చెట్టినాడ్ స్పెషల్ "ఉక్కరై" - రుచి చూస్తే వదలరంతే!
పెసరపప్పు, బెల్లంతో సింపుల్‌గా చేసుకునే స్వీట్ రెసిపీ - ఇలా చేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 21, 2026 at 1:02 PM IST
Ukkarai Prepare in Telugu : మిఠాయిలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇక వీటి పేరు చెబితే చాలు నోట్లో నీళ్లూరుతాయి. ఇక ఫుడ్ లవర్స్ ఎప్పటికప్పుడు కొత్త స్వీట్లను టేస్ట్ చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి వారికోసమే ఇవాళ ఓ కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే చెట్టినాడ్ స్పెషల్ ఉక్కరై. ఇంట్లో ఉన్న పదార్థాలతో నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేశారంటే నోటికి కొత్త రుచినిస్తుంది. బిగినర్స్ కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ చేస్తే సూపర్‌గా వస్తుంది. అంతేకాక దీనిని దేవుడికి నైవేద్యంగానూ పెట్టొచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? ఇందుకోసం కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
టమోటాలు ఎండబెట్టకుండానే - అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చడి!

కావాల్సిన పదార్థాలు :
- పెసరపప్పు - ఒక కప్పు
- బెల్లం తురుము - 2 కప్పులు
- నెయ్యి - అర కప్పు
- జీడిపప్పు - 3 టేబుల్ స్పూన్లు
- బొంబాయి రవ్వ - పావు కప్పు
- పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు
- యాలకుల పొడి - అర టీ స్పూన్

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కప్పు పెసరపప్పు వేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి దోరగా వేయించాలి.
- పప్పు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత గరిటెతో ఓసారి బాగా కలపాలి.

- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో రెండు కప్పుల బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి బెల్లాన్ని కరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో అర కప్పు నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. అనంతరం వీటిని ప్లేట్లో వేయాలి.

- ఇదే నెయ్యిలో పావు కప్పు బొంబాయి రవ్వ వేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ వేయించాలి. అలాగే పావు కప్పు పచ్చికొబ్బరి తురము వేసి వేగనివ్వాలి. ఇందులోనే ఉడికించిన పెసరపప్పు యాడ్ చేసి కలపాలి.
- అనంతరం బెల్లం వాటర్‌ను యాడ్ చేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ ఉడికించాలి.

- ఈ మిశ్రం ఉడికాక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు యాడ్ చేసి మిక్స్ చేయాలి.
- అంతే చెెట్టినాడ్ స్పెషల్ ఉక్కరై సిద్ధంగా ఉంటుంది!
- ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది!
- మీరు ఈ స్వీట్ రెసిపీని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే పెసరపప్పు, బెల్లంతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
వీకెండ్ స్పెషల్ "పటియాలా చికెన్ కర్రీ" - ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ రుచికి ఫిదా!
టేస్టీ, యమ్మీ "దలియా" - ఈ స్వీట్‌తో ప్రతీ వేడుక సంతోషంగా జరుపుకోండి!

