ETV Bharat / offbeat

ఘుమఘుమలాడే బెంగళూరు "దొన్నె బిర్యానీ" - ఇంట్లోనే ఇలా ట్రై చేయండి!

మిరియాలు, పచ్చిమిర్చి ఘాటు - రుచికరమైనకర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ!

donne_biryani_recipe
donne_biryani_recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 16, 2026 at 4:33 PM IST

4 Min Read
Choose ETV Bharat

Bangalore Donne Biryani Recipe : హైదరాబాద్ బిర్యానీ, ఆంధ్రా పులావ్, బెంగళూరు దొన్నె బిర్యానీ! దేనికదే సాటి. తయారీ తీరు మాత్రమే కాదు! టేస్ట్ కూడా విభిన్నమే. ఆంధ్రా స్టైల్ పులావ్, హైదరాబాద్ బిర్యానీ ఎప్పుడూ తినే ఉంటారు. కానీ, ఓ సారి బెంగళూరు దొన్నె బిర్యాని కూడా ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చి పదార్థాలు, పద్ధతి ఫాలో అయితే చాలు!

టేస్టీ "రంభా చికెన్" రెసిపీ మీకోసం - అద్దిరిపోయే ఈ కర్రీ దాబాల్లో మాత్రమే దొరుకుతుంది!

donne_biryani_recipe
donne_biryani_recipe (Getty images)

కావల్సిన పదార్థాలు :

చికెన్ మ్యారినేషన్ కోసం

  • చికెన్ - కేజీ
  • ఉప్పు - అర స్పూన్
  • పసుపు - పావు స్పూన్
  • నిమ్మరసం - అర చెక్క
  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
  • చిట్టి ముత్యాలు రైస్ - అరకేజీ
  • లేదా సోనా మసూరి
donne_biryani_recipe
donne_biryani_recipe (Getty images)

మసాలా కోసం :

  • దాల్చిన చెక్క - 2 ఇంచులు
  • లవంగాలు - 6
  • యాలకులు - 5
  • కసూరి మేతి - 2 స్పూన్లు
  • మిరియాలు - 1 స్పూన్
  • సోంపు - 1 స్పూన్
  • ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర - 1 స్పూన్
  • అనాస - 1
  • మరాఠీ మొగ్గ - 1
  • జాపత్రి - కొద్దిగా
  • రాతిపువ్వు - కొద్దిగా
  • బిర్యానీ ఆకు - 2
donne_biryani_recipe
donne_biryani_recipe (Getty images)

గ్రీన్ పేస్ట్ కోసం :

  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 10 నుంచి 12
  • ఉల్లిపాయలు - 3
  • మెంతి కూర - 1 కట్ట
  • పుదీనా - 1 కట్ట
  • కొత్తిమీర - 1 కట్ట
donne_biryani_recipe
donne_biryani_recipe (Getty images)

బిర్యానీ కోసం :

  • నూనె - 5 టేబుల్ స్పూన్లు
  • బిర్యానీ ఆకు - 2
  • షాజీరా - 1 స్పూన్
  • మిరియాలు - అర స్పూన్
  • యాలకులు - 3
  • రాతిపువ్వు - కొద్దిగా
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • ఉల్లిపాయలు - 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
donne_biryani_recipe
donne_biryani_recipe (Getty images)

షేర్వా కోసం :

  • గసగసాలు - 2 స్పూన్లు
  • ఎండు కొబ్బరి తురుము - పావు చెక్క
  • నూనె - 3 టేబ్లు స్పూన్లు
  • జీలకర్ర - అర స్పూన్
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్లు
  • పెరుగు - 1 టేబుల్ స్పూన్
  • పసుపు - అర స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బిర్యానీ మసాలా - 1 స్పూన్
donne_biryani_recipe
donne_biryani_recipe (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా కిలో చికెన్ మీడియం సైజ్ ముక్కలు కొట్టించి శుభ్రం చేసుకుని తీసుకోవాలి. అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం, నూనె, పెరుగు వేసుకుని బాగా మర్దనా చేస్తూ ముక్కలకు పట్టించి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇపుడు కేజీ చికెన్​లోకి అరకేజీ రైస్ లేదా చిట్టి ముత్యాలు, సోనా మసూరి రైస్ వాడుకోవచ్చు. బియ్యం శుభ్రం చేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
donne_biryani_recipe
donne_biryani_recipe (Getty images)
  • ఇపుడు మసాలా కోసం మిక్సీలోకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కసూరి మేతి, మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర, అనాస, మరాఠీ మొగ్గ, జాపత్రి, రాతిపువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలో నూనె వేసుకుని 10 నుంచి 12 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. మిర్చి వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేయాలి. గుప్పెడు మెంతి ఆకు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి.
donne_biryani_recipe
donne_biryani_recipe (Getty images)
  • ఇపుడు అదే బాండీలో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, మిరియాలు, యాలకులు, రాతిపువ్వు, దాల్చిన చెక్క వేసుకుని ఆ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల తరుగు వేసుకుని కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఉడికించాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలపాలి. చికెన్​లో నీళ్లు ఇగిరిపోయి వేగే వరకు ఉడికించి ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రీన్ గ్రేవీ వేసుకోవాలి.
donne_biryani_recipe
donne_biryani_recipe (Getty images)
  • ఆ తర్వాత మీడియం టు హై ఫ్లేమ్​లో చికెన్ ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా కొద్దిగా పక్కన పెట్టుకుని మిగతాదంతా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలిపి ఉడికించుకోవాలి. నూనె తేలే వరకు ఉడికించిన తర్వాత ఎసరుకు (2 గ్లాసుల బియ్యంలోకి 3 గ్లాసులు) సరిపడా నీళ్లు పోసుకుని కలిపి మూతపెట్టి మరిగించుకోవాలి. ఎసరు మరుగుతున్న టైంలో నానబెట్టుకున్న బియ్యం వేసుకుని కలపాలి. రైస్ ఉడికిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకొని మూతపెట్టి దమ్ ఇవ్వాలి.
donne_biryani_recipe
donne_biryani_recipe (Getty images)
  • ఇపుడు బిర్యానీ షేర్వా కోసం మిక్సీలోకి 2 స్పూన్ల గసగసాలు, పావు చెక్క ఎండు కొబ్బరి తురుము వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకుని చిటపటలాడించాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి తరుగు వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత పెరుగు వేసుకుని కలపాలి.
  • ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న గసగసాల పేస్ట్ వేసుకుని కలిపి ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు, ముందుగా పక్కన పెట్టుకున్న బిర్యానీ మసాలా వేసి కలపాలి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. అంతే ఘుమఘుమలాడే షేర్వా రెడీగా ఉంటుంది.

ఘుమఘుమలాడే చేపల కర్రీ - ముక్క గట్టిగా, పులుసు చిక్కగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి!

"ట్యూనా చేపల పులుసు" కాస్త భిన్నమే! - కొత్తవాళ్లైనా ఇలా ట్రై చేస్తే నోరూరిస్తుంది!