ETV Bharat / offbeat

"న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ ఫ్రై" - రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఇంట్లోనే, ఈజీగా!

మళ్లీ మళ్లీ తినాలనిపించే టేస్టీ చికెన్ ఫ్రై - ఒక్కొక్క పీస్ అద్భుతంగా ఉంటుంది!

chicken_fry_recipe
chicken_fry_recipe (Getty images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 29, 2025 at 4:45 PM IST

2 Min Read
Choose ETV Bharat

Chicken Fry Recipe : హోటళ్లు, రెస్టారెంట్లలో తయారు చేసే చికెన్ ఫ్రై చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది. సరిగ్గా అలాంటి చికెన్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ న్యూఇయర్ పార్టీకి ఓ సారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం! బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే టేస్టీగా తినేయండి.

చేపల పులుసులో ఏదైనా టేస్ట్ మిస్సవుతున్నారా? - కారం, చింతపండు వేసే టైం ఇంపార్టెంట్!

chicken_fry_recipe
chicken_fry_recipe (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • చికెన్ - అర కేజీ
  • పసుపు - పావు స్పూన్
  • కారం - 1 స్పూన్
  • ఉప్పు - అర స్పూన్
  • నిమ్మరసం - అర చెక్క
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొత్తిమీర - కొద్దిగా
  • ధనియాలు - 1 స్పూన్
  • మిరియాలు - అర స్పూన్
  • జీలకర్ర - అర స్పూన్
  • షాజీరా - అర స్పూన్
chicken_fry_recipe
chicken_fry_recipe (Getty images)
  • దాల్చిన చెక్క - 2 ఇంచులు
  • యాలకులు - 3
  • లవంగాలు - 3
  • ఎండు మిర్చి - 4
  • చింతపండు - చిటికెడు
  • పచ్చిమిర్చి -3
  • అల్లం - 2 ఇంచుల ముక్క
  • వెల్లుల్లి - 8
  • బియ్యం పిండి -అర కప్పు
  • కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
  • జీడిపప్పు - 15
chicken_fry_recipe
chicken_fry_recipe (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా చికెన్ ముక్కలు చిన్నగా కొట్టించి తీసుకురావాలి. శుభ్రం చేసుకున్న తర్వాత తడి లేకుండా క్లాత్​తో తుడిచి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్​ బౌల్​లో వేసుకుని చికెన్ ముక్కలకు ఉప్పు, పసుపు, కారం, ఉప్పు పట్టించి నిమ్మరసం పిండుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.
chicken_fry_recipe
chicken_fry_recipe (Getty images)
  • ఇపుడు కడాయిలో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పెద్దయాలక్కాయ వేసుకోవాలి. అందులోనే నాలుగైదు ఎండు మిర్చి కూడా వేసుకుని వేయించాలి. ఆ తర్వాత దించడానికి ముందుగా రెండు రెబ్బల చింతపండు వేసుకుని వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
chicken_fry_recipe
chicken_fry_recipe (Getty images)
  • చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బరకగా గ్రైండ్ చేసి చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత అర కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని పట్టించాలి. కొద్ది కొద్దిగా 2 స్పూన్ల నీళ్లు చల్లుకుని కలిపి ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
chicken_fry_recipe
chicken_fry_recipe (Getty images)
  • ఆ తర్వాత మరో పక్కన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకోవాలి. చికెన్ లోపలి వరకు ఉడికించాలంటే నూనె వేడి కాగానే చికెన్ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్​లో బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పై లేయర్ గట్టిగా పట్టిన తర్వాత ముక్కల్ని టర్న్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని జల్లెడలోకి తీసుకోవాలి. తీయడానికి ముందుగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించి తీసుకోవాలి. అంతే! చికెన్ ఫ్రై హోటల్, రెస్టారెంట్ స్టైల్​లో అద్భుతంగా ఉంటుంది.

కమ్మని "కొబ్బరి కారం పొడి" - కర్రీస్​ బోర్ కొడితే ఇదొక్కటి చాలు!

డబల్ మసాలా చికెన్ బిర్యానీ - ఇలా చేయడం తెలిస్తే బయట కొనరు!