ETV Bharat / offbeat

కమ్మని "కొబ్బరి కారం పొడి" - కర్రీస్​ బోర్ కొడితే ఇదొక్కటి చాలు!

నూనె తక్కువగా, రుచి ఎక్కువగా - గృహిణులకు సింపుల్ రెసిపీ!

kobbari_karam_podi-recipe
kobbari_karam_podi-recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2025 at 5:11 PM IST

2 Min Read
Choose ETV Bharat

Kobbari Karam Podi Recipe : ఇంట్లో పూజగదిలో కొబ్బరి కాయలు కొట్టినపుడు ఫ్రిజ్​లో పెట్టేసి మర్చిపోతుంటారు చాలా మంది గృహిణులు. కానీ, పచ్చి కొబ్బరితో కారం పొడి రుచి అద్భుతంగా ఉంటుంది. ఎపుడైనా కొబ్బరి చిప్పలు మిగిలిపోయినపుడు ఇలాంటి కారం పొడి చేసి పెట్టుకోండి. కూరగాయలు బోర్ కొట్టినపుడు లేదా టైం లేనపుడు వేడి వేడిగా అన్నం పెట్టుకుని కొబ్బరి కారం పొడిలో నెయ్యి వేసుకుని తింటుంటే గొప్ప రుచిని ఆస్వాదించవచ్చు.

గోంగూర నిల్వ పచ్చడి ఇలా పెడితే ఏడాదంతా నిల్వ ఉంటుంది - ఆరబెట్టే అవసరమే లేదు!

kobbari_karam_podi-recipe
kobbari_karam_podi-recipe (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • మినపగుండ్లు - 2 టేబుల్ స్పూన్లు
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  • నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • చింతపండు - కొద్దిగా
  • వెల్లుల్లి - 15
kobbari_karam_podi-recipe
kobbari_karam_podi-recipe (Getty images)
  • ఎండు మిర్చి - 15
  • పచ్చి కొబ్బరి ముక్కలు - 1 కప్పు
  • తాలింపులోకి
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • వేరుశనగ గుండ్లు - 1 టేబుల్ స్పూన్
  • శనగపప్పు - 1 స్పూన్
  • మినప్పప్పు - 1 స్పూన్
  • ఆవాలు - అర స్పూన్
  • వెల్లుల్లి పాయలు - 6
  • కరివేపాకు - 1 రెమ్మ
  • ఇంగువ - కొద్దిగా
kobbari_karam_podi-recipe
kobbari_karam_podi-recipe (Getty images)

కొబ్బరి కారం తయారీ విధానం :

  • ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె లేకుండానే శనగపప్పు, మినపగుండ్లు సన్నటి సెగపై దోరగా వేయించాలి. అపుడే గింజలు లోపలి వరకు వేగుతాయి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, నువ్వులు సెగపైనే వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
kobbari_karam_podi-recipe
kobbari_karam_podi-recipe (Getty images)
  • అదే ప్యాన్​లో కొద్దిగా నూనె వేసుకుని ఎండు మిర్చి, కరివేపాకు వేయించాలి. ఇవి కూడా చిన్న మంటపై క్రిస్పీగా వేయించి ఆ తర్వాత చల్లార్చుకుని మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. అందులోనే చింతపండు ముక్క వేసుకుని మెత్తని పొడి చేసుకోవాలి. ఆ తర్వాత 15 వెల్లుల్లి పాయలు వేసి పల్స్ మోడ్​లో గ్రైండ్ చేసుకుని మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి.
kobbari_karam_podi-recipe
kobbari_karam_podi-recipe (Getty images)
  • ఇపుడు పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా తురుము కోవాలి. లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తురుముకున్నట్టుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్​లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కొబ్బరి రంగు మారే వరకు దోరగా వేయించాలి.
  • ఆ తర్వాత కొబ్బరి పొడి, కారం పొడిని కలుపుకుని ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పొడిలోకి తాలింపు కలిపితే సరిపోతుంది.
kobbari_karam_podi-recipe
kobbari_karam_podi-recipe (Getty images)
  • ఇపుడు ప్యాన్​లో నూనె వేసి వేరుశనగ గుండ్లు, తాలింపు గింజలు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేయించాలి. నాలుగైదు వెల్లుల్లి పాయలు, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. స్టవ్​ ఆపేసి కారం మొత్తం ప్యాన్​లో వేసి కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే సరిపోతుంది.

టేస్టీ "మునగాకు కారం పొడి" - ఇడ్లీ, దోసె, వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది!

పర్ఫెక్ట్​ రుచితో "కంది పొడి" - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!