ETV Bharat / offbeat

మంగుళూర్ స్పెషల్ "బెల్లం మెంతి దోసెలు" - తియ్యతియ్యగా స్వీట్ లవర్స్​ ఫుల్ ఖుష్!

పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ దోసె రెసిపీ - ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు!

Bella Metthe Dosa
Bella Metthe Dosa (ETV Abhiruchi)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 4, 2026 at 2:35 PM IST

|

Updated : January 4, 2026 at 3:18 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bella Metthe Dosa Recipe : కమ్మగా, క్రిస్పీగా ఉండే దోసెలంటే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినేస్తారు. నార్మల్​గా ఇళ్లల్లో ఎక్కువగా మినప్పిండితో ఆనియన్, మసాలా, ఎగ్ దోసె వంటివి చేస్తుంటారు. రెగ్యులర్​గా ఒకే రకమైనవి తినాలంటే బోరింగ్ ఫీల్ వచ్చేస్తుంది. అందుకే ఈసారి కర్ణాటక స్పెషల్ బెల్లం మెంతి దోసెలు చేశారంటే అద్దిరిపోతుంది. ముఖ్యంగా ఇవి మంగళూరు ప్రాంతంలో చాలా ఫేమస్. ఈ స్టెప్స్ పాటిస్తూ చేస్తే తియ్యతియ్యగా, భలే కమ్మగా వస్తాయి. అంతేకాక పైన ప్రత్యేకమైన కారం పొడిని చల్లి తింటుంటే సూపర్ అనాల్సిందే.

దాబా స్టైల్ "పాలక్, చనా మసాలా కర్రీ" - చపాతీ, బగారారైస్ లోకి మంచి కాంబినేషన్!

Bella Metthe Dosa
బియ్యం (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - అర కిలో (500 గ్రాములు)
  • మినపప్పు - 30 గ్రాములు
  • అటుకులు - 30 గ్రాములు
  • ఉప్పుడు బియ్యం - 30 గ్రాములు
  • మెంతులు - 15 గ్రాములు
  • సోంపు - 15 గ్రాములు
  • బెల్లం తురుము - 50 గ్రాములు
  • పసుపు - కొద్దిగా
  • బటర్ - తగినంత
  • పల్లీలు - 2 టేబుల్ ​స్పూన్లు
  • మినపప్పు - 2 స్పూన్లు
  • ఎండుమిర్చి - 15
  • నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
Bella Metthe Dosa
మినపప్పు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా మిక్సింగ్ బౌల్లో అర కిలో బియ్యం, 30 గ్రాముల మెంతులు, 15 గ్రాముల సోంపు, 30 గ్రాముల ఉప్పుడు బియ్యం, 30 గ్రాముల మినపప్పు వేసి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి. అలాగే మరో కప్పులో 30 గ్రాముల అటుకులు, సరిపడా వాటర్ పోసి నానబెట్టుకోవాలి.
  • మూడు గంటల తర్వాత బియ్యం మిశ్రమాన్ని మరోసారి కడిగి వాటర్ వడకట్టి మిక్సీజార్​లో వేయాలి. ఇందులోనే నానబెట్టిన అటుకులు, 50 గ్రాముల బెల్లం తురుము, కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు కొద్దికొద్దిగా పోస్తూ దోసెకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేయాలి.
  • అనంతరం దోసె పిండిని ఒక గిన్నెలో వేసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి కనీసం ఆరు గంటలు లేదా రాత్రంతా పులియబెట్టాలి.
Bella Metthe Dosa
పల్లీలు (Getty Images)
  • మరుసటి రోజు ఉదయం కారం పొడి కోసం స్టవ్ ఆన్ చేసి పాన్​లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగాక 30 గ్రాముల మినపప్పు, 15 ఎండుమిర్చి, మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసి ఫ్రై చేయాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కాస్త చల్లారాక మిక్సీజార్​లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మరోవైపు పిండిని కొద్దిగా గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు పోసి కలపాలి.
Bella Metthe Dosa
ఎండుమిర్చి (Getty Images)
  • మరోవైపు స్టవ్ ఆన్ చేసి దోసె పాన్​ పెట్టాలి. పాన్ వేడయ్యాక ముందుగా రెడీ చేసుకున్న పిండిని గరిటెతో తీసుకొని పాన్​పై దోసె మాదిరిగా స్ప్రెడ్ చేయాలి. అయితే వీటిని మరీ పల్చగా కాకుండా అట్టు మాదిరిగా కాస్త మందంగానే వేయాలి.
  • ఇప్పుడు దోసెపై కొద్దిగా బటర్ వేసి అది పూర్తిగా కరిగి వన్ సైడ్ చక్కగా కాలే వరకు ఉంచాలి. ఆ తర్వాత మరోవైపు టర్న్ చేసి కొద్దిసేపు కాల్చి ప్లేట్​లోకి తీసుకోవాలి.
Bella Metthe Dosa
బెల్లం (Getty Images)
  • అనంతరం దోసెపై ముందుగా తయారు చేసుకున్న స్పెషల్ కారం పొడి చల్లి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.
  • అంతే తియ్య తియ్యగా నోరూరించే బెల్లం మెంతి దోసెలు రెడీ అయినట్లే!

పచ్చిమిర్చి పేస్ట్​తో "ఆంధ్రా చిల్లీ చికెన్ కర్రీ" - నోటికి సరికొత్త రుచిని ఇస్తుంది!

"చేపల కర్రీ" బాగా కుదరాలంటే ఈ టిప్స్ పాటించండి - మరుసటి రోజు ఘుమఘుమలాడుతుంది!

Last Updated : January 4, 2026 at 3:18 PM IST