కమ్మని "కొత్తిమీర కొబ్బరి రైస్" - లంచ్బాక్స్ల్లోకి అప్పటికప్పుడు చేసుకోవచ్చు!
ఇంట్లోనే సింపుల్‌గా చేసుకునే రైస్ రెసిపీ - ఇలా చేస్తే మెతుకు మిగలదు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 5:00 PM IST
Kothimeera Kobbari Rice : ఇంట్లో పిల్లలు,పెద్దలకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్నం, కూర సెపరేట్‌గా వండాలి. ఒక్కోసారి కర్రీ చేయడానికి టైమ్ లేకపోతే చట్నీతో సరిపెడుతుంటారు. అయితే ఇకపై ఆ టెన్షన్ లేకుండా చాలా అంటే చాలా ఈజీగా చేసుకునేలా ఓ రెసిపీ తీసుకొచ్చాం. అదే కొత్తిమీర కొబ్బరి రైస్. కొత్తిమీర, బియ్యం, కొబ్బరి, ఇతర పదార్థాలు వేసి ప్రిపేర్ చేసే ఈ రెసిపీ సూపర్‌గా ఉంటుంది.
ఒక్కసారి ఈ రైస్ రెసిపీని తయారు చేశారంటే వీలున్నప్పుడల్లా చేసుకొని తింటారు. బిగినర్స్ కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ ఈజీగా చేయొచ్చు. ఇది లంచ్‌లోకి మాత్రమే కాకుండా డిన్నర్ టైమ్‌లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా కొత్తిమీర కొబ్బరి రైస్ ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో? ఇప్పుడు చూసేయండి.
బొరుగులు, మరమరాలతో వడలు - మినప్పప్పుతో పన్లేకుండా ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు!

కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - ఒక కప్పు
- కొత్తిమీర - అర కప్పు
- పచ్చికొబ్బరి ముక్కలు - పావు కప్పు
- దాల్చినచెక్క - 1
- యాలకులు - 2
- లవంగాలు - 4
- ఉప్పు - రుచికి సరిపడా
- ఎండుమిర్చి - 3
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- పల్లీలు - 1 టేబుల్ స్పూన్
- జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి - 2
- జీలకర్ర - 1 టీ స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పరిమాణంలో కొత్తిమీర, పచ్చికొబ్బరి, నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో కప్పు బియ్యం, రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం కాస్త పొడిపొడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- ఇంకోవైపు మిక్సీజార్‌లో అర కప్పు కొత్తిమీర, పావు కప్పు పచ్చికొబ్బరి ముక్కలు వేయాలి. అలాగే ఒక దాల్చినచెక్క, రెండు యాలకులు నాలుగు లవంగాలు, రెండు పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టాలి.
- అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఈ మిశ్రమం వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టీ స్పూన్ జీలక్రర, మూడు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి వేయించాలి.

- ఈ మిశ్రమం వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరికొత్తిమీర పేస్ట్, ఉడికించిన అన్నం వేసి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే కమ్మని కొత్తిమీర కొబ్బరి రైస్ రెడీ అయినట్లే!

- ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలు ఒక్క మెతుకు కూడా మిగల్చరు.
- అంతేకాక ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రైస్ రెసిపీగా మారుతుంది.
'ఇలాంటి రెసిపీల వల్లే వంకాయ రుచి తెలిసిందేమో!' - ట్రై చేశారంటే మీకూ ఇలాగే అనిపిస్తుంది!
నోరూరించే "అంగూరీ రసమలై" - ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది!

