ETV Bharat / offbeat

సొరకాయ పొట్టుతో "పచ్చడి" - ఎన్నడూ తినని సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు!

సొరకాయ పొట్టుతో నిమిషాల్లో తయారయ్యే రెసీపీ - కూరలు పక్కన పెట్టి అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు!

Sorakaya Pottu Pachadi
Sorakaya Pottu Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 28, 2026 at 4:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sorakaya Pottu Pachadi : సొరకాయను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. ఇదే కాకుండా సొరకాయ పొట్టుతోనూ పచ్చడి చేసుకోవచ్చని మీకు తెలుసా? లేదంటే మాత్రం ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ పాటిస్తూ చేశారంటే సూపర్​గా వస్తుంది. కేవలం నిమిషాల్లోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ పచ్చడిని ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా?

ఉల్లి, వెల్లుల్లి లేకుండానే "దహీ కిచిడీ" - ఒక్కసారి తింటే టేస్ట్​కు ఫిదా!

Sorakaya Pottu Pachadi
సొరకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • సొరకాయ పొట్టు - 2 కప్పులు
  • ఆయిల్ - 6 టేబుల్ స్పూన్లు
  • ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
  • మినపప్పు - 3 టీ స్పూన్లు
  • జీలకర్ర - 3 టీ స్పూన్లు
  • పల్లీలు - 4 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 20
  • వెల్లుల్లి రెబ్బలు - 12
  • పసుపు - అర టీ స్పూన్
  • నువ్వుల పొడి - 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు - 30 గ్రాములు
  • ఎండుమిర్చి - 4
  • ఆవాలు - 1 టీ స్పూన్
  • శనగపప్పు - 2 టీ స్పూన్లు
  • కరివేపాకు - కొద్దిగా
  • టమోటాలు - 4
Sorakaya Pottu Pachadi
పచ్చిమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం కావాల్సిన పరిమాణంలో సొరకాయ పొట్టును తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొట్టును శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పిండి ఓ పొడి క్లాత్​ మీద వేసి ఆరబెట్టాలి. అలాగే నాలుగు టమోటాలను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
  • అదేవిధంగా గిన్నెలో 30 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి.
Sorakaya Pottu Pachadi
వెల్లుల్లి (Getty Images)
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​లో నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి.
  • ఇదే పాన్​లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల మినపప్పు, రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇదే నూనెలో 20 పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. అనంతరం పచ్చిమిర్చిని ప్లేట్​లో వేయాలి.
Sorakaya Pottu Pachadi
ఆవాలు, జీలకర్ర (Getty Images)
  • ఇదే పాన్​లో రెండు కప్పుల సొరకాయ పొట్టు వేసి మగ్గించాలి. ఇది మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, 12 వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి ఉడికించాలి. ఈ మిశ్రమం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
  • ఆ తర్వాత మిక్సీజార్​లో ఫ్రై చేసుకున్న సొరకాయ పొట్టు టమోటా మిశ్రమం వేయాలి. అలాగే వేయించిన పల్లీలు ధనియాలజీలకర్ర మిశ్రమం, పచ్చిమిర్చి యాడ్ చేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి, నానబెట్టిన చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
Sorakaya Pottu Pachadi
ఎండుమిర్చి (Getty Images)
  • మరోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్​లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత నాలుగు ఎండుమిర్చి, రెండు టీ స్పూన్ల శనగపప్పు, రెండు టీ స్పూన్ల మినపప్పు వేయాలి. అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు, రెండు టీ స్పూన్ల జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి.
  • తాలింపు చక్కగా వేగాక గ్రైండ్ చేసుకున్న సొరకాయ మిశ్రమం యాడ్ చేసి ఒక నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే కమ్మని సొరకాయ పొట్టు పచ్చడి తయారైనట్లే!
  • ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసి తిన్నారంటే ఇంకో రెండు ముద్దలూ ఎక్కువగానే తింటారు.

"క్యాబేజీ, కోడిగుడ్డు ఫ్రై" - అప్పటికప్పుడు చేసుకునే అద్భుతమైన రెసిపీ!

'జీడిపప్పు, కాకరకాయ కారం ఫ్రై' - ఇలా చేశారంటే పిల్లలూ ఇష్టంగా తింటారు!