ఆలూ కాంబోలో అద్దిరిపోయే "బ్రోకలీ కర్రీ" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!
ఇంటిల్లిపాదీ నచ్చే కమ్మని బ్రోకలీ ఆలూ కర్రీ - రైస్, చపాతీ, రోటీ అన్నింట్లోకి అదుర్స్!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 3:32 PM IST
Broccoli Potato Curry in Telugu : బ్రోకలీ, బంగాళదుంపను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అయితే ఈసారి కొత్తగా ఈ రెండింటిని ఉపయోగించి ఇలా కర్రీ చేశారంటే అద్దిరిపోతుంది. బిగినర్స్ కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ ఈజీగా చేయోచ్చు. మరి బ్రోకలీ ఆలూ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఘుమఘుమలాడే "మెంతికూర పచ్చడి" - కమ్మగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది!

కావాల్సిన పదార్థాలు :
- బంగాళదుంప ముక్కలు - ఒక కప్పు
- బ్రోకలీ ఫ్లోరెట్స్ - ఒకటిన్నర కప్పులు
- బాదం - 15
- పచ్చికొబ్బరి ముక్కలు - పావు కప్పు
- జీలకర్ర - పావు టీ స్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు - 10
- ఆయిల్ - 4 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - పావు టీ స్పూన్
- ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు
- అల్లం తరుగు - అర టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీ స్పూన్
- కారం - అర టీ స్పూన్
- కొత్తిమీర - కొద్దిగా
- పచ్చిమిర్చి - 3

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పరిమాణంలో బంగాళదుంపలు, బ్రోకలీ, ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చిని తరిగి ఉంచాలి.
- ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు కప్పుల నీళ్లు పోయాలి. వాటర్ వేడైన తర్వాత కప్పు బంగాళదుంప ముక్కలు, ఒకటిన్నర కప్పుల బ్రోకలీ ఫ్లోరెట్స్, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. అనంతరం మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టి ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. ఆ తర్వాత బ్రోకలీబంగాళదుంప ముక్కలను తీసి ప్లేట్లో వేయాలి.

- అలాగే మిక్సీజార్‌లో 15 బాదం, పావు కప్పు పచ్చికొబ్బరి ముక్కలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
- అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి.
- ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ముప్పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, అర టేబుల్ స్పూన్ అల్లంతరుగు యాడ్ చేసి ఫ్రై చేయాలి.

- ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నని తరుగు యాడ్ చేసి వేయించాలి. ఇందులోనే ఉడికించిన ఆలూబ్రోకలీ, కొద్దిగా ఉప్పు వేసి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం వేసి కలపాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న బాదంకొబ్బరి పేస్ట్ యాడ్ చేసి మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇందులోనే కప్పు వేడి నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి.

- చివరన కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే ఘుమఘుమలాడే బ్రోకలీ ఆలూ కర్రీ సిద్ధంగా ఉంటుంది!
మహా శివరాత్రి స్పెషల్ : నోరూరించే "చిలగడదుంప హల్వా" - నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది!
స్టఫింగ్ లేకుండానే "గుత్తి వంకాయ కర్రీ" - అన్నం, పులావ్, రోటీల్లోకి అద్దిరిపోద్ది!

