"అటుకుల చక్కెర పొంగలి" - ఈ కొలతల్లో ట్రై చేశారంటే కమ్మగా ఉంటుంది!
ఇంట్లోనే సింపుల్‌గా తయారయ్యే స్వీట్ రెసిపీ - బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 1, 2026 at 9:22 AM IST
Atukula Chakkara Pongali : వ్రతాలు, పండుగలు, పూజల సమయాల్లో ఎక్కువ మంది చక్కెర పొంగలి ప్రిపేర్ చేస్తుంటారు. దీనిని వివిధ రకాలుగా తయారు చేస్తారు. మరి మీరెప్పుడైనా అటుకల చక్కెర పొంగలి తిన్నారా? లేదంటే మాత్రం ఓసారి ఈ విధంగా చేస్తే చాలా అద్దిరిపోతుంది. మొదటిసారు చేసేవారైనా ఈ స్టెప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
సమ్మర్లో ఇలాంటి కర్రీ బాగుంటుంది - 10 నిమిషాల్లో రెడీ అవుతుంది!

కావాల్సిన పదార్థాలు :
- మందపాటి అటుకులు - 2 కప్పులు (500 గ్రాములు)
- పెసరపప్పు - అర కప్పు
- పచ్చికొబ్బరి ముక్కలు - అర కప్పు
- బెల్లం తురుము - 2 కప్పులు
- యాలకుల పొడి - 2 టీ స్పూన్లు
- జీడిపప్పు పలుకులు - 20
- కిస్మిస్ - 20
- బెల్లం తురుము - 2 కప్పులు
- పచ్చకర్పూరం - రెండు చిటికెడ్లు
- నెయ్యి - సరిపడా

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో అర కప్పు పెసరపప్పు వేయాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి పెసరపప్పును దోరగా వేయించి ఓ ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
- అదేవిధంగా ఓ గిన్నెలో రెండు కప్పుల మందపాటి అటుకులు వేసి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. అనంతరం అటుకులను గట్టిగా పిండి ప్లేట్లో వేయాలి.

- అనంతరం స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో వేయించిన పెసరపప్పు, సరిపడా నీళ్లు పోసి మూతపెట్టాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- మరోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో తగినంత నెయ్యి పోయాలి. నెయ్యి కరిగిన తర్వాత అర కప్పు పచ్చికొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. పచ్చికొబ్బరి ముక్కలు వేగిన తర్వాత 20 జీడిపప్పు పలుకులు యాడ్ చేసి వేగనివ్వాలి. అనంతరం 20 కిస్మిస్ వేసి ఫ్రై చేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.

- ఇదే పాన్‌లో రెండు కప్పుల బెల్లం తురుము, మూడు కప్పుల నీళ్లు పోయాలి. బెల్లం కరిగి మరుగుతున్నప్పుడు అటుకులు వేసి కలిపి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
- ఐదు నిమిషాల అనంతరం ఉడికించిన పెసరపప్పు యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత రెండు టీ స్పూన్ల యాలకుల పొడి, రెండు చిటికెడ్ల పచ్చకర్పూరం వేసి మరో నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

- నాలుగు నిమిషాల తర్వాత వేయించిన పచ్చికొబ్బరిజీడిపప్పు మిశ్రమం, కొద్దిగా నెయ్యి వేసి మిక్స్ చేయాలి. అనంతరం మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- అంతే ఎంతో రుచికరంగా ఉండే అటుకుల చక్కెర పొంగలి మీ ముందుంటుంది!
- మీరు ఈ పొంగలిని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే అటుకులు,పెసరపప్పుతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
హైదరాబాద్ స్పెషల్ "ఖజూర్ స్వీట్" - పైకి క్రంచీగా లోపల సాఫ్ట్‌గా - నెల రోజుల పాటు నిల్వ!
నోరూరించే "పాకం కజ్జికాయలు" - నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి!

