ETV Bharat / offbeat

కొత్త సంవత్సరాన్ని తియ్యగా ప్రారంభిద్దాం - మీ కోసం సింపుల్ స్వీట్ రెసిపీ!

కొత్త ఏడాదిలో సరికొత్త స్వీట్ రెసిపీ - నూతన వత్సరాన్ని టేస్టీగా ఆరంభించండి!

new_year_2026_special_sweet_recipe
new_year_2026_special_sweet_recipe (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 29, 2025 at 2:39 PM IST

2 Min Read
Choose ETV Bharat

NEW YEAR 2026 SPECIAL SWEET RECIPE : నూతన సంవత్సరం వచ్చేస్తోంది. చాలా మంది ఇప్పటికే పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నారు. మీరు కూడా నూతన సంవత్సరాన్ని తియ్యని రుచితో ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే, ఇక్కడ ఇచ్చిన రెసిపీ ఓ సారి ట్రై చేసి చూడండి. ఎంతో సింపుల్​, టేస్టీగా చేసుకునే ఈ రెసిపీని కొత్త వాళ్లు కూడా ట్రై చేయొచ్చు. ఇలాంటి టేస్టీ పాయసాన్ని కుటుంబ సభ్యులతో పాటు మీ మిత్రులు, సన్నిహితులతో షేర్​ చేసి ఆనందోత్సాహాలు పంచుకోండి.

పసందైన "మలై లడ్డూలు" - కమ్మగా, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

new_year_2026_special_sweet_recipe
new_year_2026_special_sweet_recipe (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • క్యారెట్ - పావు కేజీ
  • సగ్గు బియ్యం - అర కప్పు
  • నెయ్యి - 1 టేబుల్ స్పూన్
  • జీడిపప్పు -10
  • బాదం - 6
  • కిస్​మిస్ - 20
  • పిస్తా - 6
  • బెల్లం - ముప్పావు కప్పు
  • యాలకుల పొడి - పావు స్పూన్
new_year_2026_special_sweet_recipe
new_year_2026_special_sweet_recipe (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా పావు కేజీ క్యారెట్ తొడిమ, చెక్కు తీసేసి సన్నగా తురుముకొని తీసుకోవాలి. అ తర్వాత అర కప్పు సగ్గుబియ్యం గిన్నెలో నీళ్లలో నానబెట్టుకోవాలి. సన్నటివైతే కడిగి తీసుకుంటే చాలు. దొడ్డు సగ్గుబియ్యం తప్పకుండా నానబెట్టుకోవాలి.
new_year_2026_special_sweet_recipe
new_year_2026_special_sweet_recipe (Getty images)
  • ఇపుడు కడాయిలో నెయ్యి వేసుకుని సన్నటి మంటపై పావు కప్పు డ్రై ఫ్రూట్స్ సన్నగా తరిగి వేసుకుని వేయించాలి. దోరగా వేయించుకున్నాక వాటిని పక్కకు పెట్టుకుని తురుముకున్న క్యారెట్ తురుము వేయించాలి. లో టు మీడియం ఫ్లేమ్​లో వేయించాలి. క్యారెట్ తరుగు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
new_year_2026_special_sweet_recipe
new_year_2026_special_sweet_recipe (Getty images)
  • ఇపుడు అదే కడాయిలో ముప్పావు కప్పు లేదా కప్పు బెల్లం (మీ టేస్ట్​కు తగ్గట్లుగా) తురుము, ముప్పావు కప్పు నీళ్లు పోసుకుని గరిటెతో కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం కరిగే వరకు ఉడికించుకుంటే చాలు! పాకం లాగా అవసరం లేదు. ఇపుడు స్టవ్​పై కడాయి పెట్టుకుని పాలు పొంగు వచ్చే వరకు మరిగించాలి. ఆ తర్వాత సగ్గుబియ్యం వేసుకోవాలి.
new_year_2026_special_sweet_recipe
new_year_2026_special_sweet_recipe (Getty images)
  • ఉడికిన సగ్గుబియ్యం పైకి తేలగానే వేయించి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకుని పాలలో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్​లో ఉడికించాలి. పాయసం దగ్గర పడుతున్నపుడు యాలకుల పొడి వేసుకోవాలి.
new_year_2026_special_sweet_recipe
new_year_2026_special_sweet_recipe (Getty images)
  • ఆ తర్వాత వేడి తగ్గగానే ముందుగా తయారు చేసుకున్న బెల్లం నీళ్లు వడగట్టి పోసుకోవాలి. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న క్యారెట్, సగ్గుబియ్యం పాయసం ఫ్రిజ్​లో పెట్టుకుని చల్ల చల్లగా తింటుంటే ఎంతో బాగుంటుంది. ఈ నూతన సంవత్సరం రోజున కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ క్యారెట్ పాయసం షేర్ చేసుకోండి.

క్రిస్మస్ స్పెషల్ "చాక్లెట్ కేక్" - ఓవెన్ లేకుండానే అప్పటికప్పుడు రెడీ!

చిలగడదుంపతో "గులాబ్​ జామున్​" - జ్యూసీజ్యూసీగా, సూపర్​ టేస్టీగా !