ETV Bharat / offbeat

స్టఫింగ్ లేకుండానే "గుత్తి వంకాయ కర్రీ" - అన్నం, పులావ్, రోటీల్లోకి అద్దిరిపోద్ది!

గుత్తి వంకాయ కర్రీ ఈ పద్ధతిలో చేసి చూడండి - నోటికి సరికొత్త రుచిని అందిస్తుంది!

Gutti Vankaya Curry
Gutti Vankaya Curry (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 15, 2026 at 11:18 AM IST

3 Min Read
Choose ETV Bharat

Brinjal Curry Making in Telugu : వంకాయతో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. ఇందులో గుత్తి వంకాయ కర్రీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే దీన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. ఇందుకోసం ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేయాలి. కానీ స్టఫింగ్ అవసరమే లేకుండా ఈ కర్రీని ఈ పద్ధతిలో సింపుల్​గా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అంతేకాకుండా ఎలాంటి మసాలాలు వాడకుండానే ప్రిపేర్ చేయవచ్చు. ఈ పద్ధతిని పాటిస్తూ చేశారంటే ఎన్నడూ తినని రుచితో భలే అద్భుతంగా ఉంటుంది. ఇది చిక్కని గ్రేవీతో అన్నం, రోటీ, చపాతీ, పులావ్ ఇలా అన్నింటిలోకి సైడ్ డిష్​గా అద్దిరిపోతుంది.

నోరూరించే "గోంగూర చికెన్ నిల్వ పచ్చడి" - ముద్దకో ముక్క తినొచ్చు!

Gutti Vankaya Curry
వంకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • వంకాయలు - అర కిలో (500 గ్రాములు)
  • జీలకర్ర - అర టేబుల్ స్పూన్
  • మినపప్పు - 1 టేబుల్ స్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
  • ధనియాలు - అర టేబుల్ స్పూన్
  • చింతపండు - 20 గ్రాములు
  • ఎండుమిర్చి - 2
  • ఆయిల్ - 4 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
  • కరివేపాకు - కొద్దిగా
  • పసుపు - పావు టీ స్పూన్
  • టమోటాలు - 2
  • కారం - 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్
Gutti Vankaya Curry
చింతపండు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా అర కిలో వంకాయలను కడిగి నాలుగు వైపులా గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఉప్పు కలిపిన నీటిలో వేయాలి.
  • అలాగే కావాల్సిన పరిమామణంలో ఉల్లిపాయలు, రెండు టమోటాలను తరిగి ఉంచాలి.
  • అదేవిధంగా ఓ చిన్న గిన్నెలో 20 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. పది నిమిషాల తర్వాత చింతపండు రసం తీసి పక్కనుంచాలి.
Gutti Vankaya Curry
టమోటాలు (Getty Images)
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేయాలి. అలాగే అర టేబుల్ స్పూన్ ధనియాలు, రెండు ఎండుమిర్చి వేసి వేయించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీజార్​లో వేసి మిక్సీ పట్టాలి.
  • ఇదే పాన్​లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి వేగనివ్వాలి.
Gutti Vankaya Curry
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి.
  • రెండు నిమిషాల అనంతరం తరిగి ఉంచిన టమోటా ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ వేయించాలి.
  • ఈ మిశ్రమం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, గ్రైండ్ చేసిన జీలకర్రధనియాల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు రసం, అర గ్లాసు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేయాలి. అనంతరం మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ 20 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
Gutti Vankaya Curry
కరివేపాకు (Getty Images)
  • ఇరవై నిమిషాల తర్వాత వేయించిన ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే నోరూరించే గుత్తి వంకాయ కర్రీ సిద్ధంగా ఉంటుంది!

అసలైన "ఆలూ ఫ్రైడ్ రెస్" - నిమిషాల్లోనే సూపర్ లంచ్ బాక్స్ రెడీ!

ఘుమఘుమలాడే "మెంతికూర పచ్చడి" - కమ్మగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది!