ETV Bharat / offbeat

బ్రేక్​ఫాస్ట్​లోకి "మరమరాల చీలాలు" - పిల్లలైతే వద్దనకుండా తినేస్తారు!

- రెగ్యులర్ టిఫెన్స్ తిని బోర్ కొట్టిందా? - మరమరాలతో వెరైటీగా ఇలా ట్రై చేయండి!

Breakfast Recipe with Maramaralu
Breakfast Recipe with Maramaralu (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : October 23, 2025 at 4:36 PM IST

3 Min Read
Choose ETV Bharat

Breakfast Recipe with Maramaralu : పిల్లలు మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లోకి ఏరోజుకారోజు వెరైటీ టిఫెన్ ఉండాలని కోరుకుంటారు. లేదంటే ఇవాళా ఇడ్లీ, దోశయేనా బోర్ అంటూ తినడం మానేస్తారు. అందుకే, చిన్నారుల కోసం రెగ్యులర్ టిఫెన్స్ కాకుండా ఒక వెరైటీ బ్రేక్​ఫాస్ట్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, సూపర్ సాఫ్ట్​ అండ్ టేస్టీ "మరమరాల చీలా". మంచి రుచికరంగా, చూడడానికి ఆకర్షణీయంగా మందపాటి దోశల్లా ఉండే వీటిని పిల్లలైతే వద్దనకుండా ఎన్నైనా ఇష్టంగా తినేస్తారు. అలాగే, ఇవి తయారు చేసుకోవడానికి ఎక్కువ టైమ్​ కూడా పట్టదు. అప్పటికప్పుడు ఎవరైనా ఇన్​స్టంట్​గా రెడీ చేసుకోవచ్చు. మరి, మరమరాలతో ఈ నోరూరించే టిఫెన్​ను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Breakfast Recipe with Maramaralu
మరమరాలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • రెండు కప్పులు - మరమరాలు
  • అర కప్పు - బొంబాయిరవ్వ
  • అర కప్పు - పెరుగు
  • పావు కప్పు - సన్నని ఉల్లిపాయ ముక్కలు
  • ఒక చెంచా - సన్నని పచ్చిమిర్చి తరుగు
  • రెండు టేబుల్​స్పూన్లు - క్యాబేజీ తరుగు
  • రెండు టేబుల్​స్పూన్లు - బీన్స్ తరుగు
  • ఒక టేబుల్​స్పూన్ - క్యారెట్ తురుము
  • ఒక చెంచా - ఎండుమిర్చి గింజలు
  • రుచికి తగినంత - ఉప్పు
  • పావు చెంచా - వంటసోడా
  • అర కప్పు - నూనె
  • రెండు చెంచాలు - ఆవాలు

ఇడ్లీలు మిగిలితే కరకరలాడే "వడలు"! - తక్కువ నూనెతోనే అప్పటికప్పుడు రెడీ!

Breakfast Recipe with Maramaralu
రవ్వ (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా ఉల్లిపాయలను పావు కప్పు పరిమాణంలో సన్నగా తరుక్కుని పక్కనుంచాలి.
  • అలాగే, కావాల్సిన పరిమాణంలో సన్నని క్యారెట్ తురుము, సన్నని క్యాబేజీ తరుగు, బీన్స్ తరుగు, పచ్చిమిర్చి తరుగును ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి.
  • అనంతరం ఒక గిన్నెలో మరమరాలు తీసుకుని అవి మునిగేలా వాటర్ పోసి ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి.
Breakfast Recipe with Maramaralu
ఉల్లిపాయ తరుగు (Getty Images)
  • ఐదు నిమిషాల అనంతరం మంచిగా నానిన మరమరాలను మిక్సీ జార్​లోకి తీసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దోశపిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత గ్రైండ్ చేసుకున్న మరమరాల పిండిని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఆపై అందులో బొంబాయిరవ్వ, పెరుగు, ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, క్యాబేజీ, బీన్స్ తరుగు, సన్నని క్యారెట్ తురుము వేసి ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా కలపాలి.
  • ఇక చివరగా ఆ మిశ్రమంలో ఎండుమిర్చి గింజలు, వంటసోడా వేసి మరోసారి బాగా కలిపి గిన్నెపై మూత ఉంచి పదినిమిషాల పాటు పక్కనుంచాలి.

అటుకులతో "పునుగులు" - పైన క్రిస్పీ, లోపల సాఫ్ట్​ - టమాటా చట్నీతో కిర్రాక్​!

Breakfast Recipe with Maramaralu
క్యారెట్ తురుము (Getty Images)
  • పది నిమిషాల అనంతరం స్టవ్ మీద దోశ పెనం పెట్టి చెంచా నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • అది వేడయ్యాక కొన్ని ఆవాలు వేసి వేయించి వాటిపైన ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకట్రెండు గరిటెలు వేసుకుని మందపాటి అట్టులా స్ప్రెడ్ చేసుకోవాలి.
  • తర్వాత పైన కొద్దిగా నూనె వేసుకుని వన్ సైడ్ చక్కగా కాల్చుకోవాలి. వన్ సైడ్ మంచిగా కాలిన తర్వాత రెండో వైపునకు టర్న్ చేసి కాస్త ఆయిల్ వేసి అటు వైపు కూడా ఎర్రగా కాలనివ్వాలి.
Breakfast Recipe with Maramaralu
పెరుగు (Getty Images)
  • రెండు వైపులా మంచిగా కాల్చుకున్నాక సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని రెడీ చేసుకోవాలి.
  • తర్వాత వాటిని వేడివేడిగా కొబ్బరి చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. అంతే, సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే "మరమరాల చీలాలు" బ్రేక్​ఫాస్ట్​లోకి అప్పటికప్పుడు రెడీ అవుతాయి!
  • మరి, నచ్చితే మీరు రెగ్యులర్ టిఫెన్స్ కాకుండా ఓసారి వెరైటీగా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంట్లో వారందరూ ఇష్టంగా తింటారు.
Breakfast Recipe with Maramaralu
క్యాబేజీ తురుము (ETV Bharat)

చల్లని వేళ కరకరలాడే "పనీర్-కార్న్ వడలు" - తక్కువ టైమ్​లో అప్పటికప్పుడు రెడీ!