"అరుణాచలం" వెళ్లాలనుకుంటున్నారా? - తక్కువ ధరకే IRCTC టూర్ ప్యాకేజీ!
హైదరాబాద్ టూ అరుణాచలం IRCTC టూర్ ప్యాకేజీ - ధర తక్కువ, వీక్షించే పర్యాటక ప్రాంతాలు ఎక్కువ!

Published : February 16, 2026 at 2:19 PM IST
Hyderabad to Arunachalam Tour Package : భారతదేశంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో "అరుణాచలం" ఒకటి. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్నే "తిరువణ్ణామలై" అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న కొండని సాక్షాత్తూ శివలింగంగా భావిస్తారు భక్తులు. అంతేకాకుండా, ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం కలుగుతుందనీ విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం ఎంతో మంది భక్తులు అరుణాచలేశ్వరుడి దర్శనానికి వెళ్తుంటారు. అయితే, కొంతమంది మాత్రం ఆర్థిక కారణాల వల్ల వెళ్లలేకపోతుంటారు. అలాంటి వారికి ఐఆర్సీటీసీ ఒక అద్దిరిపోయే ప్యాకేజీని ప్రకటించింది. తక్కువ ధరకే అరుణాచలేశ్వరుడి దర్శనంతోపాటు మరికొన్ని పర్యాటక ప్రాంతాలను వీక్షించే సువర్ణావకాశం కల్పిస్తోంది. మరి, ఆ ప్యాకేజీ ఏంటి? ధరల వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ టూరిజం "అరుణాచల మోక్ష యాత్ర"(Arunachalam Moksha Yatra) పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తోంది. 4 రాత్రుళ్లు, 5 పగళ్లుగా సాగే ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్లో జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా అరుణాచలంతో పాటు పుదుచ్చేరి, కాంచీపురం వంటి దర్శనీయ ప్రాంతాలను వీక్షించొచ్చు. ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
టూర్ కొనసాగనుందిలా :
- డే 1 : మొదటిరోజు హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటలకు కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నెం 17653) బయలుదేరుతుంది. ఓవర్‌నైట్ జర్నీ ఉంటుంది.
- డే 2 : రెండో రోజు ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి స్టేషన్ రీచ్ అవుతారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. చెక్ ఇన్ అయ్యాక ఫ్రెషప్ అయ్యి కొన్ని ప్రాంతాల సందర్శనకు వెళ్తారు. Auroville, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్‌ను విజిట్ చేస్తారు. తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుని ఆ నైట్ అక్కడే స్టే చేస్తారు.
- డే 3 : మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి తిరువణ్ణామలైకు స్టార్ట్ అవుతారు. అక్కడికి వెళ్లాక హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫ్రెషప్ అవుతారు. ఆ తర్వాత అరుణాచల ఆలయాన్ని సందర్శించి స్వామిని దర్శనం చేసుకుంటారు. ఆ రాత్రికి తిరువణ్ణామలైలోనే బస చేస్తారు.
- డే 4 : ఉదయం హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురంకు స్టార్ట్ అవుతారు. అక్కడ కామాక్షి అమ్మన్ దేవాలయం, ఏకాంబరేశ్వర్ టెంపుల్‌ను విజిట్ చేస్తారు. అనంతరం 30 కిలోమీటర్ల దూరంలోని అరక్కోణం చేరుకుంటారు. సాయంత్రం 6.05 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఓవర్‌నైట్ జర్నీ ఉంటుంది.
- డే 5 : ఐదో రోజు ఉదయం 07:50 గంటలకు ట్రైన్ కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. దాంతో టూర్ కంప్లీట్ అవుతుంది.
IRCTC సూపర్ ఆఫర్ - తక్కువ ధరకే కర్నాటక టూర్ - 5 రోజులు ఫుల్ ఎంజాయ్!
ధరల వివరాలిలా :
- కంఫర్ట్(3AC) : ట్విన్ షేరింగ్‌కు రూ.19,130, ట్రిపుల్ షేరింగ్ రూ.14,740 చెల్లించాలి. అదే, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.10,700, విత్ అవుట్ బెడ్ అయితే రూ.8,060 పే చేయాలి.
- స్టాండర్డ్(SL) : డబుల్ షేరింగ్ రూ.17,060, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,670 పే చేయాలి. అదే, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.8,630, విత్ అవుట్ అయితే రూ.5,980 చెల్లించాలి.
ప్యాకేజీలో ఉండేవి ఇవే :
- హోటల్ సౌకర్యం
- ట్రైన్ టికెట్లు
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది.
ప్యాకేజీలో ఇవి ఉండవు :
- ఆలయాల్లో దర్శన టికెట్లు
- ట్రైన్లో ఆహార పదార్థాలు
- లంచ్, డిన్నర్
- టూర్ గైడ్
- ఇతర వ్యక్తిగత ఖర్చులు
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ఫిబ్రవరి 27 తేదీ నాడు అందుబాటులో ఉంది.
ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, టికెట్స్ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? - మన దగ్గరలోని ఈ టూరిస్ట్ స్పాట్స్‌పై లుక్కేయండి

