మీ ఇంట్లో "బల్లులు" ఎక్కువగా తిరుగుతున్నాయా? - ఇలా చేస్తే ఒక్కటీ ఉండదట!
బల్లుల సమస్యను తగ్గించే సూపర్ టిప్స్! - ఇంట్లోని పదార్థాలతోనే ఈజీగా తరిమికొట్టవచ్చంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 7, 2026 at 4:29 PM IST
Tips to Remove Lizards from Home : వానాకాలం వచ్చేసింది. దాంతో ఏవేవో పురుగులు, కీటకాలు, ఈగలు వంటివి ఇంట్లోకి వచ్చేస్తుంటాయి. వాటికోసం బల్లులూ పోరాటం మొదలుపెడతాయి. కిటికీలు, తలుపుల దగ్గర ఎక్కడ చూసినా అవే కనిపిస్తుంటాయి! అలా ఇంట్లో విపరీతంగా పెరిగిన బల్లులను చూస్తే చిరాకు వచ్చేస్తుంది. వంటగదిలోనూ వీటి సంచారం ఎక్కువే. దాంతో వంట చేసేటప్పుడు అవి ఎక్కడ పడిపోతాయోనని, ఆహార పదార్థాల గిన్నెల్లో పడిపోతాయేమోనని చాలా మంది గృహిణులు కంగారు పడిపోతుంటారు. మీ ఇంట్లోనూ ఇలాగే "బల్లుల సమస్య" ఎక్కువగా ఉందా? అయితే, కెమికల్స్, మందులతో పని లేదు. వంటింట్లో ఉండే ఈ పదార్థాలతోనే అవి ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడొచ్చంటున్నారు నిపుణులు. మరి, బల్లుల బెడదను తగ్గించే ఆ నేచురల్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉల్లి, వెల్లుల్లి :
బల్లులను ఇంటి నుంచి తరిమికొట్టడానికి ఈ చిట్కా చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఉల్లి, వెల్లుల్లి నుంచి వచ్చే ఘాటు వాసనలు బల్లుల్ని ఇబ్బంది పెడతాయి. అయితే, అన్నిచోట్లా వాటిని తగిలించడం, ముక్కలుగా తరిగి పెట్టడం కష్టంగా ఉంటుంది. అందుకే, రెండింటినీ మిక్సీ పట్టి, ఆ మిశ్రమాన్ని నీటిలో కలిపి కాసేపు పక్కనుంచాలి. కొద్దిసేపటి తర్వాత ఉల్లి-వెల్లుల్లి మిశ్రమాన్ని వడకట్టి ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. బల్లులు కనిపించే చోట దాన్ని స్ప్రే చేస్తే చాలు. అవి అక్కడి నుంచి పారిపోతాయంటున్నారు.
మిరియాల పొడి :
మిరియాల నుంచి ఘాటు స్మెల్ కూడా బల్లులకు నచ్చదు. అందుకే ఒక గిన్నెలో కొన్ని వేడినీళ్లు తీసుకుని అందులో కాస్త మిరియాలపొడి, కారం, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కలిపి కాసేపు పక్కనుంచాలి. కాసేపటి తర్వాత ఆ నీటి మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లోకి నింపాలి. బల్లుల కనిపిస్తే ఒకసారి ఆ బాటిల్ని షేక్ చేసి, స్ప్రే చేయండి. అంతే, ఆ ఘాటుని భరించకలేక అవి ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్లిపోతాయంటున్నారు.
పాము కాటు వేస్తే ఎలా అనిపిస్తుంది? - లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలివే!
లెమన్ గ్రాస్ లేదా పెప్పర్ మింట్ ఆయిల్ :
వర్షాకాలం ఇల్లంతా ఒకరకరమైన ముక్కవాసనతో నిండిపోతుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఆ వాసనను పోగొట్టడానికి మంచి సువాసననిచ్చే స్ప్రేలు స్ప్రే చేస్తుంటారు. అయితే, అలా చేసే వాటిలో రెగ్యులర్వి కాకుండా ఒక కప్పు నీటిలో 10 నుంచి 15 చుక్కలు లెమన్ గ్రాస్ లేదా పెప్పర్మింట్ ఎసెన్షియిల్ ఆయిల్ కలపండి. ఆపై దాన్ని ఇల్లంతా స్ప్రే చేయండి. ఇలా చేయడం ద్వారా ఇల్లు మొత్తం సువాసనలతో నిండటమే కాకుండా బల్లులనీ దూరంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు. లేదంటే దూది మీద కాస్త ఎసెన్షియల్ ఆయిల్ చల్లి, ఇంట్లో అక్కడక్కడా ఉంచినా బల్లుల సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
కర్పూరం :
ఇది కూడా ఇంట్లో బల్లుల బెడద తగ్గించడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని కర్పూరం బిల్లలను తీసుకుని పొడిలా చేసి బల్లులు తిరిగే ప్లేస్లో చల్లండి. అలాగే, కొన్ని రోజులు కర్పూరం బిల్లలను అక్కడ పెట్టడం వల్ల కూడా అవి పారిపోతాయంటున్నారు.
ఐస్వాటర్ :
బల్లులన సమస్య తగ్గించడానికి రసాయనిక స్ప్రేలతో అనారోగ్య భయం. కొందరికి వాటిని చంపడం కూడా ఇష్టం ఉండదు. అలాంటివాళ్లు వాటిని పట్టి, బయట పడేయాలనుకుంటారు. కానీ, అవి ఓ పట్టాన చిక్కవు. అలాంటి టైమ్లో బాగా చల్లని నీళ్లు మంచి ఆయుధంలా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. బల్లి కనిపించినప్పుడు వాటి మీద కొద్దిగా ఐస్ వాటర్‌ని చల్లండి. అప్పుడు అవి కాసేపు కదల్లేని స్థితికి వస్తాయి. అప్పుడు నెట్ లేదా చీపురు సాయంతో తొలగించి, బయటపడేస్తే చాలు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటున్నారు నిపుణులు.
మీ ఇంట్లో ఎలుకలు దూరి ఇబ్బంది పెడుతున్నాయా? - ఈ టిప్స్ పాటిస్తే నిమిషాల్లో పరార్!
"ఒత్తిడిని" తగ్గించే మొక్కలూ ఉన్నాయి! - ఇంట్లో సులువుగా పెరుగుతాయి!

