ETV Bharat / offbeat

అరకులో "చలి ఉత్సవాలు" - వేడుకలు ఎప్పుడు, ఎలా ఉంటాయో తెలుసా?

అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు - సైక్లింగ్‌ పోటీలు, లేజర్‌ షో, ప్లవర్‌ షో!

araku_winter_festival_2026
araku_winter_festival_2026 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : November 11, 2025 at 2:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

Araku Winter Festival 2026 : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో చలి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2026 ఏడాదికి సంబంధించి జనవరి 3, 4 తేదీల్లో నిర్వహించే ఉత్సవాలకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌ ఆదేశించారు. అసలు చలి ఉత్సవాలు అంటే ఏమిటి? ఎన్ని రోజులు, ఎలా నిర్వహిస్తారు? వేడుకలు ఎలా ఉంటాయో ఇపుడు తెలుసుకుందాం.

గ్రామాల్లో ఇళ్లు, స్థలాలున్నాయా? - "ప్రాపర్టీ కార్డుల" పంపిణీ కోసం గ్రామసభలు!

araku_winter_festival_2026
araku_winter_festival_2026 (ETV Bharat)

అరకు ఉత్సవాలే చలి ఉత్సవాలు

ప్రకృతి అందాల కలబోతకు కేరాఫ్ అడ్రస్ అరకు లోయ. కాఫీ తోటలకు తోడు ఇక్కడి గిరిజన సంస్కృతి పర్యటకులని విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి అత్యంత శీతల వాతావరణం కారణంగా అరకును ఆంధ్రా ఊటీ అని పిలుస్తుంటారు.

పచ్చని కొండలు, లోయలు, జలపాతాలు, అడవులు కనువిందు చేస్తుంటాయి. కాఫీ తోటలతో పాటు బొర్రా గుహలు, కటికి జలపాతం ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రాంతాలు.

ఈ నేపథ్యంలో అరకు లోయలోని ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, తెగల జీవనశైలిని పర్యాటకులకు పరిచయం చేయడం కోసం ఏటా అరకు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. వీటిని చలి ఉత్సవాలు అని కూడా అంటుంటారు. చలి ఉత్సవాలను ప్రతి సంవత్సరం చలికాలంలో నిర్వహిస్తుంటారు. నూతన సంవత్సరం ప్రారంభంలోనే జనవరిలో ఈ చలి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ కాగా, ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది.

araku_winter_festival_2026
araku_winter_festival_2026 (ETV Bharat)

ఆహ్లాదకరమైన వాతావరణం

అరకు పరిసర ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. చలికాలంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ప్రస్తుతం మంచు కురుస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పర్యటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జనవరి 3, 4తేదీల్లో

అరకులో జనవరి 3, 4 తేదీల్లో చలి ఉత్సవాలు నిర్వహించనుండగా, వేడుకల్లో భాగంగా వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. గిరిజన సంప్రదాయ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు తోడు సైక్లింగ్‌, లేజర్‌ షో, ప్లవర్‌ షో, చిత్రలేఖనం పోటీలు ఉంటాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల గిరిజన కళాకారులు విచ్చేస్తుంటారు. రెండ్రోజుల ఉత్సవాల్లో తొలి రోజు జనవరి 3న వివిధ రకాల స్టాళ్లను ప్రారంభించడంతో పాటు అదే రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, పోటీలు

రెండో రోజు జనవరి 4న సైక్లింగ్‌ పోటీలు, లేజర్‌ షో, ప్లవర్‌ షో కూడా ఏర్పాటు చేస్తారు. గిరిజన సంప్రదాయాలను తెలిపే ప్రదర్శనలు, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీక్షించే అవకాశం ఉంటుంది.

రోజూ చేస్తున్న పని బోర్ కొడుతోందా? - మనసు కొత్తదనం కోరుతోందా? - ఇలా ప్లాన్ చేస్తే ఫుల్ హ్యాపీ!

"విజయవాడ టు తిరుపతి" కొత్తగా వందేభారత్ - నాలుగున్నర గంటల్లోనే చేరుకునే అవకాశం!