికప్పుడు రెడీ!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 4:58 PM IST
Kobbari Annam Making : సాధారణంగా ఇండ్లలో పిల్లలు, పెద్దల కోసం వివిధ రకాల రైస్ రెసీపీలు చేస్తుంటారు. ఇవే కాకుండా మరో సూపర్ రెసిపీని మీకోసం తీసుకొచ్చాం. అదే కొబ్బరన్నం. దీనిని సింపుల్‌గా కుక్కర్లో నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లంచ్‌బాక్స్‌లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా చేసి పెడితే పిల్లలు భలే ఇష్టంగా తింటారు.
నోటికి కొత్త రుచినిచ్చే "పాలక్ సోయా బుర్జీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్‌గా చేసేయొచ్చు!

కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - ఒక కప్పు
- పచ్చికొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు
- ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- దాల్చినచెక్క - 1
- లవంగాలు - 4
- యాలకులు - 2
- బిర్యానీఆకు - 1
- జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి - 5
- ఉల్లిపాయ - 1
- కరివేపాకు - కొద్దిగా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
- కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూన్
- పుదీనా తరుగు - 1 టేబుల్ స్పూన్
- పచ్చిబఠాణీ - 2 టేబుల్ స్పూన్లు
- ధనియాలపొడి - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :
- ముందుగా గిన్నెలో కప్పు బియ్యం, నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. అదేవిధంగా ఒక ఉల్లిపాయ, ఐదు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అలాగే మిక్సీజార్‌లో ముప్పావు కప్పు పచ్చికొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో గ్లాసు నీళ్లు పోసి మిక్సీ పట్టాలి.

- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక టేబుల్ నెయ్యి వేయాలి. ఇవి వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక దాల్చినచెక్క, నాలుగు లవంగాలు, రెండు యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయాలి.
- ఇవి వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి వేగనివ్వాలి. జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి వేయించాలి.
- ఆనియన్స్ వేగాక ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, ఒక టేబుల్ స్పూన్ పుదీనా తరుగు యాడ్ చేసి వేగనివ్వాలి.

- అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల పచ్చిబఠాణీ వేసి మూడు నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి, నానబెట్టిన బియ్యం, గ్రైండ్ చేసుకున్న కొబ్బరిపాలను కొలిచి పోయాలి. (కొబ్బరిపాలు గ్లాసు పరిమాణంలో ఉంటే మరో గ్లాసు నీళ్లు పోయాలి).
- ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టాలి. అనంతరం మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.

- రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే వేడివేడి కొబ్బరన్నం సిద్ధంగా ఉంటుంది!
- ఈ కొబ్బరన్నంను మాములుగానే తినేయోచ్చు. లేదంటే రైతా వేసి తిన్నారంటే అద్దిరిపోతుంది.
సంక్రాంతి స్పెషల్ "మినప జంతికలు" - ఆయిల్ తక్కువ, క్రంచీ ఎక్కువ!
అన్నం, కర్రీ చేయాల్సిన అవసరం లేదు - ఇలా చేస్తే లంచ్ బాక్స్ కళకళ!

