ETV Bharat / offbeat

పచ్చిమిర్చి​తో పసందైన "చికెన్ కర్రీ" - ఇలా చేస్తే ఇంట్లో పండగే!!

- చికెన్, పచ్చిమిర్చి కాంబోలో అద్దిరిపోయే కర్రీ - ఒక్కసారి తింటే ఫేవరెట్ లిస్టులో చేరడం పక్కా!

Chicken Curry with Pachikaram
Chicken Curry with Pachikaram (ETV Abhiruchi)
author img

By ETV Bharat Telangana Team

Published : December 5, 2025 at 10:44 AM IST

3 Min Read
Choose ETV Bharat

Chicken Curry with Pachikaram : వీకెండ్ వస్తుందంటే చాలు ముందు నుంచే చాలా మంది కొత్త నాన్​వెజ్ రెసిపీల కోసం ఆలోచన చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది చికెన్​తో రకరకాల వెరైటీ రెసిపీలు ట్రై చేస్తుంటారు. అయితే, నార్మల్​గా అందరం ఎక్కువగా ఎండుకారం వేసి చికెన్ కర్రీలు వండుతుంటాం. కానీ, ఈసారి రెగ్యులర్ పద్ధతిలో కాకుండా కాస్త డిఫరెంట్​గా "పచ్చికారంతో చికెన్ కర్రీ" వండి చూడండి. దీన్నే 'గ్రీన్ చికెన్ కర్రీ' అని కూడా అంటారు.

సరికొత్త ఫ్లేవర్​తో ఎన్నడూ తినని రుచిలో స్పైసీగా, భలే కమ్మగా ఉంటుుంది. ఈ సండే ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వారందరూ వారెవ్వా ఏమన్నా టేస్ట్ ఉందా అంటూ పండగ చేసుకోవడం ఖాయం! ఇది అన్నం, పులావ్, రోటీ, చపాతీ ఇలా దేనిలోకైనా అద్దిరిపోతుంది. అలాగే, ఈ రెసిపీ ప్రిపరేషన్​కు ఎక్కువ టైమ్ కూడా పట్టదు. తక్కువ పదార్థాలతో చాలా సింపుల్​గా రెడీ చేసుకోవచ్చు. మరి, ఈ నోరూరించే వెరైటీ అండ్ టేస్టీ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Chicken Curry with Pachikaram
Chicken Curry with Pachikaram (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • చికెన్ - 300 నుంచి 500 గ్రాములు
  • ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
  • నూనె - తగినంత
  • బిర్యానీ ఆకులు - రెండు
  • జీలకర్ర - ఒక చెంచా
  • ఎండుమిర్చి - మూడ్నాలుగు
  • జీడిపప్పులు - పది
  • పసుపు - పావు చెంచా
  • గరంమసాలా - కొద్దిగా
  • ఉప్పు - రుచికి తగినంత
  • నెయ్యి - ఒక చెంచా
  • పెరుగు - ఒకట్రెండు టేబుల్​స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Chicken Curry with Pachikaram
Chicken Curry with Pachikaram (Getty Images)

పచ్చిమిర్చి పేస్ట్ కోసం :

  • పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
  • వెల్లుల్లి రెబ్బలు - మూడ్నాలుగు చెంచాలు
  • జీడిపప్పు పలుకులు - రెండు చెంచాలు
  • కొత్తిమీర తరుగు - గుప్పెడు

చలికాలం పిల్లలకు బలాన్నిచ్చే "నువ్వుల లడ్డూలు" - పాకంతో పని లేదు, విరిగిపోవు!

Chicken Curry with Pachikaram
Chicken Curry with Pachikaram (ETV Abhiruchi)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా చికెన్​ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే, ఒక కప్పు పరిమాణంలో ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన ప్రత్యేకమైన పచ్చిమిర్చి పేస్ట్​ను ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకుని అందులో జీడిపప్పు పలుకులు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని పచ్చిమిర్చీలను ముక్కలుగా తుంచి వేసుకోవాలి.
  • అలాగే, కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి.
Chicken Curry with Pachikaram
Chicken Curry with Pachikaram (ETV Abhiruchi)
  • ఇప్పుడు కర్రీ తయారీకి స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్​ లైట్​గా వేడయ్యాక జీలకర్ర, జీడిపప్పు పలుకులు, ఎండుమిర్చి వేసి సన్నని సెగ మీద కాస్త వేయించాలి.
  • అవి లైట్​గా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకులు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి.
  • ఆనియన్స్ మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి ఒక నిమిషం కలుపుతూ వేయించాలి.
  • ఆ తర్వాత పసుపు వేసి కలిపి చికెన్​ను రెండు మూడు నిమిషాలు ఆయిల్​లో మగ్గనివ్వాలి.
Chicken Curry with Pachikaram
Chicken Curry with Pachikaram (ETV Abhiruchi)
  • ఆపై ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్పెషల్ పచ్చిమిర్చి పేస్ట్​ను జత చేసి ఒకసారి అదంతా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
  • తర్వాత కొద్దిగా గరంమసాలా కూడా వేసుకుని కలిపి మూతపెట్టి పచ్చిమిర్చి, మసాలా ఫ్లేవర్స్​ అన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా కాసేపు ఆయిల్​లో మగ్గించుకోవాలి.
  • మసాలా ఫ్లేవర్స్ చికెన్ ముక్కలకు చక్కగా పట్టి, కర్రీ దగ్గరకు అయినప్పుడు కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి.
Chicken Curry with Pachikaram
Chicken Curry with Pachikaram (ETV Abhiruchi)
  • అనంతరం మసాలా ఫ్లేవర్స్​ను బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా పెరుగు, రుచికి తగినంత ఉప్పు, నెయ్యి, కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి మూతపెట్టి చికెన్ పూర్తిగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి.
  • చికెన్ ఉడికి లైట్​గా నూనె సెపరేట్ అవుతూ మంచి సువాసన వస్తున్నప్పుడు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, పచ్చిమిర్చి పేస్ట్​తో ఘుమఘుమలాడే "చికెన్ కర్రీ" రెడీ అవుతుంది!
  • మరి, నచ్చితే మీరూ ఈ సండే పచ్చికారంతో ఇలా చికెన్ కర్రీ ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు!

వహ్వా అనిపించే "ఉలవచారు - చికెన్" - ఆల్​ టైమ్​ ఫేవరెట్​ రెసిపీ అయిపోద్ది!

వింటర్ స్పెషల్ : నువ్వులతో నోరూరించే "రసం" - రుచితో పాటు ఆరోగ్యం కూడా!