ETV Bharat / offbeat

రెగ్యులర్ కర్రీలు బోర్ కొట్టాయా? - ఇలా వంకాయ పల్లీ కారం ట్రై చేయండి!

నోటికి కమ్మగా ఉండే "వంకాయ పల్లీ కారం" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసుకోవచ్చు

Vankaya Palli Karam
Vankaya Palli Karam (ETV Abhiruchi)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 4, 2026 at 4:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

Vankaya Palli Karam Prepare : వంకాయ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరుతుంది. దీనితో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అయితే ఈసారి కాస్త డిఫరెంట్​గా వంకాయ పల్లీ కారం చేశారంటే ఇళ్లంతా ఘుమఘుమలాడాల్సిందే. మరి నోరూరించే ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఆంధ్రా, తమిళనాడు మిక్స్​డ్ రెసిపీ - నోరూరించే "చంద్రముఖి చికెన్"

Vankaya Palli Karam
వంకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • వంకాయలు - అర కిలో (500 గ్రాములు)
  • ఆవాలు - ఒక టీ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • కరివేపాకు - కొంచెం
  • పచ్చిమిర్చి - 6
  • ఎండుమిర్చి - 10
  • ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
  • ఆయిల్ - 5 టేబుల్ స్పూన్లు
  • పల్లీలు - తగినంత
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  • నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  • ఎండుకొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
  • పసుపు - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
Vankaya Palli Karam
ఎండుమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా అర కిలో వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి నాలుగు గాట్లు పెట్టుకోవాలి. అనంతరం వీటిని ఉప్పు కలిపిన నీళ్లలో వేయాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్​లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు, రెండు టేబుల్ స్పూన్ల ఎండుకొబ్బరి ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 10 ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి వేయించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
  • చల్లారిన ఎండుకొబ్బరిజీలకర్ర మిశ్రమాన్ని మిక్సీజార్​లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. ఆపై ఇందులో కొద్దిగా ఉప్పు కలిపి పక్కనుంచాలి.
Vankaya Palli Karam
ఆవాలు, జీలకర్ర, పసుపు (Getty Images)
  • అనంతరం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత పావు కప్పు పల్లీలు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేయాలి. అనంతరం వీటిని ఓ ప్లేట్​లో తీసుకోవాలి.
  • ఇదే నూనెలో వంకాయలను వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించాలి.
Vankaya Palli Karam
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఆరు పచ్చిమిర్చి, ఐదు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయాలి.
  • ఇవి వేగాక కప్పు ఉల్లిపాయ తరుగు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి వేగనివ్వాలి. ఆనియన్స్ వేగాక ముందుగా వేయించిన వంకాయలు, గ్రైండ్ చేసుకున్న పల్లీ కారం పొడి వేసి కలిపి బాగా మగ్గించాలి.
Vankaya Palli Karam
వెల్లుల్లి (Getty Images)
  • ఈ మిశ్రమం మగ్గాక చివరలో వేయించిన పల్లీలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే ఘుమఘుమలాడే వంకాయ పల్లీ కారం తయారైనట్లే!

కమ్మని "బీరకాయ పొట్టు పచ్చడి" - వారెవ్వా ఏం టేస్ట్ గురూ అనాల్సిందే!

కరకరలాడే "రవ్వ మురుకులు" - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!