ETV Bharat / offbeat

'మొబైల్' వర్షంలో తడిసిందా? - నిపుణులు సూచిస్తున్న సింపుల్ టిప్స్ మీ కోసం!

వర్షాకాలం ఈ జాగ్రత్తలతో మీ మొబైల్ సేఫ్! - లేదంటే ఇబ్బందులు తప్పవు!

Monsoon Mobile Safety Tips
Monsoon Mobile Safety Tips (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 20, 2026 at 4:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

Monsoon Mobile Safety Precautions : వర్షాకాలం ఆఫీసుకు లేదా బయటకు వెళ్లినప్పుడు వాతావరణం బాగానే ఉన్నా, ఒక్కోసారి అకస్మాత్తుగా వర్షం వస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో మనం తడవడంతో పాటు, జేబులో ఉన్న మొబైల్ కూడా తడిసే ఛాన్స్ ఉంటుంది. అయితే, వర్షంలో మీ స్మార్ట్​ఫోన్ తడిసినప్పుడు వెంటనే ఛార్జింగ్ పెట్టొద్దు. దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదొక్కటే కాదు మొబైల్​ తడిసిన సమయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఇవి పాటించడం ద్వారా మొబైల్​కు జరిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చంటున్నారు. ఇంతకీ, మొబైల్ తడిసినప్పుడు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వెంటనే ఛార్జింగ్ పెట్టొద్దు :

ఫోన్ తడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టొద్దంటున్నారు నిపుణులు. తడి ఆరక ముందే ఛార్జింగ్ పెడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఛార్జింగ్ పోర్ట్ పూర్తిగా ఆరిపోయిన తర్వాతే ఛార్జ్ పెట్టాలి. లేటెస్ట్ ఫోన్లలో ఛార్జింగ్ పోర్ట్​లో వాటర్ ఉంటే ఆటోమేటిక్​గా గుర్తించి, ఛార్జింగ్ కానివ్వదంటున్నారు.

నీళ్లలో పడి స్విచ్ ఆఫ్ అయిందా?

వర్షం వల్ల గానీ, అనుకోకుండా ఫోన్ నీటిలో పడి స్విచ్ ఆఫ్ అయితే ఆన్​ చేయడానికి ట్రై చేయొద్దంటున్నారు నిపుణులు. ఇది కూడా షార్ట్ సర్క్యూట్​కు కారణం కావచ్చంటున్నారు. అంతేకాదు, ఆన్​ చేస్తే మదర్​బోర్డ్ కూడా దెబ్బ తినొచ్చు. ఇలాంటప్పుడు టెక్నీషియన్ వద్దకు వెళ్లడమే బెటర్ ఆప్షన్ అంటున్నారు.

హెయిర్ డ్రైయర్ వాడొద్దు :

ఫోన్ బాగా తడిసి ఆన్​లోనే ఉంటే ఫోన్​ను ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్ వాడటం, ఓవెన్​లో, ఎండలో పెట్టడం వంటివి చేయవద్దంటున్నారు. వీటి నుంచి వచ్చే వేడికి ఫోన్​లోని సెన్సిటివ్ పార్ట్స్ దెబ్బతింటాయి. ఫోన్ తడిసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి డ్రై క్లాత్​తో క్లీన్ చేసి ఫ్యాన్ కింద పెట్టాలి. అవసరమైతే రోజంతా అలానే ఉంచాలి.

వానాకాలంలో మీ లగ్జరీ 'ఫర్నిచర్' జాగ్రత్త! - ఈ టిప్స్​తో మంచి లుక్​ అండ్ 'సేఫ్'!

సిలికా జెల్​తో పొడిగా ఫోన్​ :

సిలికా జెల్ ప్యాకెట్లు తేమ, నీటిని వేగంగా పీల్చుకుంటాయి. జర్నీ టైమ్​లో ఫోన్ పెట్టే బ్యాగ్ జేబులో ఈ ప్యాకెట్లను ఉంచితే సరిపోతుందంటున్నారు నిపుణులు. ఇవి ఫోన్​ను పొడిగా ఉంచుతాయి. కొత్త బ్యాగులు, షూస్ కొన్నప్పుడు వాటిలో వచ్చే సిలికా జెల్ ప్యాకెట్లను పారేయకుండా ఇలా యూజ్ చేస్తే బెటర్ అంటున్నారు.

రేటింగ్ ఉన్నా జాగ్రత్త :

మీ స్మార్ట్​ఫోన్​కు IP67, IP68, IP69 రేటింగ్ ఉన్నప్పటికీ, వర్షంలో ఫోన్​ వాడకపోతేనే మంచిది. మొబైల్ యూజ్ చేసే కొద్దీ దాని వాటర్ రెసిస్టెన్స్ కెపాసిటీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి, వాటర్​ప్రూఫ్ ఫోన్​ పౌచ్​లనే వాడటం మంచిదంటున్నారు.

డేటా బ్యాకప్ పెట్టుకోండి :

స్మార్ట్​ఫోన్​లోని ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను గూగుల్ డ్రైవ్ లేదా క్లౌడ్ ప్లాట్​ఫారమ్​లలో బ్యాకప్ చేసి పెట్టుకోవాలి. సడన్​గా ఫోన్ పాడైనా, మీ డేటా మొత్తం సేఫ్​గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

జిప్‌లాక్ బ్యాగ్ లేదా వాటర్‌ప్రూఫ్ కవర్ :

వర్షాకాలం మొబైల్ తడవకుండా ఉండడం కోసం నాణ్యత కలిగిన వాటర్​ప్రూఫ్ మొబైల్ కవర్ లేదా జిప్​లాక్ బ్యాగ్​ను కొనుగోలు చేయండి. బయటకు వెళ్లేటప్పుడు దానిని మీతోనే తీసుకెళ్లండి. దానిని బ్యాగ్​లోనే లేదా బైక్​లోనే పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు వర్షంలో బయటకు వెళ్లినప్పుడు లేదా సడన్​గా వర్షం వచ్చినా మీ మొబైల్​ను అందులో ఉంచితే ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు. ఇలా వర్షాకాలం మొబైల్ ​విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫోన్​ను సురక్షితంగా కాపాడుకోవచ్చంటున్నారు.

చిన్నపాటి నిర్లక్ష్యం, జీవితకాల విషాదం! - ప్రయాణాల్లో ఈ 'తప్పులు' అస్సలు చేయకండి!

ఈ 'వాటర్ బాటిల్' ధర రూ.10 వేల పైనే! - ప్రత్యేకతలు తెలిస్తే వారెవ్వా అనాల్సిందే!