ETV Bharat / offbeat

రెస్టారెంట్ స్టైల్ "బెండకాయ మసాలా కర్రీ" - ఇంటిల్లిపాదీకి తెగ నచ్చేస్తుంది!

బెండకాయతో సింపుల్​గా చేసుకునే రెసిపీ - ఇలా ప్రిపేర్ చేస్తే నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

Bendakaya Masala Curry
Bendakaya Masala Curry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 7, 2026 at 12:24 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bendakaya Masala Curry : బెండకాయతో వివిధ రకాల వంటలు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇవాళ మీకోసం ఓ అద్భుతమైన రెసిపీని పరిచయం చేస్తున్నాం. అదే రెస్టారెంట్ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ. ఈ పద్ధతిని పాటిస్తూ జీడిపప్పు పేస్ట్​ వేసి ఈ కూర చేస్తే మంచి రుచికరంగా వస్తుంది. అంతేకాక మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. ఇది నోటికి పుల్లపుల్లగా, కారంకారంగా ఉంటూ అన్నం, చపాతీ, రోటీ, పులావ్ ఇలా అన్నింటిలోకి భలే కమ్మగా ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

ఎన్నడూ తినని రుచితో "గోంగూర వంకాయ క్రరీ" - వేడివేడి అన్నంలోకి అమృతమే!

Bendakaya Masala Curry
బెండకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బెండకాయలు - 350 గ్రాములు
  • జీడిపప్పు - పావు కప్పు
  • ఆయిల్ - 7 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • ఇంగువ - 2 చిటికెడ్లు
  • ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి - 2
  • టమోటాలు - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్
  • చాట్​మసాలా - 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
  • పసుపు - కొద్దిగా
  • కారం - 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర - కొంచెం
Bendakaya Masala Curry
పచ్చిమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా 350 గ్రాముల బెండకాయలను కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కావాల్సిన పరిమాణంలో ఉల్లిపాయలు, రెండు టమోటాలు, రెండు పచ్చిమిర్చిని తరిగి ఉంచాలి.
  • అలాగే మిక్సీజార్​లో పావు కప్పు జీడిపప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచాలి.
Bendakaya Masala Curry
జీడిపప్పు (Getty Images)
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఆరు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత వీటిని తీసి ప్లేట్​లో వేయాలి.
  • ఇదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. అనంతరం రెండు చిటికెడ్ల ఇంగువ, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
  • ఇందులోనే తరిగి ఉంచిన పచ్చిమిర్చి తరుగు, ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి కలపాలి. అనంతరం మూతపెట్టి మగ్గించాలి.
Bendakaya Masala Curry
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • టమోటా ముక్కలు మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ చాట్​మసాలా వేయాలి. అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు యాడ్ చేసి ఆయిల్ పైకి తేలెంత వరకు వేయించాలి.
  • ఆయిల్ పైకి తేలిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్, రెండు కప్పుల వేడి నీళ్లు పోసి కలపాలి. అనంతరం మూతపెట్టి మంటను హై ఫ్లేమ్​లో ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి.
Bendakaya Masala Curry
కొత్తిమీర (Getty Images)
  • ఈ మిశ్రమం ఉడికిన తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి మధ్యమధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివరన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే రెస్టారెంట్ స్టైల్ నోరూరించే బెండకాయ మసాలా కర్రీ మీ ముందుంటుంది!
  • ఇది నోటికి పుల్లపుల్లగా, కారంకారంగా ఉంటూ తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది!

కమ్మని "బీరకాయ అలసందల కూర" - ఇలా చేశారంటే టేస్టీగా ఉంటుంది!

పిల్లలు స్నాక్స్ అడిగితే ఇవి చేసి పెట్టండి - ఇన్​స్టెంట్ హోటల్ స్టైల్ గ్రీన్ చట్నీతో ఇష్టంగా తింటారు!